E-Paper
Advertisement

Former Naxalite Murder: మాజీ మావోయిస్టు సిద్ధన్న దారుణ హత్య.. యూట్యూబ్‌ ఇంటర్వ్యూ వల్లే !!

Former Naxalite Murder: మాజీ మావోయిస్టు సిద్ధన్న దారుణ హత్య.. యూట్యూబ్‌ ఇంటర్వ్యూ వల్లే !!
Advertisement

Former Naxalite Murder: ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ ఓ వ్యక్తి ప్రాణాలకు చెల్లింపౌతుందని ఎవ్వరూ ఊహించలేదు. మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఓ హత్య.. నేటి సోషల్ మీడియాలో బయటపడటంతో ప్రతీకారం రగిలి, మరో హత్యకు దారి తీసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి ప్రాంతానికి చెందిన జక్కుల అంజయ్య హత్య కేసు.. 30 ఏళ్ల తర్వాత ప్రతీకారంతో ముగిసింది. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

అంజయ్య అప్పట్లో “ఇన్ఫార్మర్” అనే ముద్రతో నక్సలైట్ల చేతిలో హత్యకు గురయ్యాడు. అప్పుడు ఆయన కుమారుడు సంతోష్ మాత్రం అప్పుడు బాలుడు. తండ్రి హత్య తన కళ్ల ముందు జరగకపోయినా, ఆ ఘటన అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. అప్పటి నుంచి తన తండ్రిని హత్య చేసిన వారిని ఎప్పుడో ఒకరోజు శిక్షిస్తానని సంతోష్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడని గ్రామస్తులు అంటున్నారు. కానీ హత్య చేసింది మావోయిస్టులని తెలిసి, వారిని ఎదుర్కోవడం అసాధ్యం అనే భావనలో చాలాకాలం సంతోష్ నిశ్శబ్దంగానే ఉన్నాడు.

Advertisement

ఇలాంటి సమయంలో అనుకోని మలుపు తీసుకొచ్చింది ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ హత్య చేసిన విషయాలు బయట పెట్టాడు సిద్దన్న అనే మాజీ మావోయిస్టు.. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన మాజీ నక్సలైట్ సిద్ధన్న అలియాస్ బల్లెపు నర్సయ్య ఓ యూట్యూబ్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను నక్సలైట్‌గా ఉన్నప్పుడు కోవర్టులను, ఇన్ఫార్మర్లను హత్య చేశా.. అని చెప్పారు. అంజయ్య ను కూడా హత్య చేసినట్లు చెప్పాడు. ఈ మాటలు విన్న సంతోష్‌లో దాగి ఉన్న కోపం ఒక్కసారిగా రగిలిపోయింది. తండ్రి హత్య చేసిన వ్యక్తి ప్రత్యక్షంగా కనిపించడం, పైగా దాన్ని బహిరంగంగా ఒప్పుకోవడం అతనిలో ప్రతీకార భావాన్ని మరింత పెంచింది.

ఇంటర్వ్యూ చేద్దామని సిద్దన్నను పిలిచాడు సంతోష్. వేములవాడ పరిధిలోని అగ్రహారం గుట్టల్లోకి తీసుకెళ్లాడు. ఎవరూ లేని చోట సిద్ధన్న ముఖం, తలపై బండరాళ్లతో కొట్టాడు. చనిపోయిన తరువాత.. అక్కడి నుంచి పరారయ్యడు.

Advertisement

చనిపోయిన తరువాత సంతోష్.. జగిత్యాల పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. ముప్పై ఏళ్ల క్రితం నా తండ్రిని చంపాడు. ఈరోజు నేను అతన్ని చంపాను అని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తండ్రి మరణంతో మొదలైన ఈ కథ ముగింపు కూడా మరణంతోనే ముగిసింది.

Also Read: తిరుమల లడ్డూ కేసు.. టీటీడీలో అరెస్టుల పర్వం, రేపోమాపో మరో..

పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. సంతోష్ ఒంటరిగా ఈ హత్య చేశాడా? లేక అతనికి ఎవరైనా సహకరించారా? అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. అలాగే సిద్ధన్న గత జీవితానికి సంబంధించి మరిన్ని నేరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×