E-Paper
Advertisement

Bhel Puri: ఒక్కసారి ఈ స్టైల్లో బేల్ పూరీ తయారు చేసుకుని తింటే.. ఇక బయట అస్సలు కొనరు!

Bhel Puri: ఒక్కసారి ఈ స్టైల్లో బేల్ పూరీ తయారు చేసుకుని తింటే.. ఇక బయట అస్సలు కొనరు!

Bhel Puri: సాయంత్రం వేళ ఆఫీసు నుండి రాగానే లేదా పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏదైనా స్పైసీగా, పుల్లపుల్లగా తినాలి అనుకుంటుంటారు. అలాంటప్పుడు చాలామంది అమ్మలకు ఠక్కున గుర్తొచ్చేది బేల్ పూరీ. అయితే అస్తమానం బయట కొనుక్కుని తింటే డబ్బులతో పాటు ఆరోగ్యం కూడా పోతుంది. అందుకే ఇంట్లోనే, కేవలం పది నిమిషాల్లో స్ట్రీట్ స్టైల్ టేస్ట్‌తో బేల్ పూరీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

మరమరాలు – 2 కప్పులు
సన్న కారప్పూస – అర కప్పు
ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినవి)
టొమాటో – 1 (సన్నగా తరిగినవి)
ఉడికించిన బంగాళదుంప – 1 (చిన్న ముక్కలుగా కోసినవి)
పల్లీలు – పావు కప్పు (వేయించినవి)
పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి)
చింతపండు చట్నీ – 2 స్పూన్లు
పుదీనా చట్నీ – ఒక స్పూన్
కారం – అర టీస్పూన్
చాట్ మసాలా – ఒక టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర, నిమ్మరసం – తగినంత

బేల్ పూరీ తయారీ విధానం:

ఓ వెడల్పాటి గిన్నెలో కరకరలాడే మరమరాలను వేయాలి. ఒకవేళ మరమరాలు మెత్తగా ఉంటే, కాసేపు బాణలిలో వేయించి తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి మళ్లీ ఒకసారి కలపాలి.

ఇప్పుడు అసలైన రుచిని ఇచ్చే స్వీట్ చింతపండు చట్నీ, ఘాటైన పుదీనా చట్నీ వేసి మిశ్రమం అంతా పట్టేలా కలపాలి. చివరగా సన్న కారప్పూస, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని, కాస్త నిమ్మరసం పిండితే బేల్ పూరీ రెడీ. దీన్ని వెంటనే సర్వ్ చేసుకుంటే ఆ కరకరలాడే రుచి అద్భుతంగా ఉంటుంది.

Related News

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

వెజ్ ఓట్స్ ఉప్మా.. డయాబెటిస్ ఉన్నవారికి, డైట్ చేసేవారికి పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్!

కేవలం 3 వస్తువులతో కమ్మని వెనీలా ఐస్‌క్రీమ్.. పిల్లల ఫేవరెట్ డిజర్ట్ అయిపోద్ది!

Big Stories

×