E-Paper
Advertisement

BJP President Arrest: బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్ట్.. తార్నాకలో ఉద్రిక్తత

BJP President Arrest: బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్ట్.. తార్నాకలో ఉద్రిక్తత
Advertisement

BJP President Arrest: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ తార్నాకలోని ఆయన నివాసం వద్ద ఆయనను ఆదివారం అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఇరు వర్గాల మధ్య ఇటీవల ఘర్షణ జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అక్కడికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేశారు. రామచందర్ రావు బాన్సువాడ వెళ్లేందుకు ప్రయత్నించడగా పోలీసుల ఆయనను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. దీంతో రామచందర్‌రావు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అక్రమ అరెస్టులు

‘పోలీసులను ఉసిగొలిపి అక్రమ అరెస్టులు చేయిస్తూ ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతుంది కాంగ్రెస్ పార్టీ. సెక్యులరిజం పేరుతో ఎంఐఎంకి తొత్తులా వ్యవహరిస్తూ హిందువులపైనే దాడులు చేస్తున్నారా? ఇక చూస్తూ ఊరుకోం.. బీజేపీ కార్యకర్తలపై, హిందువులపై దాడి చేస్తే సహించబోం’- ఎన్. రామచందర్ రావు 

ఎంఐఎం చేతిలో కాంగ్రెస్ ప్రభుత్వం

Advertisement

“కామారెడ్డిలో ఎమ్మెల్యేపై దాడి, బాన్సువాడిలో దాడులను ఖండిస్తూ.. బాధితులను పరామర్శించేందుకు నేను బయలుదేరితే నన్ను అరెస్టు చేశారు. మా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తే ఊరుకునేది లేదు. ఇప్పటికే బాన్సువాడలో 80 మందిని అన్యాయంగా అరెస్టు చేశారు. ఈ ప్రభుత్వం ఎంఐఎం చేతిలో ఉంది. నిరసన తెలిపేందుకు బంద్ ప్రకటిస్తే.. 144 సెక్షన్ పెట్టి బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేస్తారు. ఒక్కరినైనా ఎంఐఎం కార్యకర్తను అరెస్టు చేశారా?. పోలీసులు ప్రభుత్వ తొత్తులుగా మారారు. కాంగ్రెస్, ఎంఐఎం మాటలు విని బీజేపీ, హిందూ సంఘాల నేతలను వేధిస్తున్నారు.” – రామ చందర్ రావు 

Also Read:వారి వల్లే బీజేపీకి ప్లస్..కాంగ్రె‌స్‌కు మైనస్..బీ కేర్ ఫుల్!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×