E-Paper
Advertisement

Band Melam movie review: ‘బ్యాండ్ మేళం’ రివ్యూ : ‘ఉయ్యాలా జంపాలా’ స్పూఫ్ మాదిరి!

Band Melam movie review: ‘బ్యాండ్ మేళం’ రివ్యూ : ‘ఉయ్యాలా జంపాలా’ స్పూఫ్ మాదిరి!
Advertisement

Band Melam movie review: ‘కోర్ట్’ పెయిర్ అయినటువంటి హార్ష్ రోషన్, శ్రీదేవి ఆపళ్ళ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. వీరిని హీరో హీరోయిన్లుగా పెట్టి స్టార్ రైటర్ కోన వెంకట్ నిర్మాతగా ‘బ్యాండ్ మేళం’ అనే సినిమాను రూపొందించారు. మరి ఈ సినిమా కూడా ‘కోర్ట్’ మాదిరి మెప్పించిందా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :

కథ:

యాదగిరి అలియాస్ గిరి (హ‌ర్ష్ రోష‌న్‌) ఓ జమిందారీ కుటుంబానికి చెందిన కుర్రాడు. అతని తాత, అతని తండ్రి సుందరయ్య(గోపరాజు విజయ్) దానధర్మాలు చేయడంతో వీరి ఆస్తి తరిగిపోతూ వస్తుంది.గిరి తండ్రి దగ్గర సాయం పొందిన అతని మావయ్య సాయన్న(సాయి కుమార్) ఆస్తులు పెంచుకుంటూ పోతాడు. గిరి కుటుంబం పేద కుటుంబం అయిపోతుంది. మరోపక్క గిరికి మరదలు  రాజీని (శ్రీదేవి ఆపళ్ళ) ఇచ్చి పెళ్లి చేయాలని చిన్నప్పుడే సుందరయ్య నిశ్చయిస్తాడు. ఆ టైంకి సాయన్న వద్ద ఆస్తులు ఏమీ ఉండవు కాబట్టి ఓకే అంటాడు.కానీ ఎప్పుడైతే గిరి కుటుంబం ఆస్తులు కోల్పోయిందో.. సాయన్న తన కూతురు రాజీని గిరికి అతని కుటుంబానికి దూరం పెడుతూ ఉంటాడు. కానీ గిరి సరిగ్గా చదవడు. టెన్త్ కూడా పాసవ్వడు.దీంతో ఊర్లో బ్యాండ్ మేళం నడుపుతూ ఉంటాడు. ఆ కారణం చూపించి గిరిని రాజీకి ఇంకా దూరం చేయాలని సాయన్న ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే.. తర్వాత రాజీకి వేరే అబ్బాయితో పెళ్లి నిశ్చయిస్తాడు రాజన్న. కానీ రాజీ తన క్లాస్ మేట్ తో లేచిపోతుంది. ఆ తర్వాత సాయన్న ఏమయ్యాడు? గిరి జీవితం ఏమైంది? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా

విశ్లేషణ :

Advertisement

అప్పుడప్పుడు సినిమాలు చూసేవారికి కూడా ఈ కథ చెబితే ఇందులో కొత్తదనం ఏముంది? ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్ట్ తో ‘ఉయ్యాలా జంపాలా’ వంటి ఎన్నో సినిమాలు వచ్చాయి కదా? అని ఇట్టే అనేస్తారు. మరి స్టార్ రైటర్ కోన వెంకట్ కి కథ విన్నప్పుడు అలాంటి ఫీలింగ్ కలగలేదా? అనేది అర్థం కాని ప్రశ్న. ‘కోర్ట్’ పెయిర్ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. కాబట్టి.. వీళ్ళతో సినిమా చేసేసి క్యాష్ చేసుకుందాం. ఓటీటీకి అమ్మేసినా డబ్బులు వచ్చేస్తాయి అనే ఇంటెన్షన్ తో ‘బ్యాండ్ మేళం’ సినిమాని రూపొందించినట్టు ఉంది తప్ప.. ఇది సిన్సియర్ అటెంప్ట్ అనే ఫీలింగ్ మచ్చుకైనా కలగదు. దర్శకుడు సతీష్ జవ్వాజిని ప్రమోషన్స్ లో టీం తెగ పొగిడేసింది. సినిమా చూశాక ఆ ప్రమోషనల్ వీడియోస్ చూస్తే ఆడియన్స్ కి బోలెడంత ట్రోల్ స్టఫ్ దొరుకుతుంది. ఎంత పాత కథ తీసుకున్నా.. ట్రెండ్ కి తగ్గట్టు కొత్త మెరుపులు అద్దితే యూత్ కనెక్ట్ అయ్యి సూపర్ హిట్లుగా నిలుపుతున్న సందర్భాలు చూస్తున్నాం. కానీ కేవలం కోన వెంకట్ అనే  బ్రాండ్ ఉంది కదా అని ‘బ్యాండ్ మేళం’ వంటి టేకిట్ గ్రాంటెడ్ సినిమాలు తీసేసి.. చిరంజీవి వంటి స్టార్స్ తో ప్రమోషన్ చేయిస్తే ఆడియన్స్ ధియేటర్ కు వచ్చేస్తారు అనే పద్ధతిని ఫాలో అయితే అది మూర్ఖత్వం అవుతుంది. కొత్త ఫిలిం మేకర్స్ కి అయితే అమాయకత్వం అనే ట్యాగ్ అయినా ఇచ్చి సరిపెడతారు. కోన వెంకట్ వంటి వాళ్ళకి అయితే అలా కాదు కదా. పోనీ మేకింగ్ వాల్యూస్ లో ఏమైనా రిచ్ నెస్ ఉందా అంటే.. అదీ లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చీప్ గా ఉన్నాయి. యూట్యూబ్ కంటెంట్ కూడా క్వాలిటీగా వస్తున్న రోజుల్లో ఇలాంటి ప్రొడక్షన్ వాల్యూస్ కి ప్రేక్షకులు టికెట్ డబ్బులు ఎలా పెడతారు? ఎందుకు పెడతారు? నెగిటివ్స్ అన్నీ పక్కన పెట్టి పాజిటివ్స్ గురించి ఏమైనా ఉన్నాయా అంటే.. అది మ్యూజిక్ అనే చెప్పాలి. విజయ్ బుల్గేనిన్ కంపోజ్ చేసిన పాటలు బాగున్నాయి. వినడానికి మాత్రమే నండోయ్..! ఆర్ఆర్ ఓకే. నటీనటుల విషయానికి వస్తే.. హార్ష్ రోషన్ చాలా యాక్టివ్ గా పెర్ఫార్మ్ చేశాడు. కానీ పాత్రలో ఎటువంటి ఎమోషన్ లేకపోవడం వల్ల అతని పెర్ఫార్మన్స్ ఓవర్ యాక్షన్ చేస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది. శ్రీదేవి ఈ సినిమాలో మరీ చిన్న పిల్లలా కనిపిస్తుంది. ఆమె హీరోయిన్ అనడానికి లుక్స్ కన్విన్సింగ్ గా లేవు. సాయి కుమార్, గోపరాజు విజయ్ వంటి సీనియర్లు హడావిడి హడావిడిగా వచ్చి పెర్ఫార్మ్ చేసి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది తప్ప పాత్రని ఓన్ చేసుకుని నటించినట్టు అనిపించదు. మిగతా నటీనటుల పాత్రలు ఎవ్వరికీ గుర్తుండవు.

ALSO READ:Jr NTR: భార్య ప్రణతి బర్తడే..ఎన్టీఆర్ స్పెషల్ సర్ప్రైజ్!

ప్లస్ పాయింట్స్ :

Advertisement

మ్యూజిక్
కోర్ట్ పెయిర్

మైనస్ పాయింట్స్ :

పాత కథ
కొత్తదనం లేని కథనం
నిర్మాణ విలువలు
డైరెక్షన్
మొత్తంగా ‘బ్యాండ్ మేళం’ … ఉయ్యాలా జంపాలా’ వంటి పాత కథల స్పూర్తితో రూపొందిన ఓ నిబ్బా నిబ్బీల ప్రేమ కథ. దీనిని థియేటర్లోనే కాదు ఓటీటీలో భరించడం కూడా కష్టమే.

రేటింగ్ : 1/5

Related News

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

మకుటం మూవీ రివ్యూ: విశాల్ ఫ్యాన్స్‌కి పండగేనా? సినిమా ఎలా ఉందంటే?

Big Stories

Advertisement
×