Transfer Trimurthulu Review: ఒకప్పుడు టాలీవుడ్‌ని తన లవర్ బాయ్ ఇమేజ్‌తో ఊపేసిన హీరో వడ్డే నవీన్. 1997లో వచ్చిన ‘పెళ్ళి’ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్‌కి, యూత్‌కి దగ్గరయ్యారు.ఇక చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత లీడ్ రోల్‌లో వస్తున్నాడనేసరికి టాలీవుడ్ సర్కిల్స్‌లో గట్టి హైపే క్రియేట్ అయింది. పైగా ఈసారి పాత లవ్ స్టోరీల జోలికి పోకుండా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ అంటూ ఒక పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఎంచుకునేసరికి అంచనాలు ఆకాశాన్ని తాకాయి. పోస్టర్లు, టీజర్లు చూసి థియేటర్లకు పరిగెత్తిన ఆడియన్స్‌కి ఈ ‘త్రిమూర్తులు’ ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారో చూద్దాం!
కథ పరంగా పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ రా పాయింట్. మన సమాజంలో, ముఖ్యంగా ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లలో బదిలీలు (Transfers) అనేవి ఎంత పెద్ద బిజినెస్‌గా మారాయో అందరికీ తెలిసిందే. ఈ ట్రాన్స్‌ఫర్ల వెనుక నడిచే కోట్లాది రూపాయల మాఫియా, పొలిటికల్ కుట్రల చుట్టూనే ఈ సినిమా కథ తిరుగుతుంది. ఓ సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ (వడ్డే నవీన్) ఈ లూప్‌లోకి ఎలా ఎంటర్ అయ్యాడు? వ్యవస్థలో లంచగొండితనానికి బలైపోయిన ఒక అధికారికి జరిగిన అన్యాయం ఏంటి? ఈ ట్రాన్స్‌ఫర్ మాఫియాను శాసించే ఆ ముగ్గురు ముఠా నాయకులు (అసలైన త్రిమూర్తులు) ఎవరు? వాళ్ల ఆట కట్టించడానికి ఒక సాదాసీదా కానిస్టేబుల్ ఎలాంటి మైండ్ గేమ్స్ ఆడాడు? చివరకు ఈ పొలిటికల్ గారడీ నుంచి ఎలా బయటపడ్డాడు? అనేదే ఈ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ మెయిన్ స్టోరీ.
విశ్లేషణ
ఇన్నేళ్లయినా నవీన్ యాక్టింగ్ బేస్, డైలాగ్ డెలివరీలో బేస్ అస్సలు తగ్గలేదు. ఒక మెచ్యూర్డ్, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌తో సిన్సియర్ కానిస్టేబుల్ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ పాత రోజులను గుర్తుచేసింది. ప్రభుత్వ ఆఫీసుల్లో జరిగే బదిలీల వెనుక ఉండే దందాను, పొలిటికల్ డ్రామాను టచ్ చేయాలనుకున్న డైరెక్టర్ ఆలోచనను మెచ్చుకోవచ్చు. థియరీ పరంగా ఈ పాయింట్ చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. సినిమా సెకండాఫ్‌లో వచ్చే ఒకటి రెండు సస్పెన్స్ ఎలిమెంట్స్, విలన్లను హీరో బోల్తా కొట్టించే కొన్ని సీన్లు కాస్త ఊరటనిస్తాయి.
also read :డబ్బుంది కదా అని బిల్డప్ లేదు.. నడిరోడ్డుపై నిద్రపోయిన బాలీవుడ్ సెలబ్రిటీ..
డైరెక్టర్ పేపర్ మీద రాసుకున్న మంచి పాయింట్‌ను స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఫస్టాఫ్ మొత్తం కథ ఎటు పోతుందో, ఎటు వస్తుందో అర్థం కాక ఆడియన్స్ తలలు పట్టుకున్నారు. కథనం పాతకాలపు డైలీ సీరియల్‌లా నత్తనడకన సాగడంతో థియేటర్‌లో కునుకు తీయడం ఖాయం.టైటిల్‌లో ‘త్రిమూర్తులు’ అని అంత బిల్డప్ ఇచ్చారు కానీ, ఆ ముగ్గురు విలన్ల క్యారెక్టరైజేషన్స్ చాలా వీక్‌గా ఉన్నాయి. హీరో వాళ్లతో ఆడుకునే సీన్స్‌లో అసలు పస లేదు, హైప్ లేదు. పైగా సినిమాలో ఎమోషన్స్ అన్నీ చాలా డ్రామాటిక్‌గా అనిపిస్తాయి తప్ప, గుండెకు హత్తుకోవు.ఇక సినిమా చూస్తున్నంత సేపు లో-బడ్జెట్ లోపాలు క్లియర్ గా కనిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) సీన్లను ఎలివేట్ చేయాల్సింది పోయి.. ఉన్న కాస్త ఇంట్రెస్ట్‌ని కూడా దెబ్బతీసింది. కెమెరా వర్క్, ఎడిటింగ్ క్వాలిటీ 90ల నాటి సినిమాలను తలపించాయి.
ప్లస్ పాయింట్స్
మైనస్ పాయింట్స్
చివరిగా..
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ కాన్సెప్ట్ పరంగా ఓకే అనిపించినా, స్క్రీన్‌ప్లే పరంగా మాత్రం పూర్తిగా పక్కదారి పట్టింది. వడ్డే నవీన్ తన అద్భుతమైన నటనతో సినిమాను కాపాడటానికి శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, నీరసమైన కథనం వల్ల సినిమా బోర్ కొట్టేసింది. వడ్డే నవీన్ కమ్‌బ్యాక్ కోసం ఒకసారి చూడొచ్చు కానీ, పక్కా సస్పెన్స్ థ్రిల్లర్ ఎక్స్‌పెక్ట్ చేసి పోతే మాత్రం డిసప్పాయింట్ అవ్వడం పక్కా!
Transfer Trimurthulu Review and Rating: 2/5