Asian Games 2026 – Team India Rooms: టీమిండియా ( Team India) మరో రసవత్తర ఫైట్ కోసం సిద్ధం కానుంది. ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ లో ( 2026 Asian Games tournament) పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. టీ20 ఫార్మాట్ లో జరగనున్న నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలోని టీమిండియా ( Team India).. ఈ ఏషియన్ గేమ్స్ ( 2026 Asian Games tournament) ఆడనుంది. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ క్రికెట్ మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే ఈ టోర్నమెంట్ ప్రారంభానికి మరో 15 రోజుల సమయం కూడా లేదు. ఈ క్రమంలో టీమిండియా ప్లేయర్లు బస చేసే రూమ్స్ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఓయో రూంలలో ( Oyo Rooms) ఉండేందుకు టీమ్ ఇండియా క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారని కూడా తాజాగా ఓ పోస్టు వైరల్ గా మారింది.
ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ( 2026 Asian Games tournament) జపాన్ లో ( Japan nagoya) జరగనున్నాయి. అయితే ఈ ఏషియన్ గేమ్స్ నేపథ్యంలో వేలాది సంఖ్యలో అథ్లెట్స్ వస్తున్నారు. అదే సమయంలో క్రికెటర్లు కూడా యాడ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో క్రికెటర్లకు స్పెషల్ గా టెంట్లు వేసి డ్రెస్సింగ్ రూములు తయారు చేసింది ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ యాజమాన్యం. అయితే ఈ టెంట్లకు 500 మీటర్లు వాష్ రూమ్స్ పెట్టింది. దీనిపై బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. డ్రెస్సింగ్ రూమ్స్ పరిస్థితులు దారుణంగా ఉంటే… టీమిండియా B గ్రేట్ జట్టును జపాన్ కు పంపిస్తామని బిసిసిఐ వెల్లడించినట్లు కూడా తెలుస్తోంది.
చిన్న గదుల్లో తమ ప్లేయర్లు సర్దుకోలేరని… బయట హోటల్స్ బుక్ చేసుకుంటామని బీసీసీఐ సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కూడా ఏషియన్ గేమ్స్ యాజమాన్యం పర్మిషన్ ఇచ్చిందట. ఇందులో భాగంగానే నగోయాలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్స్ బుక్ చేసేందుకు బీసీసీఐ కసరతులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ప్లేయర్లు విపరీతంగా వస్తున్న నేపథ్యంలో హోటల్స్ కూడా బుక్ అయ్యాయట. కేవలం ఓయో రూమ్స్ మాత్రమే.. నగోయాలో ఉన్నాయని ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఓయో రూమ్స్ లో అయినా ఇండియన్ క్రికెటర్లను పెట్టాలని ఆలోచన చేస్తున్నారట. అలా చేస్తే పరువు పోతుందని కూడా ఆలోచనకు వచ్చింది బీసీసీఐ. దానికంటే టెంట్లే నయం అంటూ మరికొంతమంది అంటున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటనలు రానుంది.