E-Paper
Advertisement

విరాజ్ అశ్విన్ ‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్ పై అంచనాలు పెంచేసిన బన్నీ.. స్పెషల్ పోస్ట్ వైరల్!

విరాజ్ అశ్విన్ ‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్ పై అంచనాలు పెంచేసిన బన్నీ.. స్పెషల్ పోస్ట్ వైరల్!
Advertisement

Allu Arjun:బేబీ సినిమాతో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్న విరాజ్ అశ్విన్ హీరోగా, యశశ్రీ హీరోయిన్గా తెరకెక్కిన వెబ్ సిరీస్ గుర్తుకొస్తున్నాయి. వినోద్ గాలి దర్శకత్వంలో శరత్ చంద్ర నాయుడు నిర్మాణంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ వేదికగా జూలై 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేసిన అల్లు అర్జున్.. ఈ వెబ్ సిరీస్ ద్వారా నిర్మాతగా అవతారం ఎత్తిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ చంద్ర నాయుడుకి స్పెషల్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియాలో ఆ పోస్ట్ వైరల్ గా మారింది.

గుర్తుకొస్తున్నాయి టీమ్ కి బన్నీ స్పెషల్ విషెస్..

చావు కబురు చల్లగా, వినరో భాగ్యము విష్ణు కథ వంటి చిత్రాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేసిన శరత్ చంద్ర నాయుడు నిర్మాతగా మారి తొలిసారి నిర్మించిన వెబ్ సిరీస్ గుర్తుకొస్తున్నాయి. ఈ మేరకు అల్లు అర్జున్ పోస్ట్ పెడుతూ..” నా ప్రియమైన వారికి నా హృదయపూర్వక అభినందనలు. శరత్ చంద్ర అలాగే చిత్ర బృందానికి శుభాకాంక్షలు.. శరత్ చంద్ర నిర్మాతగా మొదటి అడుగు వేయడం చూసి నేను చాలా సంతోషిస్తున్నాను . ఈ అందమైన సిరీస్ కి అభిమానుల ప్రేమ, ప్రశంసలు లభించాలని ,ఈ వెబ్ సిరీస్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సక్సెస్ చూడడానికి ఎదురు చూస్తున్నాను” అంటూ చిత్ర బృందానికి అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అల్లు అర్జున్ సినిమాలు..

Advertisement

ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే.. పుష్ప సినిమాతో ఉత్తమ నటుడు విభాగంలో నేషనల్ అవార్డు అందుకొని.. పుష్ప 2 సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ఈయన ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా సినిమా చేస్తున్నారు. హాలీవుడ్ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా.. రష్మిక మందన్న తో పాటు పలువురు హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు..ఈ సినిమా తో పాటు లోకేష్ కనగరాజు దర్శకత్వంలో AA23 వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది అలాగే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్లాక్ బాస్టర్ పుష్ప ఫ్రాంచైజీ పుష్ప 3 : ది ర్యాంపేజ్ చిత్రంలో కూడా నటిస్తున్నారు బన్నీ.

also read:72వ నేషనల్ ఫిలిం అవార్డ్స్.. రంగంలోకి సౌత్ స్టార్ హీరోలు!

నేషనల్ ఫిలిం అవార్డ్స్ రేస్ లో బన్నీ..

Advertisement

ఇదిలా ఉండగా మరొకవైపు ఈరోజు సాయంత్రం 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన జరగనుంది. ఇక ఈ రేసులో అల్లు అర్జున్ తన పుష్ప 2 చిత్రంతో రంగంలోకి దిగారు. ఇదివరకే పుష్ప చిత్రంతో ఉత్తమ నటుడు విభాగంలో జాతీయ అవార్డు అందుకున్న బన్నీ.. పుష్ప 2 తో కూడా అవార్డు అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరి ఈ రేసులో ఆయనకు అవార్డు వరిస్తుందా ? లేదా? తెలియాలి అంటే ఇంకొన్ని గంటలు వేచి ఉండాలి.

Related News

అంజి మామకు బిగ్ షాక్.. రూ.23 లక్షలు పోయాయట!

విజయ్ పక్కన త్రిష.. విమర్శలకు సంజనా గల్రాని దిమ్మతిరిగే ఆన్సర్!

థియేటర్లకు షాక్.. టికెట్ ధరలపై సర్కార్ కొత్త లెక్క!

వెంకీ–కళ్యాణ్ రామ్ మూవీ.. రిలీజ్ డేట్‌నే టైటిల్‌గా పెట్టేశావు కదయ్యా అనీలూ!

సుమలత ఏకపక్ష నిర్ణయం.. జానీ మాస్టర్ కి ఫిలిం ఫెడరేషన్ ఊహించని షాక్!

మరో లేడీ అభిమాని కోరిక తీర్చిన రామ్ పోతినేని.. వీడియో వైరల్!

అఖండ-2, పెద్ది సినిమాలకు కొత్త రూల్‌.. 20% ఇవ్వాల్సిందే !

బ్రహ్మానందం అన్నయ్య భావోద్వేగం.. ఆ పిలుపు కోసం ఎదురు చూపంటూ..

Big Stories

Advertisement
×