Rao Bahadur Movie Review:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సత్యదేవ్.. తొలిసారి తన కలను నెరవేర్చుకుంటూ కమల హాసన్, సూర్య వంటి అగ్ర హీరోల దారిలో.. తన కెరియర్ లో వినూత్న పాత్ర పోషించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే రావు బహదూర్. మరొకవైపు కేరాఫ్ కంచరపాలెం సినిమాతో దర్శకుడిగా మారి టాలీవుడ్ మొత్తం తన డైరెక్షన్ గురించి మాట్లాడుకునేలా చేసిన వెంకటేష్ మాహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎట్టకేలకు జూలై 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ , ట్రైలర్ , టీజర్ సినీ లవర్స్ లో ఎక్కడలేని ఆసక్తినీ క్రియేట్ చేశాయి. మరి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏ విధంగా ఆకట్టుకుంది ? తన డ్రీమ్ రోల్ అంటూ గెటప్ మార్చి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా? మహేష్ బాబు చేతులు కలిపాడని, సుకుమార్ గట్టిగా పొగిడాడు అంటూ భారీ హైప్ ఇచ్చారు.. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో లేదో ఇప్పుడు చూద్దాం.
ఈ సినిమా కథ 1968 – 91 మధ్య సాగుతుంది. బహదూర్ రాజుల వంశానికి చెందిన పెద్దమనిషి. 60 ఏళ్ల రామప్ప (సత్యదేవ్) లివర్ క్యాన్సర్ తో చివరి స్టేజ్ లో ఉంటాడు. ఇక ఇతడిని కాపాడడానికి వైద్యులు చికిత్స కోసం వస్తారు. రాజవంశ వారసుడిగా పేరున రామప్ప శారీరకంగా బ్రతికే ఉన్నా.. తీవ్రమైన మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటాడు. ఆ పరిస్థితికి అసలు కారణం ఏంటో మొదట ప్రేక్షకులకు కూడా అర్థం కాదు. కథ ముందుకు సాగే కొద్ది కుటుంబ రక్త సంబంధాలు, డిఎన్ఏ చుట్టూ అసలు సంఘర్షణ తిరుగుతుందని ప్రేక్షకుడికి అర్థమవుతుంది. ఇక చనిపోతావని డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చినా ఆయనను బ్రతికించింది.. అనుమానం.. అవును, మీరు విన్నది నిజమే. చిన్న కొడుకు కుసుమప్పకు సంబంధించిన ఒక అనుమానం ఆయన మెదడును తొలుస్తూ ఉంటుంది. మరి ఆ అనుమానం ఏంటి? ఆ రేణుక (దీప థామస్)కి ,రామప్పకి ఉన్న పాత లవ్ ట్రాక్ ఏంటి ? ఈ చిక్కుముడులు విప్పేదే రావు బహదూర్.
also read:విరాజ్ అశ్విన్ ‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్ పై అంచనాలు పెంచేసిన బన్నీ.. స్పెషల్ పోస్ట్ వైరల్!
సినిమా ఎలా ఉందంటే ఓవరాల్ గా సత్యదేవ్ వన్ మ్యాన్ షో. సత్యదేవ్ చాలా బాగా నటించాడు. గొప్ప యాక్టర్ అని మరోసారి నిరూపించుకున్నాడు .60 ఏళ్ల ముసలోడి గెటప్లో ఆ రోగంతో పడే బాధలు, ఎమోషన్స్ అన్నీ చాలా చక్కగా పండించాడు. కళ్ళతోనే మాట్లాడాడు. ఆయన యాక్టింగ్ కి మాత్రం 100కి 200 మార్కులు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇక డైరెక్టర్ వెంకటేష్ మాహా ఈసారి కూడా కథను చాలా నిదానంగా చెప్పాలనుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో స్టోరీ ఎటు పోతుందో అర్థం కాదు. ఎందుకు ఈ ల్యాగ్, ఎప్పుడు వదులుతాడు అనే రేంజ్ లో ప్రేక్షకులు తలలు పట్టుకుంటారు.
సెకండ్ హాఫ్ మొదలయ్యాక కథకి గేర్ పడుతుంది. ముఖ్యంగా ఆ లాస్ట్ 45 నిమిషాలు మాత్రం ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాడు. క్లైమాక్స్ డైలాగ్ లు అయితే గుండెల్లో గుచ్చుకునేలా ఉంటాయి. అప్పటివరకు ఉన్న బోర్ అంతా ఒక్కసారిగా ఎగిరిపోతుంది. అసలు కథ ఇదన్నమాట అనిపించేలా చేస్తారు.
పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.. కొంతమందికి నచ్చుతుంది.. కొంతమందికి ఎక్కుతుంది.. నిజం చెప్పాలంటే అందరికీ ఎక్కే మసాలా ముద్ద కాదు.. ఫైట్లు, డాన్సులు, రొటీన్ కామెడీ కావాలనుకుంటే మాస్ బ్యాచ్ థియేటర్ వైపు వెళ్ళకండి. కొంచెం ఓపిక చేసుకుని ఫస్ట్ ఆఫ్ భరిస్తే డైరెక్టర్ వెంకటేష్ మహా చెప్పిన ఆ లాస్ట్ మెసేజ్ , విజువల్స్ , క్లైమాక్స్ ట్విస్ట్ లు చూసి బొమ్మ సూపర్ అంటారు.
పీరియడ్ సెటప్ ని కార్తీక్ పర్మార్ కెమెరా బాగా క్యాప్చర్ చేసింది. స్మరణ్ సాయి మ్యూజిక్ మూడ్ కి కరెక్ట్ గా సెట్ అయింది.