E-Paper
Advertisement

సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ చేసిన హంగామా ప్రేక్షకులను మెప్పించిందా?..

సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ చేసిన హంగామా ప్రేక్షకులను మెప్పించిందా?..
Advertisement

Godari Gattupaina Review: గోదావరి నేపథ్యం అంటేనే పచ్చని ప్రకృతితో పాటు గుండెల్ని పిండేసే ఎమోషన్స్ ఆశిస్తాం. ‘మేమ్ ఫేమస్’ సినిమాతో తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా, సీనియర్ నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గోదారి గట్టుపైన’. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.

Read also-తుది దశకు ‘పెద్ది’.. ఎడిటింగ్ రూమ్ నుంచి క్రేజీ అప్‌డేట్.. ఫ్యాన్స్ రెడీగా ఉండండి..

స్టోరీ ఏంటంటే..

Advertisement

శ్యామ్ బాబు (జగపతి బాబు) తన కూతురు మాయ (నిధి ప్రదీప్)ను ప్రాణంగా ప్రేమిస్తాడు. ఆమె అడిగిందల్లా చేస్తూ మహారాణిలా చూసుకుంటాడు. అదే ఊరిలో ఆటో నడుపుకునే కుర్రాడు రాజు (సుమంత్ ప్రభాస్)తో మాయ ప్రేమలో పడుతుంది. అయితే, తన తండ్రి తనపై ఉంచిన గౌరవాన్ని, నమ్మకాన్ని పోగొట్టుకోకూడదని మాయ తన ప్రేమకు దూరంగా ఉంటుంది. ఈ తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ మధ్యలో ఆటో రాజు ప్రేమ కథ ఏ తీరానికి చేరిందనేదే ఈ చిత్ర కథాంశం.

విశ్లేషణ

దర్శకుడు సుభాష్ చంద్ర ఎంచుకున్న పాయింట్ చాలా పాతది. ఒకప్పుడు మనం పదే పదే చూసిన తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ డ్రామానే మరోసారి గుర్తుకు తెస్తుంది. పాయింట్ పాతదైనా, కనీసం స్క్రీన్ ప్లే లోనైనా కొత్తదనం చూపిస్తారేమో అని ఆశిస్తే నిరాశే ఎదురవుతుంది. సినిమా ప్రారంభమైన కాసేపటికే తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఈజీగా ఊహించేయవచ్చు. ముఖ్యంగా సెకండాఫ్ లో సాగదీత ఎక్కువగా అనిపిస్తుంది. దర్శకుడు రాసుకున్న ట్విస్టులు ప్రభావం చూపించలేకపోయాయి. ప్రధాన పాత్రల మధ్య ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అవ్వడం సినిమాకు పెద్ద దెబ్బ. సుమంత్ ప్రభాస్ తన మార్క్ ఎనర్జీతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు కానీ అది ఎంత వరకూ పండిందో ప్రేక్షకుడే నిర్ణయించాలి. ఇక ఫస్టాఫ్ లో వచ్చే సుదర్శన్ కామెడీ అక్కడక్కడా నవ్విస్తుంది. జగపతి బాబు తన పరిధి మేర పాత్రకు న్యాయం చేశారు.

Advertisement

Read also-Brahmamudi Serial Today Episode May 8th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్లిన ఇందు 

సాంకేతికంగా..

టెక్నికల్ గా సినిమా యావరేజ్ గానే ఉంది. సంగీతం పెద్దగా ఆకట్టుకోదు, పాటలు గుర్తుపెట్టుకునేలా లేవు. నేపథ్య సంగీతం కూడా పాత సినిమాలను గుర్తుకు తెస్తుంది. అయితే గోదావరి అందాలను చూపించిన విధానం బాగుంది. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే సెకండాఫ్ లోని బోరింగ్ సీన్లను తగ్గించవచ్చు.

బలాలు

  • సుమంత్ ప్రభాస్, జగపతి బాబు నటన
  • సుదర్శన్ కామెడీ
  • గోదావరి విజువల్స్

బలహీనతలు

  • అవుట్ డేటెడ్ కథ
  • బోరింగ్ స్క్రీన్‌ప్లే
  • పండని ఎమోషన్స్
  • క్లైమాక్స్
  • సంగీతం

మొత్తంగా.. గోదారి గాలి తగిలింది ఈ వారం గోదావరి కోసం అయిన చూడాల్సిన చిత్రం

 

రేటింగ్: 2.75/5

 

Related News

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

మకుటం మూవీ రివ్యూ: విశాల్ ఫ్యాన్స్‌కి పండగేనా? సినిమా ఎలా ఉందంటే?

హుషారు పిట్టలు మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

Big Stories

Advertisement
×