E-Paper
Advertisement

తక్కువ సిబిల్ స్కోరు.. మీ లోన్ రిజెక్ట్ చేస్తుందా?ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

తక్కువ సిబిల్ స్కోరు.. మీ లోన్ రిజెక్ట్ చేస్తుందా?ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Advertisement

Free CIBIL score check online: అత్యవసర సమయంలో .. బ్యాంకుకు వెళ్లి లోన్ అప్లై చేస్తే, సిబిల్ స్కోరు తక్కువగా ఉందనే..కారణంతో అప్లై రిజెక్ట్ అయిందా? ఈ అనుభవం చాలా మందిని టెన్షన్‌కు గురిచేస్తుంది. ప్రస్తుత డిజిటల్ కాలంలో ..మన క్రెడిట్ స్కోరే మన ఫైనాన్షియల్ ఐడెంటిటీగా మారిపోయింది. తక్కువ సిబిల్ స్కోరు మన భవిష్యత్తు రుణాలను ఎలా దెబ్బతీస్తుందో, మన క్రెడిట్ రిపోర్ట్‌ను రూపాయి ఖర్చు లేకుండా ఆన్‌లైన్‌లో ఉచితంగా ఎలా చెక్ చేసుకోవాలో స్టెప్-బై-స్టెప్ తెలుసుకుందాం.

1. తక్కువ సిబిల్ స్కోరు:

సాధారణంగా సిబిల్ స్కోరు 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఇందులో 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే బెస్ట్‌గా భావిస్తారు. ఒకవేళ మీ స్కోరు 650 కంటే తక్కువగా ఉంటే..బ్యాంకులు మిమ్మల్ని ‘రిస్క్ కస్టమర్’ కింద లెక్కగడతాయి. గతంలో తీసుకున్న ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులు టైమ్‌కు కట్టకపోవడం, ఒకేసారి అనేక లోన్లకు అప్లై చేయడం వల్ల సిబిల్ స్కోరు దెబ్బతింటుంది. అందుకే బ్యాంకులు క్షణాలలో మీ లోన్ అప్లికేషన్‌ను పక్కన పడేస్తాయి.

2. క్రెడిట్ రిపోర్ట్‌:

Advertisement

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ప్రతి ఇండియన్ సిటిజన్ సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా తన క్రెడిట్ రిపోర్ట్‌ను పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. దీనికోసం ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్లు: CIBIL, Experian, Equifax లేదా CRIF High Mark వంటి ఏదైనా అధికారిక క్రెడిట్ బ్యూరో వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

Advertisement

రిజిస్ట్రేషన్: మీ పాన్ కార్డ్ నంబర్, పూర్తి పేరు, పుట్టిన తేదీ , యాక్టివ్‌లో ఉన్న మొబైల్ నంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి.

OTP వెరిఫికేషన్: మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా.. మీ ఐడెంటిటీని కన్ఫర్మ్ చేయాలి.

రిపోర్ట్ డౌన్‌లోడ్: ప్రాసెస్ పూర్తికాగానే.. మీ పూర్తి క్రెడిట్ రిపోర్ట్, సిబిల్ స్కోరు స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీన్ని మీరు ఫ్రీగా పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

3. క్రెడిట్ రిపోర్ట్‌లో ఏఏ వివరాలు ఉంటాయి?

మీరు డౌన్‌లోడ్ చేసుకున్న రిపోర్ట్‌లో మీ పాస్ట్ ఫైనాన్షియల్ హిస్టరీ అంతా క్లియర్ ఉంటుంది. మీరు ఇప్పటివరకు తీసుకున్న లోన్లు, క్రెడిట్ కార్డుల డీటెయిల్స్, ఈఎంఐలు టైమ్‌కు కట్టారా లేదా.. అనే ట్రాక్ రికార్డ్, అలాగే బ్యాంకులు మీ సిబిల్ స్కోరు కోసం ఎన్నిసార్లు ఎంక్వైరీ చేశాయనే విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక వేళ మీ రిపోర్ట్‌లో ఏదైనా రాంగ్ ఎంట్రీ ఉంటే.. వెంటనే ఆ బ్యూరోకు ఆన్‌లైన్‌లోనే కంప్లైంట్ చేసి సరిదిద్దుకోవచ్చు.

4. సిబిల్ స్కోరును పెంచుకోవడం ఎలా?

1.ఈఎంఐలు , క్రెడిట్ కార్డ్ బిల్లులను ఎప్పుడూ డ్యూ డేట్‌కు ముందే పే చేసేయండి.

2.క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో ఎప్పుడూ 30 శాతానికి మించకుండా చూసుకోండి. అంటే.. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్‌లో మూడో వంతు మాత్రమే వాడండి.

3.పాత లోన్లను క్లోజ్ చేసేటప్పుడు ఎప్పుడూ సెటిల్మెంట్ ఆప్షన్‌కు వెళ్లకుండా, బకాయిలన్నీ పూర్తిగా క్లియర్ చేయండి.

మన ఫ్యూచర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌కు  క్రెడిట్ స్కోరు చాలా ముఖ్యం. మీ సిబిల్ స్కోరును అప్పుడప్పుడు ఫ్రీగా చెక్ చేసుకుంటూ ఉండటం వల్ల భవిష్యత్తులో వచ్చే మనీ ప్రాబ్లమ్స్‌ను ముందే కంట్రోల్ చేసుకోవచ్చు.

Related News

మొదటి సారి వ్లాగ్స్ చేస్తున్నారా?పర్ఫెక్ట్ కెమెరా, మైక్ ఎంచుకోవడం ఎలా?

దీపావళికి పర్ఫెక్ట్ ఫోటోలు తీయాలా? ఫోన్‌లో ఈ చిన్న సెట్టింగ్స్ మారిస్తే సరి

సోనీ నుంచి అదిరిపోయే నోస్టాల్జియా గాడ్జెట్..MDR-3R హెడ్‌ఫోన్స్ లాంచ్

10 నిమిషాల్లో అదిరిపోయే గోధుమ రవ్వ ప్రసాదం..ఈజీగా చేయండిలా!

ఎయిర్‌టెల్ బంపరాఫర్.. ఒక రీఛార్జ్ చేస్తే మరొకటి ఉచితం.. 56 రోజులు తగ్గేదేలే!

రూ.2వేల బడ్జెట్‌లో సూపర్ ఇయర్‌బడ్స్..ప్రియమైన వారికి పర్ఫెక్ట్ దీపావళి గిఫ్ట్

ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం బిగ్ అలర్ట్.. వెంటనే ఈ పని చేయకపోతే డేంజర్!

Big Stories

Advertisement
×