E-Paper
Advertisement

Shambhala Movie Review : శంబాల రివ్యూ.. ఆదికి ఉల్క పోటు

Shambhala Movie Review : శంబాల రివ్యూ.. ఆదికి ఉల్క పోటు
Advertisement

Shambhala Movie Review : ఆది సాయి కుమార్ అప్పుడెప్పుడో 2011లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అంటే దాదాపుగా 13 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు. కానీ, ఒక్కటి కూడా చెప్పుకునే మూవీ లేదు ఆయనకు. ఇప్పుడు అలా చెప్పుకునే మూవీ శంబాల అని చెప్పుకుంటున్నారు. అంతలా ఈ మూవీలో ఏం ఉంది? నిజాంగానే 13 ఏళ్ల ఆది సాయి కుమార్ నిరీక్షణకు తెర పడేలా ఈ మూవీ ఉందా? అనేది ఈ రివ్యూలో చూద్దాం..

కథ :

శంబాల అనే చిన్న పల్లెటూరు. ఆ పల్లెకు కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉంది. అలాంటి పల్లెలో ఉల్క వచ్చి పడుతుంది. ఉల్క రావడంతో ఆ శంబాల అనే గ్రామంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఇదిలా ఉండగా.. ఆ ఉల్కను పరీక్షించడానికి ఆ గ్రామానికి దేవుళ్లను నమ్మని ఓ సైంటిస్ట్ విక్రమ్ (ఆది సాయి కుమార్) వస్తాడు. విక్రమ్ వచ్చిన తర్వాత… ఆ గ్రామంలో సమస్యలు మరింతగా పెరుగుతాయి. ఒక్కక్కరు పిచ్చి పట్టినట్టు అందరినీ చంపుతూ ఉంటారు. వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారు? ఉల్క పడటానికి… వాళ్లు అలా చేయడానికి కారణం ఏంటి? అనేది హీరో విక్రమ్ఛే ఎలా ఛేదించాడు?… దీనికి దేవీ (అర్చన అయ్యార్) ఎలా సాయం చేశారు? అసలు దేవీ ఎవరు అనేది మిగితా కథ.

విశ్లేషణ:

Advertisement

శంబాల మూవీ గురించి మాట్లాడే టైంలో ముందు డైరెక్టర్ యుగంధర్ ముని గురించి ఒక ముక్కలో మాట్లాడుకుందాం. గతంలో ఈయన “A (Ad Infinitum)” అనే మూవీ చేశాడు. అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు. దీని తర్వాత మరో సినిమా స్టార్ట్ చేశారు. అది పూర్తి కాకుండానే ఆగిపోయిందనే ప్రచారం ఉంది. అలాంటి టైంలో ఈ శంబాలను తెరకెక్కించాడు. కాన్సెప్ట్.. కథ, స్క్రీన్ ప్లే అన్నింటినీ పక్కాగా ప్లాన్ చేశాడు అని అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత.

డైరెక్టర్ కథను ఎంత నమ్మాడో.. హీరో ఆది సాయి కుమార్ కూడా అంతే నమ్మాడు. అందుకే ఇలాంటి అవుట్ పుట్ వచ్చింది. సినిమా స్టార్ట్ అవ్వడం మొదలు.. క్లైమాక్స్ వరకు వెతికినా… పెద్ద మైనస్‌లు కనిపించవు. అక్కడక్కడ మన మెదడుకు మొత్తం పని పెట్టి తప్పులు వెతికినా.. తర్వాత శ్రీ చరణ్ పాకాల నుంచి వచ్చిన మ్యూజిక్ వల్లో… లేదా డైరెక్టర్ బెటర్ స్క్రీన్ ప్లే వల్లో.. కానీ, అవి మర్చిపోతాం. కథలో పెద్దగా ట్విస్ట్‌లు ఏం ఉండవు. హీరోయిన్ విషయంలో ఓ ట్విస్ట్ పెట్టాడు. కానీ, దాన్ని మనం కాస్త ముందే పసిగట్టేస్తాం. అయినా.. సినిమా ఎక్కడా నిరూత్సహపరచదు.

Advertisement

1980 నేపథ్యంలో సాగే స్టోరీ.. అందులో మైథాలజీ, సైన్స్ పెట్టి.. ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకుండా.. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా సినిమా చేశారు. మధ్యలో ఈశ్వరుడు – అసుర యుద్ధం అంటూ ఓ టాపిక్ తీసుకొచ్చి.. సినిమాకు దాన్ని కనెక్ట్ చేయడం కూడా బాగుంది.

అలాగే మనిషికి ఉండే ఆరు శత్రువులు (అరిషడ్వర్గాలు)… కామ (కోరిక), క్రోధ (కోపం), లోభ (దురాశ) తో పాటు మోహ (అనుబంధం), మద (అహంకారం), మాత్సర్యం (అసూయ) కూడా కథకు సరిగ్గా కనెక్ట్ చేశాడు. నిజానికి సినిమాకు ఈ కాన్సెప్ట్ హై ఇస్తుంది. మొత్తంగా ఆదికి 13 ఏళ్ల తర్వాత ఉల్కతో అదృష్టం వచ్చిందని అనుకోవచ్చు.

దీంతోపాటు సినిమాలో ఉన్న కొన్ని పాత్రలను డైరెక్టర్ సరిగ్గా వాడుకున్నాడు. వారి నుంచి కావాల్సినంత ఫర్పామెన్స్‌ను రాబట్టుకున్నాడు డైరెక్టర్. రవి వర్మ, మీసాల లక్షణ్, ఇంద్రనీల్ లో ఇలాంటి నటనను మనం ఎప్పుడూ చూడలేం. ఆది సాయి కుమార్ కూడా ది బెస్ట్ ఫర్ఫామెన్స్ ఇచ్చాడు. అలాగే చైత్రా పాత్రలో నటించిన పాప కూడా బాగా చేసింది.

టెక్నికల్ గా అంటే.. పైన చెప్పినట్టు శ్రీ చరణ్ పాకాల సినిమాను మరింతగా నిలబడేలా చేశాడు. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ పర్లేదు. సెకండాఫ్ లో కూడా కొంత పని పెడితే బాగుండు అనిపించింది. నిర్మాణ విలువలు కూడా పర్లేదు.

ప్లస్ పాయింట్స్ :

కథ & కథనం & కాన్సెప్ట్
ఆది సాయి కుమార్
ఇంటర్వెల్ & క్లైమాక్స్
మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ లో కొంత వరకు ల్యాగ్

మొత్తంగా…  శంబాల.. ఓ ఆత్మ శోధనతో కూడిన దృశ్య కావ్యం

Shambhala Movie Rating : 3 / 5

Related News

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

Big Stories

Advertisement
×