Paradise FirstDay:వచ్చేసింది ..ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ది ప్యారడైజ్ థియేటర్ లలోకి వచ్చేసింది.న్యాచురల్ స్టార్ నాని, కయాదు లోహార్ కలిసి నటించిన ఈ సినిమాలో శికంజా మాలిక్ గా డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటించిన సంగతి తెల్సిందే .ఇక ‘ది ప్యారడైజ్’ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు కూడా.
‘దసరా’ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి చేతులు కలపడంతో సినిమాపై మొదటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. దీనికి తోడు సినిమా ప్రమోషన్స్‌లో కనిపించిన నాని లుక్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
ఇక ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.ఇకఈ సినిమాపై ‘ది మొదటి నుంచి భారీ అంచనాలు ఉండగా.. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఆ అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థమవుతోంది. సినిమా బిజినెస్ పరంగా ఏకంగా రూ.101 కోట్ల మార్క్‌ను దాటిందనే ట్రేడ్ టాక్‌తో ‘ది ప్యారడైజ్’పై ఆసక్తి మరింత పెరిగింది.
ఇప్పటికే సుమారు రూ.102.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగుతున్న ఈ సినిమా.. రిలీజ్‌కు ముందే బాక్సాఫీస్ దగ్గర హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నాని కెరీర్‌లోనే భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఇది ఒకటిగా నిలవనుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 900 థియేటర్ల వరకు సినిమాను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మరో 500 థియేటర్ల వరకు స్క్రీన్లను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ మార్కెట్‌ను కూడా కలుపుకుంటే వరల్డ్ వైడ్‌గా 2,000కి పైగా థియేటర్లలో ‘ది ప్యారడైజ్’ సందడి చేయబోతోందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అసలు హైప్‌కు కారణం అడ్వాన్స్ బుకింగ్సే. రిలీజ్‌కు ముందే టికెట్ల కోసం ప్రేక్షకులు పోటీ పడుతున్న తీరు చూస్తుంటే.. నాని మార్కెట్‌లో ఈ సినిమా కొత్త లెక్కలు రాస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. ముఖ్యంగా టైర్-2 హీరోల సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులతో పోలిస్తే ‘ది ప్యారడైజ్’కు వస్తున్న రెస్పాన్స్ గట్టిగానే ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రీమియర్స్ గ్రాస్ ఇప్పటికే దాదాపు రూ.10 కోట్ల మార్క్‌ను దాటినట్లు సమాచారం. మరోవైపు ఓవర్సీస్‌లో కూడా సినిమా బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. అక్కడ ప్రీ-సేల్స్ రూ.15 కోట్లకు పైగా చేరినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ప్రీమియర్స్, డే-1 బుకింగ్స్‌ను కలిపి వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.49.5 కోట్ల ప్రీ-బుకింగ్స్ మార్క్ నమోదైనట్లు సమాచారం.ఇదే నిజమైతే నాని టాప్ లీగ్ లోకి దూసుకెళ్లినట్టె !
ది ప్యారడైజ్’ మాత్రం ఒక్క నైజాం ఏరియాలోనే ఆ స్థాయి షేర్‌ను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సినిమా సుమారు రూ.20 కోట్ల షేర్‌ను టార్గెట్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాల్లో అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక వరల్డ్ వైడ్‌గా రూ.30 కోట్లకు అటూ ఇటూగా షేర్ వచ్చే ఛాన్స్ ఉందనే లెక్కలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ఎంత భారీగా ఉన్నా.. అసలు సినిమా టాక్ వచ్చిన తర్వాతే అసలు విషయం తెలుస్తుంది. ‘దసరా’తో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌కు వచ్చిన క్రేజ్ ఒక రేంజ్‌లో ఉండగా.. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’తో మరో ప్రపంచాన్ని ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నారు. ‘దసరా’లో రా అండ్ రస్టిక్ ట్రీట్‌మెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ‘ది ప్యారడైజ్’లో కూడా అదే స్థాయి ఇంటెన్సిటీ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
also read :అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్
నాని నటించిన ‘సరిపోదా శనివారం’, ‘హాయ్ నాన్న’, ‘దసరా’ వంటి సినిమాలు నాని మార్కెట్ ని పెంచేశాయి. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ ఆ మార్కెట్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్తుందా చూడాలి.