Sumalatha: ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత(Sumalatha) గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. తన పట్ల రఘు మాస్టర్ వర్గానికి చెందిన వారిలో పలువురు మహిళ డాన్సర్లు దాడి చేశారంటూ ఈమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కొద్దిరోజులుగా డాన్సర్స్ ఫిలిం ఫెడరేషన్లు పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేడు సుమలత రఘు మాస్టర్ సభ్యులతో ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భాగంగా 2 వర్గాల సభ్యుల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి.
తెలుగు సినీ డాన్సర్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న సుమలత కార్యవర్గాన్ని ఫిలిం ఫెడరేషన్ రద్దు చేసింది. మీటింగ్ కు హాజరైన మొత్తం 225 మంది డాన్సర్స్ లో సుమలతకు కేవలం 11 మంది మాత్రమే డాన్సర్లు మద్దతు తెలిపారు. రఘు మాస్టర్ కు 214 మంది డాన్సర్స్ మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 11వ తేదీ డాన్సర్ అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఈ సమావేశంలో భాగంగా రఘు మాస్టర్ వర్గానికి చెందిన కొంతమంది డాన్సర్స్ తనపై దాడి చేశారని సుమలత ఆరోపించారు.
రఘు మాస్టర్ వర్గంలో కొంతమంది లేడీ డాన్సర్లు మినిట్స్ బుక్ విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. బుక్ లాక్కోవడంతో అడ్డుకున్నామని రఘు మాస్టర్ వర్గానికి చెందిన లేడీ డాన్సర్స్ తెలియజేస్తున్నారు. అయితే తనపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారు అంటూ సుమలత బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి ఈ ఫిర్యాదులపై పోలీసుల రియాక్షన్ ఎలా ఉంటుంది? ఫిర్యాదుల పట్ల రఘు మాస్టర్ ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది.
అసోసియేషన్‌కు సంబంధించిన అధికారిక లావాదేవీలు, గత సమావేశాల వివరాలు నిక్షిప్తమై ఉండే కీలకమైన ‘మినిట్స్ బుక్’ ఎవరి వద్ద ఉండాలి అని అంశంపై ఇరువర్గాల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. ఈ మినిట్స్ బుక్ విషయంలో ఒకవైపు మాజీ కార్యవర్గం మరోవైపు మెజారిటీ మద్దతు ఉన్న రఘు మాస్టర్ వర్గం ఎదురుపడటంతో ఇరువురి మధ్య మాట పెరిగి తోపులాట జరిగింది. ఇందులో భాగంగానే సుమలతపై కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇలా తనపై దాడి జరగడంతో సుమలత నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనపై దాడి చేసిన వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మరోవైపు రఘు మాస్టర్ వర్గ సభ్యులు మాత్రం ఈ విషయాన్ని తోసి పుచ్చారు. తమ వర్గంలో అత్యధిక మెజారిటీ సభ్యులు ఉన్నారన్న నేపథ్యంలోనే సుమలత ఉద్దేశపూర్వకంగా తమపై ఇలాంటి ఫిర్యాదులు చేసింది అంటూ రఘు మాస్టర్ వర్గం ఖండించింది.