E-Paper
Advertisement

అసలు జ్ఞాన దంతాలతో ఉపయోగం ఉందా? వీటిని ఎప్పుడు తొలగించాలి

అసలు జ్ఞాన దంతాలతో ఉపయోగం ఉందా? వీటిని ఎప్పుడు తొలగించాలి
Advertisement

Wisdom Tooth Uses And Removal | చాలామందికి జ్ఞాన దంతం వస్తుందంటేనే భయం మొదలవుతుంది. కొందరైతే వాటి వల్ల నొప్పి కలుగుతుందని భావించి వెంటనే తొలగించాలనుకుంటారు. అయితే ప్రతిసారి జ్ఞాన దంతాలను తొలగించాల్సిన అవసరం ఉండదు. అవి ఎలా పెరుగుతాయి, వాటికి తగినంత స్థలం ఉందా, చుట్టుపక్కల దంతాలకు ఇబ్బంది కలిగిస్తుందా అనేది ముఖ్యమైన విషయం. కొన్ని జ్ఞాన దంతాలు ఎలాంటి సమస్య లేకుండా జీవితాంతం ఉండిపోతాయి.

జ్ఞాన దంతం అంటే ఏమిటి?

జ్ఞాన దంతాల‌ను వైద్య పరిభాషలో థర్డ్ మోలర్ లేదా విజ్డమ్ టూత్ అని పిలుస్తారు. ఇవి సాధారణంగా నోటి వెనుక భాగంలో అంటే చివరగా ఉండే నాలుగు దంతాలు. సాధారణంగా 17 నుంచి 25 సంవత్సరాల మధ్య ఇవి బయటకు వస్తాయి. గతంలో మనుషులు గట్టి ఆహారం ఎక్కువగా తినేవారు. అందువల్ల ఈ దంతాలు ఆహారాన్ని నమలడంలో సహాయపడేవి. అయితే కాలక్రమేణా మన ఆహారపు అలవాట్లు మారాయి. ఇప్పుడు ఎక్కువగా ఉడికించిన, మెత్తని ఆహారాన్ని తీసుకుంటున్నాం. దీంతో మన దవడ సైజు కూడా మారింది. ఫలితంగా కొందరి నోట్లో జ్ఞాన దంతాలు పూర్తిగా పెరగడానికి తగినంత స్థలం ఉండదు.

ప్రతి జ్ఞాన దంతాన్ని తొలగించడం అవసరమా?

Advertisement

అన్ని సార్లు జ్ఞాన దంతాల‌ను తొలగించాల్సిన అవసరం లేదు. అది నేరుగా పెరిగి, దవడలో తగినంత స్థలం ఉంటే సమస్య ఉండకపోవచ్చు. అలాగే దాన్ని సులభంగా బ్రష్ చేయగలిగితే, దంతక్షయం లేదా చిగుళ్ల సమస్యలు లేకపోతే తొలగించాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్ సూచనతో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం సరిపోతుంది.

జ్ఞాన దంతాలు వల్ల సమస్యలు ఎప్పుడు వస్తాయి?

దవడలో స్థలం సరిపోనప్పుడు జ్ఞాన దంతాలు సరైన ఆకారంలో పెరగవు. అది సగం మాత్రమే బయటకు రావచ్చు లేదా పక్కకు వంగి పెరగవచ్చు. కొన్నిసార్లు అది చిగుళ్లు లేదా ఎముకలోనే ఇరుక్కుపోతుంది. ఇలాంటి ప్రాంతాల్లో ఆహారం చిక్కుకోవడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో చిగుళ్ల వాపు, నొప్పి, నోటి దుర్వాసన, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రావచ్చు. నోరు తెరవడంలో కూడా ఇబ్బంది కలగవచ్చు. జ్ఞాన దంతాల‌ను సరిగ్గా శుభ్రం చేయలేకపోతే దంతక్షయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పక్క నున్న దంతానికి కూడా నష్టం కలగిస్తాయి.

Advertisement

Also Read: నిద్రలో చెడు కలలు ఇబ్బంది పెడుతున్నాయా? పడుకునే ముందు ఈ 5 పనులు చేయండి

జ్ఞాన దంతాలు‌ను ఎప్పుడు తొలగించాలి?

జ్ఞాన దంతాల‌లో పదేపదే నొప్పి లేదా ఇన్ఫెక్షన్ వస్తే వైద్యుడు తొలగించమని సూచిస్తాయి. తీవ్రమైన దంతక్షయం ఏర్పడినా లేదా పక్కనున్న దంతానికి నష్టం కలిగించినా తొలగింపు అవసరం కావచ్చు. అయితే భవిష్యత్తులో సమస్య రావచ్చనే ఒక్క కారణంతో ప్రతి జ్ఞాన దంతాన్ని ముందుగానే తొలగించరు. దంతం ఉన్న స్థానం, దాని పరిస్థితి, లక్షణాలు, చుట్టుపక్కల దంతాల పరిస్థితిని వైద్యుడు పరిశీలిస్తారు.

Also Read: మీ ముఖాన్ని అద్దెకు ఇస్తారా? కొత్త పార్ట్ టైమ్ బిజినెస్ గురూ

దంత పరీక్ష ఎందుకు ముఖ్యం?

దంత వైద్యుడు అవసరమైతే OPG ఎక్స్‌రే చేయించమని సూచిస్తారు. ఈ పరీక్ష ద్వారా దంతం దవడలో ఎలా ఉందో తెలుసుకోవచ్చు. దంతం ఇరుక్కుపోయిందా లేదా పక్కనున్న దంతాలకు ప్రమాదం ఉందా అనే విషయాన్ని కూడా వైద్యుడు అంచనా వేస్తారు. అందువల్ల జ్ఞాన దంతం ఉందని భయపడాల్సిన అవసరం లేదు. నొప్పి, వాపు, ఇన్ఫెక్షన్ లేదా శుభ్రం చేయడంలో ఇబ్బంది ఉంటే మాత్రం దంత వైద్యుడిని సంప్రదించాలి.

Related News

ఆ దేశంలో అంతా రివర్స్.. ప్రజలకు కరెంట్ బిల్లు చెల్లిస్తున్న ప్రభుత్వం.. ఎలాగంటే

నమ్మకానికి మారుపేరు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టాల్లో తోడుగా నిలబడే స్నేహితులు

ఎంత సంపాదించినా పేదరికంలోనే ఉంటారు.. మీరు ఈ తప్పులు చేస్తున్నారా?

వేగంగా ముసలిబారుతున్న మెదుడు.. మీరు చేస్తున్న ఈ తప్పులే కారణం

ప్రేమ లేదా ఫ్రెండ్‌షిప్.. చాటింగ్‌లో ఈ చిన్న సంకేతాలు కనిపిస్తే పట్టేయండి

రోజూ నెయ్యి తింటున్నారా? గుండె ఆరోగ్య సమస్యలున్నవారు ఈ విషయాలు తెలుసుకోండి

ఆత్మవిశ్వాసం, ఉత్సాహంగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎక్కడికి వెళ్లినా సందడి చేస్తారు

Big Stories

Advertisement
×