E-Paper
Advertisement

‘మా ఇంటి బంగారం’ మూవీ రివ్యూ.. సామ్ హిట్ కొట్టినట్టేనా?

‘మా ఇంటి బంగారం’ మూవీ రివ్యూ.. సామ్ హిట్ కొట్టినట్టేనా?
Advertisement

Maa Inti Bangaram Review: అరేయ్ గ్యాంగ్.. సినిమా ముచ్చట్ల కోసం ఎదురుచూసే మన దోస్తులందరికీ రాం రాం! ఈ సారి థియేటర్ల ముందు ‘మా ఇంటి బంగారం’ అంటూ ఒక ఫ్యామిలీ పంచాయితీ పట్టుకొచ్చింది మన సమంత పాప. పైగా వెనక సీట్లో కూర్చొని స్టీరింగ్ తిప్పింది ఎవరో కాదు.. నందిని రెడ్డి గారు! ‘ఓ బేబీ’ లాంటి మస్త్ సినిమా తర్వాత గీ ఇద్దరి కాంబినేషన్ అనగానే.. థియేటర్‌లో ఈలలు, గోలలు గ్యారెంటీ అనుకున్నాం. మరి గీ బంగారం బాక్సాఫీస్ దగ్గర అసలు సిసలైన పసిడిలా మెరిసిందా? లేక మేకప్ ముక్కలా వెలవెలబోయిందా? కథేందో లోపలికి పోయి చూద్దాం రాండ్రీ!

Read also-Podarillu Today Episode : మహా స్కూటీ డ్రైవింగ్.. మనీష దెబ్బకు నారాయణ అవుట్.. చక్రికీ అవమానం..

అసలు కథేంది భయ్యా?

Advertisement

కథ విషయానికొస్తే.. కొత్తగా బోర్డులేసి మరీ వెతకాల్సిన పనేం లేదు. మన చిన్నప్పటి నుంచి టీవీల్లో, థియేటర్లలో చూసి చూసి అరిగిపోయిన పాత చింతకాయ పచ్చడి ఫ్యామిలీ సెంటిమెంట్, రివెంజ్ డ్రామానే ఇది. ఒక ఇల్లు.. ఆ ఇంట్లో ఉండే ఎమోషన్స్.. వాటి చుట్టూ తిరిగే నలుగురు డమ్మీ విలన్లు. నడుమ ఒక చప్పని ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్! గీ పాత పగలు, ప్రతీకారాల నడుమ నలిగిపోయే తన ఫ్యామిలీని, ఇంటి ఇజ్జత్‌ని మన హీరోయిన్ సమంత ఎట్లా కాపాడుకున్నది? విలన్ల ఆట ఎట్లా కట్టించింది? అనేదే ఈ ‘మా ఇంటి బంగారం’ ముచ్చట.

సినిమాలో నచ్చిన కొన్ని ముచ్చట్లు

సమంత వన్-మెన్ షో: కథలో దమ్ము లేకపోయినా.. మన సమంత మాత్రం తన యాక్టింగ్‌తో సినిమాని ఒంటిచేత్తో లాగాలని గట్టిగానే ట్రై చేసింది. ఎమోషనల్ సీన్లలో, ఫ్యామిలీ సెంటిమెంట్‌లో తన నటన నీట్ గా ఉంది.

Advertisement

అక్కడక్కడా వచ్చే నవ్వులు: సినిమా బాగా సాగదీస్తున్న టైంలో.. అక్కడక్కడా వచ్చే కొన్ని సబ్టిల్ కామెడీ పంచ్‌లు, చిన్న చిన్న నవ్వులు కొంచెం రిలీఫ్ ఇస్తాయి. బోర్ కొట్టే టైంలో గివి కొంచెం ఊరట.

సెకండాఫ్ లో కొంచెం స్పీడ్: ఫస్టాఫ్‌లో కథ ఎక్కడిదక్కడే ఉన్నట్టు అనిపించినా.. సెకండాఫ్‌కి వచ్చేసరికి కొంచెం స్పీడందుకుంటది. సినిమా కొంచెం ముందుకు కదులుతుందనే ఫీలింగ్ వస్తది.

బుర్ర పాడు చేసిన మైనస్ పాయింట్లు

వీక్ విలనిజం: డైరెక్టర్ నందిని రెడ్డి గారు రాసుకున్న ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్ అస్సలు గుండెలకు హత్తుకోదు భయ్యా. దానికి తోడు సినిమాలో విలన్ల క్యారెక్టర్లు ఎంత వీక్ ఉన్నాయంటే.. వాళ్ళని చూస్తే భయం వేయాల్సింది పోయి జాలి వేస్తది. గిట్లాంటి డమ్మీ విలన్లతో మన సమంత ఫైట్లు చేయడం అవసరమా సామీ?

నిద్రపుచ్చే స్క్రీన్‌ప్లే: సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి ఎండ్ కార్డ్ పడే దాకా గ్రాఫ్ మొత్తం ఒకే ఫ్లాట్ గా సాగుతది. ఎక్కడన్నా ఒక హై మూమెంట్ వస్తదా, థియేటర్‌లో గట్టిగా అరుద్దామా అంటే.. డైరెక్టర్ గారు ఆ ఛాన్సే ఇవ్వలేదు. స్క్రీన్‌ప్లే మొత్తం సాగదీసి నిద్రపుచ్చారు.

సోపా సంగీతం : సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ మనకి తెలుసు. కానీ ఇందులో బిజీఎం వింటుంటే.. థియేటర్ స్పీకర్లు కూడా ‘నన్ను వదిలేయ్ భయ్యా’ అని ఏడ్చినంత పని చేసినయి. సబ్‌పార్ మ్యూజిక్‌తో ఉన్న సీన్లని ఇంకాస్త బోర్ కొట్టించారు.

Read also-Intinti Ramayanam Today Episode: సుబ్బారావు కోసం కమల్ మాస్టర్ ప్లాన్.. కమల్ గెటప్ అదుర్స్.. పల్లవికి మైండ్ బ్లాక్..

ఆఖరి మాట

బాటమ్ లైన్ ఏందంటే గ్యాంగ్.. నందిని రెడ్డి-సమంత కాంబో అనగానే ఓ రేంజ్ అంచనాలతో పోతాం కానీ, ఈ ‘మా ఇంటి బంగారం’ లో అంత మేటరేం లేదు భయ్యో. పాత కథని ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా ఫ్లాట్ గా తీసి పారేశారు. సమంత నటన ఒక్కటే కొంచెం ఓకే అనిపిస్తది. థియేటర్‌కి వెళ్లి ఈ ఎండల్లో బుర్ర పాడుచేసుకోవాలా లేదా అనేది మీ ఇష్టానికే వదిలేస్తున్నా!

వన్ లైన్ మాట: కథలో ఏముంది బంగారం.. స్క్రీన్ ప్లే మొత్తం బోరింగ్ గారడీనే సామీ! బంగారం ధరలు ఏమో చుక్కలు చూపిస్తున్న టైం లో మా ఇంటి బంగారం మాత్రం ప్రేక్షులకు  చుక్కలు చూపించింది మరి ఈ బంగారం మూవీ.

Maa Inti Bangaram Review, Rating : 2.5/ 5

Related News

సీక్రెట్ సోల్జర్ మూవీ రివ్యూ…

సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

టైటిల్ మాత్రమే ‘ఎపిక్’.. సెకండ్ హాఫ్ అంతా ‘ట్రాఫిక్’!

ఎపిక్ ట్విట్టర్ రివ్యూ… బేబీ జంట హిట్ కొట్టారా?

‘సర్దార్ 2’ మూవీ రివ్యూ: ఇలా చేశావేంటి కార్తి?

సుహాస్ – సూరి మండాడి మూవీ రివ్యూ.. పోరులో నెగ్గిందెవరు?

‘మారెమ్మ’ మూవీ రివ్యూ: మాస్ మహారాజా తమ్ముడి కొడుకు మెప్పించాడా ?

సహా రివ్యూ: గుండు ఛాలెంజ్‌తో వైరల్.. థియేటర్‌లో మాత్రం..

Big Stories

Advertisement
×