E-Paper
Advertisement

డీ.సీ.మూవీ రివ్యూ.. హీరోగా లోకేష్ కనగరాజ్ పర్ఫామెన్స్ ఎలా ఉంది?

డీ.సీ.మూవీ రివ్యూ.. హీరోగా లోకేష్ కనగరాజ్ పర్ఫామెన్స్ ఎలా ఉంది?
Advertisement

DC Movie review: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న లోకేష్ కనగరాజ్ (Lokesh kanagaraj) ఇటీవల హీరోగా మారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం డీ.సీ. కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. భారీ అంచనాల మధ్య హీరోగా లోకేష్ కనగరాజ్ తొలి ప్రయత్నంలో ఆగస్టు 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మరి హీరోగా యూటర్న్ తీసుకున్న లోకేష్ ఈ సినిమాతో మెప్పించారా? ఈ సినిమా రివ్యూ ఏంటి ? అనేది ఇప్పుడు చూద్దాం..

లోకేష్ కనగరాజ్ డీసీ మూవీ స్టోరీ..

లోకేష్ మార్క్ డార్క్ అండ్ రా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్, సిండికేట్ పాలిటిక్స్ సినిమాకి పునాదిగా నిలిచాయి. గతం మరిచిపోయి సాధారణ జీవితం గడుపుతున్న హీరో, అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ ఆ అండర్ వరల్డ్ ముఠాలతో తలపడాల్సి వస్తుంది. పాత శత్రువులు, పగలు ప్రతీకారాల మధ్య హీరో చేసే పోరాటమే డీ.సీ. ఇందులో ఈ లోకేష్ యూనివర్స్ కు సంబంధించిన కొన్ని కనెక్టింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. పైగా అవి సినిమాకి అదనపు బలం అని చెప్పవచ్చు.

నటీనటుల పెర్ఫార్మెన్స్..

Advertisement

స్క్రీన్ మీద కనిపించినంత సేపు తన క్యారెక్టర్ తో లోకేష్ ఇరగదీసారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లలో ఆయన ఇంటెన్స్ లుక్, బాడీ లాంగ్వేజ్ సినిమాకి ప్రధాన హైలెట్ గా నిలిచాయి .లోకేష్ సినిమాల్లో విలన్ పాత్రలకు ఎంత వెయిట్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంలో కూడా విలన్ రోల్స్ చాలా పవర్ఫుల్గా డిజైన్ చేశారు. పైగా మిగతా నటీనటులు తమ పరిధి మేరకు బాగానే నటించారు. సినిమా చూస్తున్నంతసేపు లోకేష్ ఈ యూనివర్సిటీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు రా బాబు అని అనిపించక మానదు. ఫస్ట్ ఆఫ్ లో వచ్చే హై వోల్టేజ్ ,యాక్షన్ సీన్లు, బిజిఎం థియేటర్లలో ఈలలు వేయిస్తాయి. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కథ కొంచెం తడబడినట్లు అనిపిస్తుంది. లాజిక్ కంటే మ్యాజిక్ ఎక్కువైంది అనిపించే కొన్ని సీన్లు, మరి లెంగ్త్ ఎక్కువ అవ్వడం వల్ల ప్రేక్షకులకు చిన్నపాటి మైండ్ బ్లాంక్ ఇస్తాయి.
అయినా సరే లోకేష్ అన్నాక ఇలాంటి ట్విస్ట్ లు, మాస్ ఎలివేషన్స్ కామనే కదా.

సినిమా ప్లస్ పాయింట్లు..

లోకేష్ కనగరాజ్ ట్రేడ్ మార్క్ మేకింగ్ అండ్ డైరెక్షన్

Advertisement

హాలీవుడ్ రేంజ్ లో ఉన్న హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్

సినిమా మూడ్ ని ఎలివేట్ చేసే సాలిడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలాగే సినిమాటోగ్రఫీ

సినిమా మైనస్ పాయింట్స్:

స్క్రీన్ ప్లే లో అక్కడక్కడ వచ్చే స్లో మూమెంట్స్

సెకండ్ హాఫ్ లో సాగదీసినట్లు అనిపించే కొన్ని సన్నివేశాలు

రొటీన్ ఫీల్

also read: ‘పళ్ళ బురుసు’ కోసం కోర్టుకెక్కిన పంచాయతీ.. ఎమోషన్స్ తో ఆకట్టుకుంటున్న ట్రైలర్!

ఆఖరి మాటగా..

లోకేష్ మార్క్ యాక్షన్ లవర్స్ కి , మాస్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా కొన్ని చోట్ల మంచి ట్రీట్ ఇస్తుంది. అయితే స్క్రిప్ట్ ఇంకాస్త టైట్ గా ఉంటే బాగుండేది. మొత్తానికి యావరేజ్ కి మించిన ట్రీట్ అని చెప్పవచ్చు.

డీ.సీ. మూవీ రేటింగ్: 2.75/5

 

Related News

జీ.డీ.నాయుడు మూవీ రివ్యూ.. బయోపిక్ లో ఆర్.మాధవన్ మెప్పించారా?

కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ: వరుణ్ తేజ్‌కు కావాల్సిన హిట్ దొరికిందా?

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Big Stories

Advertisement
×