Best geysers for home: వర్షాకాలం ఇష్టపడే వారికైనా, ఈ సమయంలో చల్లటి నీళ్లతో స్నానం చేయడం మాత్రం కష్టమే. అందుకే ప్రతి ఇంటిలోనూ వాటర్ గీజర్ ఇప్పుడు అత్యవసర గ్యాడ్జెట్‌గా మారిపోయాయి. ముఖ్యంగా చిన్న ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లలో స్థల సమస్యను దృష్టిలో ఉంచుకుని, తక్కువ స్పేస్‌లో అమర్చుకునే 15 లీటర్ల లోపు కాంపాక్ట్ గీజర్లకు మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో బడ్జెట్, పని తీరు పరంగా అగ్రస్థానంలో కొన్ని అద్భుతమైన మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ టాప్ 5 గీజర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మార్కెట్లో దీని ధర సుమారుగా రూ. 8,500 నుంచి రూ.10,000 మధ్య ఉంటుంది.ఇది చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా.. తక్కువ సమయంలోనే నీటిని వేడి చేస్తుంది. దీనిలోని కలర్-చెంజింగ్ ఎల్ఈడీ రింగ్ నీరు వేడిగా ఉందా లేదా అనేది దూరం నుంచే.. మనకు స్పష్టంగా చూపిస్తుంది. అలాగే హై-రైజ్ బిల్డింగ్స్‌కు కూడా ఇది సరిగ్గా సరి పోతుంది.
ఈ గీజర్ ధర సాధారణంగా రూ. 6,500 నుంచి రూ. 8,000 వరకు ఉంటుంది. బజాజ్ బ్రాండ్ అంటేనే.. నమ్మకానికి మారుపేరు. ఇందులో.. ఉండే టెర్మోస్టాట్ ఫీచర్ ఉష్ణోగ్రతను ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేస్తుంది. దీనిలో రస్ట్-ప్రూఫ్ బాడీ ఉండటం వల్ల వర్షాకాలంలో వచ్చే తేమకు కూడా ఇది తుప్పు పట్టకుండా ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది.
దీని మార్కెట్ ధర సుమారు రూ.7,000 నుంచి రూ.9,000 మధ్య ఉంటుంది. విట్రివస్ ఎనామిల్ కోటింగ్ కలిగిన ట్యాంక్ దీని సొంతం. ఇది కఠినమైన నీటిని కూడా తట్టుకోగలదు. నాలుగు లేయర్ల లేటెస్ట్ సేఫ్టీ దీనిలో ఉండటం వల్ల షాక్ కొట్టడం లేదా ఓవర్ హీట్ కావడం వంటి సమస్యలు అస్సలు చాలా వరకు తలెత్తవు.
Also Read: హెల్తీ స్మూతీస్ కోసం బెస్ట్ బ్లెండర్స్..అమెజాన్‌లో ఇప్పుడు సగం ధరకే!
4. క్రాంప్టన్ అమికా 15 లీటర్ల గీజర్:
దీని ధర సుమారు రూ. 6,000 నుంచి రూ. 7,500 వరకు ఉంటుంది. నానో పాలిబాండ్ టెక్నాలజీతో.. తయారైన దీని ట్యాంక్ లీకేజ్ సమస్యలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. తక్కువ కరెంట్ ఖర్చుతో ఎక్కువ సేపు నీటిని వేడిగా ఉంచే శక్తి దీని ప్రత్యేకత. చిన్న కుటుంబాలకు ఇది సరి పోయే బడ్జెట్ ఫ్రెండ్లీ గీజర్స్.
ప్రీమియం లుక్‌ను కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. దీని ధర సుమారు రూ. 9,500 నుంచి రూ. 12,000 వరకు ఉంటుంది. బ్లూ డైమండ్ గ్లాస్-లైన్ ట్యాంక్ ఉండటం వల్ల ఇది చాలా కాలం పాటు పాడవకుండా ఉంటుంది. ఫైవ్ స్టార్ ఎనర్జీ రేటింగ్ కలిగి ఉండటంతో కరెంట్ బిల్లు కూడా పెద్దగా రాదు.
Also Read: వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటున్నారా? IFB, Boschలలో ఏది బెస్ట్ ఛాయిస్?