Revolver Rita Movie Review : ‘మహానటి’ తో కీర్తి సురేష్ దశ తిరిగింది. ఆ తర్వాత ఈమె వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే.. మరోపక్క విమెన్ సెంట్రిక్ సినిమాల్లో కూడా లీడ్ రోల్స్ చేస్తుంది. అయితే కీర్తి చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ‘పెంగ్విన్’ ‘మిస్ ఇండియా’ ‘గుడ్ లక్ సఖి’ వంటివన్నీ ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు ‘రివాల్వర్ రీటా’ అనే క్రైమ్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ‘రివాల్వర్ రీటా’ ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం
రీటా(కీర్తి సురేష్) పాండిచ్చేరిలో తన తల్లి(రాధికా శరత్ కుమార్), చెల్లితో సాధారణ జీవితం గడుపుతూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా తన ఫ్యామిలీతో రీటా హ్యాపీగా నివసిస్తున్న టైంలో ఆమె ఫ్యామిలీ ఓ పెద్ద సమస్యలో చిక్కుకుంటుంది. అదే ఊర్లో పాండ్యన్(సూపర్ సుబ్బరాయన్) అనే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ ఉంటాడు.
ఒక రాత్రి అతను బయటకు వెళ్లి వస్తుండగా.. అతనిపై ఒక ఎటాక్ జరుగుతుంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ అతను.. రీటా ఇంటికి వెళ్లి అక్కడ ప్రాణాలు వదిలేస్తాడు. ఈ క్రమంలో రీటా అండ్ ఫ్యామిలీ పాండ్యన్ డెడ్ బాడీని ఏం చేశారు? పాండ్యన్ కొడుకు బాబీ తండ్రిని చంపిన వాళ్లపై పగ తీర్చుకునే క్రమంలో రీటా అండ్ ఫ్యామిలీకి ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టాడు? అసలు పాండ్యన్ ని చంపింది ఎవరు? ఈ కేసు నుండి రీటా అండ్ ఫ్యామిలీ ఎలా బయటపడింది? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
క్రైమ్ కామెడీ సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి. అందులో చాలా సినిమాలు సక్సెస్ అయ్యి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అయితే డార్క్ కామెడీకి తెలుగు ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. ‘డాక్టర్’ ‘జైలర్’ వంటి సినిమాలతో నెల్సన్ వంటి దర్శకులు తెలుగు ప్రేక్షకులు డార్క్ కామెడీని అలవాటు చేశారు అని చెప్పాలి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ‘రివాల్వర్ రీటా’ కూడా అలాంటి సినిమానే. వెంకట్ ప్రభు వంటి స్టార్ డైరెక్టర్ వద్ద ‘మానాడు’ ‘ది గోట్’ వంటి సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా, రైటర్ గా పనిచేసిన జె.కె.చంద్రు దర్శకుడిగా మారి చేసిన సినిమా ఇది.
అయితే ఇతనిపై వెంకట్ ప్రభు ప్రభావం కంటే నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో నయనతారతో నెల్సన్ ‘కో కో కోకిల’ అనే సినిమా తీశాడు. అది తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా కథ, కథనంకి చాలా దగ్గరగా ఉన్న సినిమాగా రివాల్వర్ రీటా గురించి చెప్పుకోవచ్చు.
కానీ ఆ సినిమా రేంజ్లో ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే ఇందులో లేదు. చంద్రు చాలా సబ్ ప్లాట్స్ రాసుకుని ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేసేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ వాల్యూస్ తప్ప.. ఇందులో ఆకట్టుకునే అంశాలు ఏమీ లేవు. కామెడీ కూడా వర్కౌట్ కాలేదు అంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
నటీనటుల విషయానికి వస్తే.. కీర్తి సురేష్ ఎప్పటిలానే తన పాత్రకి న్యాయం చేసింది. రీటా పాత్రతో కామెడీ టైమింగ్ ను మరింత ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేసింది అని చెప్పాలి. రాధికా శరత్ కుమార్ కూడా కీర్తితో కలిసి బాగా పెర్ఫార్మ్ చేసింది.
వీళ్ళ కాంబోలో వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. సునీల్ పాత్రకి బిల్డప్ ఎక్కువగా ఉంటుంది. అంతేతప్ప ఆ పాత్రతో ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ కారు. అజయ్ ఘోష్ బాగా చేశాడు. ఇంకా కొన్ని ఇరిటేటింగ్ రోల్స్ సినిమాలో ఉన్నాయి. వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది.
ప్రొడక్షన్ వాల్యూస్
సినిమాటోగ్రఫీ
అక్కడక్కడా కామెడీ సీన్స్
డైరెక్షన్
సెకండాఫ్
క్లైమాక్స్
కో కో కోకిల ఛాయలు ఎక్కువగా ఉండటం
మొత్తంగా… ఈ ‘రివాల్వర్ రీటా’ ని 2 గంటల 22 నిమిషాలు భరించడానికి చాలా ఓపిక కావాలి. థియేటర్ కి వెళ్లి చూసే ఆలోచన మానుకుని ఓటీటీకి వచ్చాక చూసుకుంటే బెటర్