E-Paper
Advertisement

Ragi Uttapam Recipe: బరువు తగ్గి నాజూగ్గా కనిపించాలా? ఈ రాగి ఊతప్పం ట్రై చేయండి, తయారీ విధానం కూడా ఈజీ!

Ragi Uttapam Recipe: బరువు తగ్గి నాజూగ్గా కనిపించాలా? ఈ రాగి ఊతప్పం ట్రై చేయండి, తయారీ విధానం కూడా ఈజీ!
Advertisement

Ragi Uttapam Recipe: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో రాగులు మన శరీరానికి కావలసిన కాల్షియం, ఐరన్, ఫైబర్‌ను సమృద్ధిగా అందిస్తాయి. చాలామంది రాగి సంగటి, అంబలి అంటే మొహం చిట్లించుకుంటుంటారు. కానీ అదే రాగి పిండితో ఇలా పది నిమిషాల్లో రాగి ఊతప్పం చేస్తే చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. తక్కువ సమయంలోనే ఎంతో రుచికరంగా, పోషకాలతో నిండిన ఈ ఉత్తప్పం బరువు తగ్గాలనుకునే వారికి కూడా బెటర్ ఆప్షన్.

కావలసిన పదార్థాలు:

రాగి పిండి – 1 కప్పు
రవ్వ – అర కప్పు
పెరుగు – ముప్పావు కప్పు
ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరిగినది)
గ్రీన్ క్యాప్సికం – సగం (సన్నగా తరిగినది)
అల్లం ముక్క – చిన్నది (తురిమినది)
పచ్చిమిర్చి – 2 లేదా 3
జీలకర్ర, ఆవాలు – అర స్పూన్ చొప్పున
బేకింగ్ సోడా – చిటికెడు
కరివేపాకు, కొత్తిమీర – కొద్దిగా
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – కాల్చడానికి సరిపడా

తయారు చేసుకునే విధానం:

Advertisement

ఒక గిన్నెలో మీకు కావాల్సినంత రవ్వ, పెరుగు వేసి బాగా కలపాలి. దీనిలో రాగి పిండిని కూడా చేర్చి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యాప్సికం, అల్లం తురుము, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి బాగా కలుపుకోవాలి. కావాలంటే కొన్ని నీళ్లు పోసి పిండిని దోశ మిశ్రమంలా కలిపి 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

స్టవ్ మీద నాన్‌స్టిక్ తవా పెట్టి, ఈలోపు పిండిలో ఉప్పు, బేకింగ్ సోడా, కరివేపాకు వేసి కలుపుకోవాలి. పెనం వేడెక్కాక కొద్దిగా నూనె రాసి, ఒక గరిటె పిండిని తీసుకుని మందపాటి ఊతప్పంలా వేయాలి. దీనిపై చిన్న చీలికలు చేసి, రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా కాల్చాలి. అంతే.. వేడివేడి రాగి రాగి ఊతప్పం రెడీ. దీన్ని పల్లి చట్నీ లేదా పెరుగుతో తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×