Telugu TV Serials: బుల్లితెర ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న సీరియల్స్ ముందు మరి ప్రోగ్రాం కానీ అలాగే సినిమాలో కానీ పనికిరావని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలు కన్నా సీరియల్స్ కి ఎక్కువ డిమాండ్ ఉండడంతో జనాలు కూడా వీటిని చూసేందుకు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో సీరియల్స్ కి డిమాండ్ పెరగడంతో పాటుగా పోటీ కూడా పెరిగింది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఒక సీరియల్ స్టోరీ కి మించి మరొక స్టోరీ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. మరి సీరియల్స్ కి మంచి రేటింగ్ కూడా నమోదు కావడంతో ఎక్కువ మంది వీటిని చూసేందుకు కూడా ఆసక్తికనబరుస్తున్నారు. ఈవారం ఈటీవీ సీరియల్ కి మంచి రేటింగ్ వచ్చింది అలాగే, ఏ సీరియల్ శుభం కార్డు వేసుకోబోతుందో ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం..
వీక్లీ ఎలాగైతే సినిమాలకు కలెక్షన్లు ఉంటాయో అదేవిధంగా.. సీరియల్స్ కి కూడా ప్రతివారం డిఆర్పి రేటింగ్ అనేది విడుదల చేస్తూ ఉంటారు. మరి ఈ వారం టాప్ లోకి గుండెనిండా గుడిగంటలు రావడం విశేషం. ఇటీవల కాలంలో ఈ సీరియల్ టాప్ లోని కొనసాగుతుంది. అదేవిధంగా ఇంటింటి రామాయణం, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఇప్పుడు మరోసారి జోరందుకున్నట్లు తెలుస్తుంది. ఈమధ్య ఈ రెండు సీరియల్స్ స్టోరీలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో వీటికి టిఆర్పి రేటింగ్ కూడా ఎక్కువగా నమోదయింది. ఈవారం వీక్లీ రిపోర్టు ప్రకారం.. ఇల్లు ఇల్లాలు పిల్లలు మళ్లీ టాప్లెక్కి వచ్చిందని తెలుస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. అదేవిధంగా గోదావరి సీరియల్ రేటింగు మళ్లీ డౌన్ అవ్వడంతో ఆ సీరియల్ కి శుభం కార్డు పడిపోతుంది అని టాక్ వినిపిస్తుంది..
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియలు ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ సీరియస్లలో ఒకటి. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన ఈ సీరియల్ ఇప్పుడు మళ్లీ కాస్త డౌన్ అయింది. అన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు ఇటీవల సీరియల్ కి రేటింగ్ కూడా బాగా పడిపోయింది. స్టోరీలో అనేక ట్విస్టులు ఏర్పడడంతో ఈ సీరియల్ శుభం కార్డు వేసుకోబోతుంది అన్న టాకు కూడా వినిపించింది. కానీ ఇప్పుడు స్టోరీలో మళ్ళీ ట్విస్టులు చోటు చేసుకోవడంతో ఈ సీరియల్ రేటింగ్ మళ్ళీ పెరిగింది అని తెలుస్తుంది. శ్రీవల్లి తన ఇంటికి మళ్లీ రావాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ బాధ చూసిన నర్మదా ఎలాగైనా సరే తనకి సహాయం చేయాలి అని అనుకుంటుంది. మొత్తానికి ఈ సీరియల్లో మళ్లీ అనేక ట్విస్టులు చోటు చేసుకోవడంతో రేటింగ్ కూడా భారీగా పెరిగింది అని తెలుస్తుంది. ఇకముందు స్టోరీలలో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి అన్నది చూడాలి..
Also Read : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..