E-Paper
Advertisement

Viral Video: కొత్త జంటను ఆశీర్వదించేందుకు స్టేజి ఎక్కిన నాయకులు, ఒక్కసారిగా కుప్పకూలడంతో..

Viral Video: కొత్త జంటను ఆశీర్వదించేందుకు స్టేజి ఎక్కిన నాయకులు, ఒక్కసారిగా కుప్పకూలడంతో..
Advertisement

Viral Video: ఉత్తరప్రదేశ్‌ లోని బల్లియాలో తాజాగా జరిగిన ఓ నాయకుడి సోదరుడి పెళ్లి రిసెప్షన్‌ లో ఊహించని ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది. స్టేజి మీదికి పరిమితికి ఎక్కువ మంది ఎక్కడంతో ఒక్కసారిగా పడిపోయింది. వధువు, వరుడుతో పాటు పలువురు రాజకీయ నాయకులు కిందపడిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

బిజెపి నాయకుడు అభిషేక్ సింగ్ సోదరుడి రిసెప్షన్ రాంలీలా మై గ్రౌండ్‌లో జరిగింది. బిజెపి జిల్లా అధ్యక్షుడు సంజయ్ మిశ్రా, మాజీ ఎంపీ భరత్ సింగ్, ఎమ్మెల్యే విశ్రామ్ సింగ్, బిజెపి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుర్జిత్ సింగ్ తో సహా పార్టీ పెద్దలు నూతన వధూవరులను ఆశీర్వదించడానికి వేదికపైకి వచ్చారు. ఫోటోలు దిగేందుకు ఎక్కువ మంది వెనక్కి వెళ్లడంతో వేదిక కూలిపోయింది. ఈ ఘటనలో సోఫా మీద కూర్చున్న వధూవరులు కూడా స్టేజి మీది నుంచి పడిపోయారు. వెంటనే, పక్కన ఉన్న వారంతా అక్కడికి వచ్చి, కిందపడిపోయిన వారిని లేపి పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటనలో చిన్న చిన్న గాయాలు మినహా ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు.

Advertisement

Read Also: ఐ ఫోన్ బాక్స్.. లంచ్ బాక్స్ గా.. నువ్ మామూలోడివి కాదురా అయ్యా!

సోషల్ మీడియాలో వీడియో వైరల్

Advertisement

ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి పలువురు బాధపడ్డారు. కొత్త పెళ్లి జంటకు ఇలా జరగడం బాధాకరం అన్నారు. మరికొంత మంది ఫన్నీగా కామెంట్స్ చేశారు. ఇంకొంత మంది గాయాలు ఏమైనా జరిగాయా? అని ఆందోళన చెందారు.“వేదికను ప్రభుత్వ కాంట్రాక్టర్ నిర్మించి ఉండవచ్చు” అని మరో వ్యక్తి ఫన్నీగా కామెంట్ చేశారు. “ఈవెంట్ నిర్వాహకుడు ఇప్పుడు తన ప్రాణాల కోసం పరిగెత్తాలి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “అయ్యో… అది చాలా ఆందోళనకరంగా ఉంది.  అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరికీ గాయాలు కాలేదని ఆశిస్తున్నాను. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Read Also: బర్త్ డే బంప్స్.. స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పటించి కేరింతలు కొట్టిన ఫ్రెండ్స్, చివరికి…

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×