E-Paper
Advertisement

ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ..నాని ఖాతాలో హిట్టు పడినట్టేనా?

ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ..నాని ఖాతాలో హిట్టు పడినట్టేనా?
Advertisement

The Paradise Twitter Review: నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం “ది ప్యారడైజ్”. ఎన్నో అవంతరాలను వాయిదాలను అడ్డుకుంటూ ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై మొదటి నుంచే భారీగా అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో నాని జోడిగా ఖయాదు లోహర్ నటించి సందడి చేశారు ఇక స్పెషల్ సాంగ్ లు కీర్తి సురేష్ అద్భుతమైన స్టెప్పులతో మెస్మరైజ్ చేశారు. ఇక నానికి విలన్ పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన సంగతి తెలిసిందే.రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. ఇలా భారీ తారాగణంతో భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ సినిమాకు ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులు ఎలాంటి రివ్యూ ఇస్తున్నారు? జడల్ జమాన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ఈ సినిమాతో హిట్ కొట్టారా? ప్రేక్షకులు ఈ సినిమాకు ఎలాంటి విజయాన్ని అందించారు? అనే విషయానికి వస్తే..

Advertisement

ది ప్యారడైజ్ సినిమా పీక్ లెవెల్ లో ఉంది స్టైలిష్ ఎలివేటెడ్ ఎమోషనల్ సీన్స్, ఎమోషన్స్ పిక్స్ కు వెళ్లాలని టాటూ వెనక రహస్యం ఉంది అంటూ ట్వీట్ చేస్తున్నారు.

https://twitter.com/ReviewerBossu/status/2102793697096298668

Advertisement

ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన మోహన్ బాబు ఎంట్రీ ఒక అద్భుతమైన ‘ఇంట్రో సీన్’లా అనిపిస్తోంది – మాస్, ఆధిపత్యం, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లు ఇప్పటికే హోరెత్తిపోతున్నాయి.

ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో రావడంతో ఎక్కువ శాతం తెలంగాణ యాసతో డైలాగులు ఉన్నాయని, నార్మల్ రాయలసీమలో పెరిగిన వాళ్లకి… ఫస్ట్ అటెంప్ట్ లో డైలాగ్స్ అర్థం అవ్వటం కష్టమే అంటూ ట్వీట్ చేస్తున్నారు.

కొన్నిచోట్ల డైలాగ్ మిక్సింగ్ ఉండటం వల్ల క్లారిటీగా అర్థమవ్వటం లేదు. దీనికి తోడు తెలంగాణ యాస ఉండటంతో డైలాగులు అర్థం కాలేదని పక్క వాళ్ళ సహాయం తీసుకోవాల్సి వస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల తెలంగాణ యాసలు డైలాగులు పెట్టొచ్చు గాని మరి ఇంత రూటేడ్ గా పెడితే ఎలా అర్థం చేసుకోవాలి.

జైలు సీన్ చాలా అద్భుతంగా ఉంది.కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎంట్రీ చాలా బాగుంది
మొదటి 20 నిమిషాల్లో కొన్ని చోట్ల డైలాగులు స్పష్టంగా లేదు.

అద్భుతమైన కథ. అద్భుతమైన నటన. అద్భుతమైన దృశ్యాలు నిజంగా మర్చిపోలేని గొప్ప అనుభవం ఈ ప్యారడైజ్

ఇకపై నానికి నేచురల్ స్టార్ కాదు ఇది షేర్ నాని
‘ఆయా షేర్’ పాటలోని ఆ టైటిల్ కార్డ్ అద్భుతంగా ఉంది

Also Read: జానీ మాస్టర్ భార్య పై దాడి..పోలీసులను ఆశ్రయించిన సుమలత!

Related News

సీక్రెట్ సోల్జర్ మూవీ రివ్యూ…

సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

టైటిల్ మాత్రమే ‘ఎపిక్’.. సెకండ్ హాఫ్ అంతా ‘ట్రాఫిక్’!

ఎపిక్ ట్విట్టర్ రివ్యూ… బేబీ జంట హిట్ కొట్టారా?

‘సర్దార్ 2’ మూవీ రివ్యూ: ఇలా చేశావేంటి కార్తి?

సుహాస్ – సూరి మండాడి మూవీ రివ్యూ.. పోరులో నెగ్గిందెవరు?

‘మారెమ్మ’ మూవీ రివ్యూ: మాస్ మహారాజా తమ్ముడి కొడుకు మెప్పించాడా ?

Big Stories

Advertisement
×