E-Paper
Advertisement

Mension House Mallesh Movie Review : ‘మెన్షన్ హౌస్ మల్లేశం’ మూవీ రివ్యూ : సగం కిక్కే..

Mension House Mallesh Movie Review : ‘మెన్షన్ హౌస్ మల్లేశం’ మూవీ రివ్యూ : సగం కిక్కే..
Advertisement

Mension House Mallesh Review : ‘హిట్’ ‘హిట్ 2’ ‘హిట్ 3’ ‘లక్కీ భాస్కర్’ సినిమాలతో పాపులర్ అయిన శ్రీనాథ్ మాగంటి హీరోగా మారి చేసిన తొలి సినిమా ‘మెన్షన్ హౌస్ మల్లేశం’. మొదట ‘మ్యాన్షన్ హౌస్ మల్లేశం’ అనే టైటిల్ పెట్టారు. తర్వాత సెన్సార్ వాళ్లకు భయపడో లేక ‘మ్యాన్షన్ హౌస్’ వారు డబ్బులు డిమాండ్ చేస్తారని భావించో ‘మెన్షన్ హౌస్ మల్లేశం’ గా పేరు మార్చారు. ఈ శుక్రవారం పదుల సంఖ్యలో రిలీజ్ అవుతున్న సినిమాల నడుమ ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. మరి ఆడియన్స్ ని ఈ సినిమా అలరించే విధంగా ఉందో లేదో.. ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి..

కథ :

మల్లేశం(శ్రీనాథ్ మాగంటి’ ఓ టెంట్ వ్యాపారి. అతని తండ్రంటే ఇతనికి పడదు. బాల్యంలో ఒకసారి తన తండ్రి బాధ భరించలేక పారిపోతాడు. తర్వాత తిరిగొస్తాడు.కానీ అదే టైం నుండి తాగుడుకు  బానిసైపోతాడు. అతన్ని దారిలో పెట్టాలని భావించి తల్లి జ్యోతి(గాయత్రీ రమణ) అనే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తుంది. సంబంధం కలుపుకునే ముందు తన కొడుక్కి ఎటువంటి అలవాటు లేదు అని చెబుతుంది.అయితే పెళ్లయ్యాక శోభనం గదిలో మల్లేశంకి ఓ వింతైన సమస్య ఉందని బయటపడుతుంది. దీంతో అతని సంసారం సాఫీగా సాగదు. భార్య అర్థం చేసుకున్నప్పటికీ… ఊర్లో మల్లేశం అంటే పడని ఓ వ్యక్తి..  ఆ విషయాన్ని ఊరంతా ప్రకటించి.. మల్లేశం పరువు తీస్తాడు. దీంతో అతనితో ఓ వింతైన పందెం కడతాడు మల్లేశం. అది ఏంటి? అసలు మల్లేశంకి ఉన్న సమస్య ఏంటి? అది తీరిందా? చివరికి అతని ఫ్యామిలీ లైఫ్ సెట్ అయ్యిందా? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.

విశ్లేషణ :

Advertisement

‘మెన్షన్ హౌస్ మల్లేశం’ సినిమా ఇంట్రెస్టింగ్ గానే మొదలైంది. అదే ఫ్లోలో ఇంటర్వెల్ వరకు ఎంటర్టైన్ చేస్తుంది. అడల్ట్ కంటెంట్ డైలాగులు యూత్ ని విశేషంగా అలరిస్తాయి. కాసేపు నవ్విస్తాయి కూడా. సెకండాఫ్ మాత్రం సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా కొన్ని అనవసరమైన సన్నివేశాలు వచ్చి వెళ్తుంటాయి. కామెడీ గ్రాఫ్ కూడా తగ్గుతూ వస్తుంది. దర్శకుడు బాల సతీష్ ఫస్ట్ హాఫ్ ను బాగా హ్యాండిల్ చేశాడు. కానీ సెకండాఫ్ మాత్రం బ్యాలెన్స్ తప్పిన ఫీలింగ్ కలుగుతుంది. అతుకులు అతుకులుగా ఉంటుంది. అసలు ఫస్ట్ హాఫ్ ని డైరెక్ట్ చేసింది ఇతనేనా అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. క్లైమాక్స్ లో ఉన్న ఎమోషన్ కి కూడా ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు అంటే.. కచ్చితంగా అది డైరెక్షన్ లోపమనే చెప్పాలి.  కథ పరంగా ఇది కొత్తగా ఏమీ ఉండదు. ‘ఏక్ మినీ కథ’ వంటి సినిమాల్లో చూసిందే. కథనం విషయంలో జాగ్రత్త వహించి ఉంటే.. కచ్చితంగా ఇది మినిమమ్ గ్యారంటీ సినిమా అయ్యుండేది. సురేష్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు అంతగా గుర్తుండవు. సినిమాటోగ్రఫీ కూడా క్వాలిటీగా అనిపించింది.

నటీనటుల విషయానికి వస్తే.. శ్రీనాథ్ మాగంటి మంచి పెర్ఫార్మర్. ‘లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో ఇది ప్రూవ్ అయ్యింది. ఈ సినిమాలో అతని మేకోవర్ కూడా సహజంగా అనిపిస్తుంది. కాకపోతే ఇంత మాస్ రోల్ ని అతను బరువుగా ఫీలయ్యాడేమో అనిపిస్తుంది.  ఇతని ఆటిట్యూడ్ కి అర్బన్ కైండ్ ఆఫ్ రోల్స్ కేక్ వాక్. కానీ మల్లేశం వంటి మాస్ రోల్ కి ఇతను సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. గాయత్రీ రమణ చాలా సహజంగా నటించింది. ఆమె మేకోవర్ కూడా బాగుంది. రాజ్ కుమార్ కసిరెడ్డి ఈ సినిమాకి కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు అనుకుంట. ఆ లోటు స్పష్టంగా కనిపించింది. మిగతా నటీనటులు బాగానే చేశారు.

ప్లస్ పాయింట్స్..

Advertisement

ఫస్ట్ హాఫ్

యూత్-ఫుల్ కామెడీ

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్..

సెకండాఫ్

డైరెక్షన్

మొత్తంగా ‘మెన్షన్ హౌస్’ మల్లేశం… ఫస్ట్ హాఫ్ వరకు బాగానే అలరిస్తుంది, నవ్విస్తుంది. కానీ సెకండాఫ్ మాత్రం డిజప్పాయింట్ చేసింది. దాని విషయంలో జాగ్రత్త వహించి ఉంటే.. కచ్చితంగా దీని ఫలితం బెటర్ గా ఉండేదనే చెప్పాలి.

రేటింగ్ : 2.25/5

Related News

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

Big Stories

Advertisement
×