Pallaburusu trailer :ఇటీవల కాలంలో తెలంగాణ నేపథ్యంతో ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి.. గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో వచ్చే ప్రతి సినిమాకి కూడా ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే అలా తెలంగాణ నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరో చిత్రం పళ్ళ బురుసు. ఇటీవలే అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) చేతులమీదుగా టీజర్ విడుదల అవ్వగా ఆధ్యంతం ఆకట్టుకుంది. అయితే తాజాగా విడుదల చేసిన ట్రైలర్ మాత్రం ఎమోషన్స్ తో నాటి రోజులను గుర్తు చేస్తూ కన్నీళ్లు పెట్టించింది.
ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ విషయానికి వస్తే. పంటి నొప్పితో హాస్పిటల్ కి వెళ్లిన తండ్రికి టూత్ బ్రష్ వాడమని చెబుతుంది నర్స్. టూత్ బ్రష్ కావాలని కొడుకును అడిగితే కొడుకు కొనివ్వడు. దీంతో తనకు తూర్పు బ్రష్ కొనివ్వలేదని ఆ తండ్రి తన కొడుకు పైనే పోలీస్ కేసు పెట్టేందుకు వెళ్తాడు.
also read:పవన్ తో పెళ్లిపై రీతూ చౌదరి క్లారిటీ!
ముసలాయన కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కోర్టులో హాజరు పరుస్తారు. దీని కారణంగా ఈ కుటుంబంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి?. తండ్రి కొడుకులు వాదోపవాదనలను విన్న జడ్జ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ముఖ్యంగా ఒక పళ్ళ బురుసు ఎంత పని చేసింది అనే నేపథ్యంగా ఎమోషనల్ స్టోరీని చూపించబోతున్నారని ట్రైలర్ తో స్పష్టం అవుతుంది. పల్లెటూరిలో తండ్రి కొడుకు మధ్య సాగే భావోద్వేగ కథ కోర్టు నేపథ్యంలో నడిచే ఆసక్తికరమైన డ్రామాగా దీనిని తెరకెక్కించారు. ఇక నాటి రోజులను గుర్తు చేస్తూ ఆది ఆద్యంతం కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
నాగార్జున (Nagarjuna)కు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి(Sudhakar Reddy), మురళీధర్ గౌడ్ (Muraludhar Gowd) ఇందులో తండ్రీకొడుకులుగా ప్రధాన పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఇంట్రెస్టింగ్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ఎప్పటిలాగే మురళీధర్ గౌడ్ , సుధాకర్ రెడ్డి తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో అదరగొట్టేశారు. పైగా నాగచైతన్య చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేయడం ఈ సినిమాకు అదనపు ప్రమోషన్ అనే చెప్పాలి. విడుదలకు కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో వరుస అప్డేట్స్ వదులుతూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు చిత్ర బృందం. ఎపిక్ స్టూడియోస్ కూడా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రజ్వల్ , గోమతి రెడ్డి కీలక పాత్రలు పోషించారు. పవన్ సిహెచ్ మ్యూజిక్ అందించారు.