Indiramma House: నేడు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ మండలంలోని పర్సాపూర్ గ్రామం పర్యటన అనంతరం.. పర్సాపూర్ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులైన గోరిపల్లి సుమిత్ర, శ్రీనివాస్ దంపతుల గృహన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంబించారు. అనంతరం వారికి సీఎం నూతన వస్త్రాలను ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
గృహ ప్రవేశ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి లబ్ధిదారుల కుటుంబంతో కలిసి వారి ఇంట్లోనే తెలంగాణ సర్కార్ అందిస్తున్న సన్నబియ్యంతో వండిన భోజనం తిన్నారు. సీఎంతో పాటుగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు మరియు వివిధ నాయకుల అందరూ కలిసి వారి ఇంట్లోనే భోజనం చేశారు.
ఇక ఇందిరమ్మ ఇంట్లో సీఎం భోజనం తరువాత అక్కడి చిన్నారులతో కలిపి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారితో ముచక్చటించిన సీఎం రేవంత్ తిరిగి తన ప్రత్యేక వాహనంతో వెల్లిపోయారు.
Also read: టీమిండియా కొంపముంచిన నో-బాల్…పాకిస్తాన్, అంపైర్ల మధ్య ఫిక్సింగ్ అంటూ!