Gayapadda Simham Twitter Review : ఈమధ్య సినిమాలకు డైరెక్టర్లుగా పనిచేస్తున్న చాలామంది నటులుగా ఎంట్రీ ఇస్తున్నారు. కొంతమంది ఏకంగా ఇండస్ట్రీలో హీరోలుగా పరిచయం అవుతున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అండ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ ఒకరు. ఈయన ఇప్పటికే పలు సినిమాలలో నటించి హీరోగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా ఈ డైరెక్టర్ లీడ్ రోల్‌లో నటిస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచీ ‘గాయపడ్డ సింహం’ పై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి.. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇవాళ మేడే సందర్బంగా ఈ మూవీ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది..? తరుణ్ భాస్కర్ ఖాతాలో హిట్ సినిమా పడిందా..? మూవీ పై నెటిజన్ల స్పందన ఎలా ఉంది అన్నది ఒకసారి తెలుసుకుందాం..
డైరెక్టర్ హీరో, తరుణ్ భాస్కర్ నూతన దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం గాయపడ్డ సింహం.. ఈ సినిమాలో చిట్టి ఫేమ్ ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుండి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తరుణ్ భాస్కర్ నటన, విలన్ గా జెడీ చక్రవర్తి ఇద్దరు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నారని అప్డేట్స్ చూస్తే తెలుస్తుంది. ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ ఎలా ఉంది? తరుణ్ భాస్కర్ ఖాతాలో హిట్ పడిందా? ఈ మూవీ పై పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది అన్నది ట్విట్టర్ రివ్యూలో చూసేద్దాం..
గాయపడ్డ సింహం మూవీలో తరుణ్ భాస్కర్ అద్భుతంగా నటించారు. ఆయన కామెడీ హిలరియస్ గా ఉంది. మసాలా మ్యాజికల్ స్టఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇందులో శ్రీ విష్ణు నటనకు ఫుల్లు మార్కులు పడ్డాయి అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు..
Gayapadda simham will he entertain on a hillarious masala magical with very satisfying stuff !🔥🔥🔥👌👌👌@sreevishnuoffl will be an standout highlight.#GAYAPADDASIMHAM #GPSonMay1st pic.twitter.com/sXOEZwYTdB
— Karthikuuu (@Anchor_Karthik_) April 30, 2026
తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం మూవీ చాలా క్రేజీగా ఉంది. సమ్మర్ కు బెస్ట్ బ్లాస్ట్ మూవీగా ఇది ఉంటుంది. ఆడియన్స్ కి ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటూ.. ఈ సమ్మర్ కి గట్టిగా ఈ సినిమాతో కొట్టాలి అని ఓ నెటిజను తన ట్విట్టర్ అకౌంట్ లో రాసుకోవచ్చారు..
Saw a crazy, brilliant new-age entertainer!#gayapaddasimham This summer is going to be a blast Can't wait to experience it with the audience @pavansadineni Bava summer ki gattiga kodthunnam , @VijayKrishnaLin dude party ,#kalyanmantina ,#bhanukiranpratapa get ready for bigparty pic.twitter.com/iuH3zlBlDg
— HARIISH DHANUNJAYA (@actorHariish_D) April 30, 2026
గాయపడ్డ సింహం ఫస్ట్ అఫ్ చాలా బాగుంది.. సెకండ్ ఆఫ్ అంతగా కామెడీగా లేకపోయినా పర్వాలేదు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడక్కడ కొంచెం సీన్లు లాగైనా సరే సినిమా మొత్తం చాలా బాగుంది అంటూ ఓ నేటిజను ట్రీట్ చేశారు.
Good 1st half fun worked some didn’t and cameos worked good but needs strong 2nd half as of now okay i enjoyed but in some scenes felt a bit lag but overall full of fun some old famous movies references are so many there some worked some didn’t as of now 4/5😂❤️🔥 #GaayaPaddaSimham https://t.co/trzF9kx4Ix pic.twitter.com/zyYn1VZeez
— urstrulynameisHEM (@_mr_hem_) April 30, 2026
ఈ సినిమాలో హీరో శ్రీ విష్ణు దాదాపు 30 నిమిషాల వరకు ఉంటాడు. అతని ఎంట్రీ ఇచ్చి వెళ్ళిపోయేంతవరకు ప్రతి సీను కూడా కామెడీతో కడుపుబ్బా నవ్వించేసింది.. శ్రీ విష్ణు ఈ సినిమాని పైకి లేపాడు అని చెప్పడంలో సందేహం లేదు. సెకండ్ హాఫ్ కూడా చాలా చాలా బాగుంది. ఫన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అంటూ ఓ నేటిజను ట్వీట్ చేశారు..
Sree Vishnu is the hero of the film.. aa 30 mins non stop fun asalu. Complete ga lepadu film ni.🙌🏻
Second half spoofs worked very well. 🥳
Continuous ga fun blocks untay, full ga pelayi avi.🔥🤣
PAKKA FAMILY WATCH💯
— Pranith Chowdary🐉🦚🚩 (@Pranith31x29) May 1, 2026
A refreshing and entertaining film with natural comedy and a good storyline. The humor feels organic and not forced. BGM adds nice impact in key scenes. Definitely worth watching#GaayapaddaSimhampic.twitter.com/ak1ujShsZP
— TollyBuzz (@tollybuzz1) May 1, 2026
#GaayapaddaSimham movie review
⭐️⭐️⭐️
Positives: Tharun Bhascker, Sri Vishnu, comedy
Multiple movies references 😂#Salaar #Bhahubali #Satya #ArjunReddy #Bommarilu … pic.twitter.com/9AH6WdqKpO— Ravi (@nravindra84) May 1, 2026
JD Chakravarthi gaaru RETURN ante screen SHAKE avtundi 😌 FDFs lo direct BLAST! 🥳 #GaayaPaddaSimham pic.twitter.com/qMNGZdYu4l
— Danyy (@Leoo__31) April 30, 2026
మొత్తానికి గాయపడ్డ సింహం సినిమా కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఫుల్ ఆఫ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ జనాలని బాగా ఆకట్టుకుంది.. ప్రస్తుతానికైతే ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో తన కామెడీతో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు హీరో తరుణ్ భాస్కర్. ఇప్పటివరకు అయితే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి ఈ మూవీ కలెక్షన్స్ ఏ మాత్రం వసూల్ అవుతాయో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు..