E-Paper
Advertisement

Itlu Mee Yedava Review : ‘ఇట్లు మీ ఎదవ’ మూవీ రివ్యూ

Itlu Mee Yedava Review : ‘ఇట్లు మీ ఎదవ’ మూవీ రివ్యూ
Advertisement

Itlu Mee Yedava Review : తెలుగు యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా ‘ఇట్లు మీ ఎదవ’. త్రినాధ్ కటారి ఇందులో హీరోగా నటిస్తూనే, సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. సాహితీ అవంచ హీరోయిన్‌గా నటించింది. ఇది తండ్రి-కొడుకు, తండ్రి-కూతురు బంధాలు, ప్రేమ జంటల మధ్య జరిగే ఎమోషనల్, కామెడీ సంఘటనల చుట్టూ తిరిగే కథ. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందొ రివ్యూలో తెలుసుకుందాం.

కథ :

సినిమా మొత్తం శ్రీను అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఆరేళ్లుగా పీజీ చదువుతూ ఆవారా అన్పించుకుంటాడు. కాలేజీలో మనస్వితో ప్రేమలో పడి, ఇన్నాళ్ళూ ఎదవ అన్పించుకున్న హీరో ఎట్టకేలకు మారిపోతాడు. విషయం తెలుసుకున్న శ్రీను తండ్రి మనస్విని తండ్రితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వెళ్తాడు. కానీ ఆమె తండ్రి ఇలాంటి ఎదవకు పిల్లనెవడు ఇస్తాడని తిడతాడు. ఈ ఇష్యూ ఓ డాక్టర్ దగ్గరకు వెళ్లడంతో ఆయన ఊహించని సలహా ఇస్తాడు. హీరోని హీరోయిన్ ఇంట్లో 30 రోజులు ఉండమని చెప్తారు. అన్ని రోజులు హీరోయిన్ తండ్రి హీరోని దగ్గరుండి చూశాక, అతను నిజంగా ఎదవ అని తేలితే ఈ ప్రేమా దోమా వదిలేయాలని కండిషన్ పెడతారు. దానికి హీరో హీరోయిన్ తో పాటు హీరోయిన్ నాన్న కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. మరి ఇంతకీ హీరో హీరోయిన్ తండ్రిని మెప్పించాడా? చివరికి ఈ ప్రేమ కథ ఎలా ఎండ్ అయ్యింది? అన్నది స్టోరీ.

విశ్లేషణ :

Advertisement

30 రోజులు హీరో… హీరోయిన్ తండ్రితో ఉండడం అనే స్టోరీ లైన్ వినగానే ‘బొమ్మరిల్లు’ కళ్ళముందు కదులుతుంది. అక్కడ హీరోయిన్, ఇక్కడ హీరో అంతే తేడా. ఫస్టాఫ్ అదే రొటీన్ లవ్ స్టోరీతో బోర్ కొట్టిస్తుంది. ఇంటర్వెల్ 30 రోజుల ట్విస్ట్ తో ముగుస్తుంది.

30 రోజుల ట్విస్ట్‌తో ఫస్టాఫ్‌ను పర్లేదు అనేలా డైరెక్టెర్ ముగించినా… తర్వాత సెకండాఫ్‌ను ఆకట్టుకునేలా చేయలేకపోయాడు డైరెక్టర్. సెకండాఫ్ అంతా… ప్రెడెక్టబుల్ స్టోరీ లానే సాగుతుంది. అది సినిమాకు మరింత మైనస్ మారిపోయింది. దీనికి తోడు… ల్యాగ్ సీన్స్ ఆడియన్స్‌కు విసుగు తెప్పిస్తాయి.

Advertisement

ఇలాంటి సినిమాలో కామెడీని వర్కౌట్ చేసుకోవచ్చు. డైరెక్టర్ కూడా అలాంటి ప్రయత్నం చేసినా.. అవి పెద్దగా ఏం పేలలేదు. ఇక క్లైమాక్స్ కొంత వరకు వర్కౌట్ అయినట్టు అనిపించినా… పూర్తి స్థాయి మార్కులు మాత్రం పడేలా అయితే లేదు. కానీ, కొంత వరకు ఎమోషనల్ పండించాడు అని చెప్పొచ్చు.

త్రినాధ్ కటారి – సాహితీ అవంచ కెమిస్ట్రీ, నటన సినిమాకు హైలైట్. తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్ సపోర్టింగ్ పాత్రలలో ఆకట్టుకుంటారు. త్రినాధ్ కటారి డైరెక్షన్, స్క్రీన్‌ప్లేతో సినిమాను యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మలచడంలో సక్సెస్ అయ్యారు. కానీ కథ పాత చింతకాయ పచ్చడి. ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ రొటీన్ గా ఉంది. ఎడిటింగ్‌కు ఇంకా పని ఉంది.

ప్లస్ పాయింట్స్ :

ఫస్టాఫ్ కొంత వరకు
కొంత వరకు క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

మ్యూజిక్
కథ & కధనం
ల్యాగ్ సీన్స్
ఫోర్డ్స్ కామెడీ

చివరగా.. థియేటర్లలో ‘ఇట్లు మీ ఎదవ’ను భరించడం కష్టమే.

Itlu Mee Yedava Rating : 1.5/5

Related News

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

Big Stories

Advertisement
×