E-Paper
Advertisement

Love OTP Movie Review : ‘లవ్ ఓటీపీ’ రివ్యూ… ఓవర్ టార్చర్, ప్రెజర్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?

Love OTP Movie Review : ‘లవ్ ఓటీపీ’ రివ్యూ… ఓవర్ టార్చర్, ప్రెజర్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?
Advertisement

Love OTP Movie Review : అనీష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘లవ్ ఓటీపీ’. ఈ సినిమాతో డైరెక్టర్ గానే కాకుండా హీరోగా కూడా పరిచయం అయ్యాడు. అనీష్. విజయ్ ఎం రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో జాన్విక హీరోయిన్. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ నవంబర్ 14న అంటే ఈరోజే థియేటర్లలోకి తెలుగు, కన్నడ భాషల్లో వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందన్న విషయాన్ని రివ్యూలో తెలుసుకుందాం పదండి.

కథ :

క్రికెటర్ కావాలన్నది హీరో అక్షయ్ లక్ష్యం. పోలీస్ ఆఫీసర్ అయిన అతని తండ్రికి లవ్ అనే మాటే పడదు. అలాంటి కేసులేమైనా వస్తే చాలు చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. తండ్రి అంటే ఉన్న భయంతో అక్షయ్ ప్రేమ జోలికి వెళ్ళడు. అక్షయ్ కు ఈ లవ్వూ గివ్వూ పడవని తెలుసుకున్న కాలేజ్ మేట్ సనా అతన్ని వన్ సేడ్ లవ్ చేస్తూనే, మరో విధంగా దగ్గరవుతుంది. అంతలోనే క్రికెట్ ఆడుతున్నప్పుడు అక్షయ్ కు దెబ్బ తగలడం, ఫిజియో థెరపిస్ట్ నక్షత్రతో పరిచయం ప్రేమగా మారడం వెంటవెంటనే జరిగిపోతాయి. ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ సనా ఉండగా నక్షత్రతో హీరో లవ్ ట్రాక్ ఎందుకు నడిపించాడు? ఈ విషయం తెలిసిన సనా ఏం చేసింది ? అక్షయ్ తండ్రికి ఈ విషయం తెలిసిందా? చివరికి కథ ఎలాంటి టర్న్ తీసుకుంది? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ :

Advertisement

‘లవ్ ఓటీపీ’ సినిమా టైటిల్ లో ఓటీపీ మీనింగ్ ఓవర్ టార్చర్ ప్రెజర్ అని పోస్టర్ లోనే వెల్లడించారు. సినిమా కూడా దానికి తగ్గట్టే ఉంది. ఇద్దరు లవర్స్ మధ్య అబ్బాయి నలిగిపోవడం, టాక్సిక్ రిలేషన్షిప్, ఇష్టంలేని అమ్మాయితో ప్రేమ, ఇష్టపడిన అమ్మాయి కోసం పడే తాపత్రయం వంటి అంశాలతో ఈ మూవీని తెరకెక్కించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇద్దరు లవర్స్ ను ఒకేసారి మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది? అన్నది స్టోరీ. ఈ సీరియస్ అంశాలతోనే కామెడీని పండించే ప్రయత్నం చేశారు. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండాఫ్ మొదట్లో సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది.

డైరెక్టర్‌గా, హీరోగా మొదటి సినిమానే అయినప్పటికి, అనీష్ చేసిన ప్రయత్నం అభినందనీయం. హీరోయిన్స్‌ జాన్విక, ఆరోహి నారాయణ్ గ్లామర్ తో ఆకట్టుకున్నారు. రాజీవ్ కనకాల తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. సంగీతం కూడా బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

Advertisement

హీరో హీరోయిన్
డైరెక్షన్, మ్యూజిక్
సైడ్ ఆర్టిస్ట్ కమెడియన్
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ మొదట్లో ల్యాగ్

మొత్తానికి  కామెడీతో పాటు ఎమోషన్ కలగలిసిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కూడా వీకెండ్ ఓ లుక్కేయొచ్చు.

Love OTPMovie Rating : 2.75 /5

Related News

Dharmastala Niyojakavargam Movie Review : ‘ధర్మస్థల నియోజకవర్గం’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

Big Stories

Advertisement
×