Premante Movie Review : బలగం తర్వాత ప్రియదర్శి సెలెక్ట్ చేసుకునే స్టోరీలపై ఎక్కడో చిన్న పాజిటివ్ వైబ్ వచ్చింది. కానీ, ఆయన నుంచి ఈ మధ్య వచ్చిన సినిమా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఆనంది అనే హీరోయిన్‌తో ప్రేమంటే అనే సినిమాతో లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో వచ్చాడు. ఈ రోజు థియేటర్స్‌లోకి వచ్చిన ఆ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం…
మధు సూదన్ (ప్రియదర్శి) తనకు ఉన్న అప్పుల వల్ల వచ్చే పెళ్లి సంబంధాలను రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో రమ్య (ఆనంది)ని ఓ పెళ్లిలో కలుస్తాడు. తర్వాత వారికి పెద్దలు పెళ్లి చేయడం… సెపరేట్‌గా కాపురం పెట్టడం అవుతుంది. తర్వాత మధు సూదన్ గురించి ఓ నిజం రమ్యకు తెలుస్తుంది. ఆ తర్వాత మధు సూదన్ – రమ్యల పెళ్లి జీవితం ఎలా టర్న్ అయింది ? ఇద్దరి మధ్య ప్రేమ ఎంత పీక్స్‌లో ఉంది ? వీరి దాంపత్య జీవితం ఎలా సాగింది ? వీరి జీవితంలోకి ఆశా మేరీ (సుమ కనకాల) అనే పోలీస్ ఎందుకు ఎంట్రీ అయింది ? అనేవి మిగితా సినిమాలో చూడొచ్చు.
కొంత మంది సినిమా చేయాలని ఫిక్స్ అవుతారు. మంచి కథ రాసుకుంటారు. కానీ, దాన్ని అంతే మంచిగా ప్రజెంట్ చేయడంలో తడుబడుతారు. అలాంటి క్యాటగిరిలోకే వస్తుంది ఈ ప్రేమంటే. డైరెక్టర్ కథను బానే రాస్తున్నాడు. పెళ్లి తర్వాత చచ్చేంత ప్రేమ.. అందులోనూ దొంగతనాలు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి కాన్సెప్టే. కానీ, దాన్ని స్క్రీన్ ప్లేను మాత్రం సరిగ్గా రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అవ్వలేదు.
హీరో వాళ్ల ఫాదర్‌కి హెల్త్ బాలేదు అని చూపిస్తారు. అందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్టూ చూపించారు. కానీ, సినిమాలో హీరో ఫాదర్ కనీసం దగ్గడం కూడా కనిపించదు. చాలా ఎనర్జిటిక్ గా ఉన్నట్టు కనిపిస్తాడు. అలాంటి వ్యక్తికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసేంత రోగం ఏం వచ్చిందో అనే క్లారిటీ డైరెక్టర్ సరిగ్గా ఇవ్వలేదు.
అలాగే… హీరో కొన్ని ఇళ్లల్లో దొంగతనం చేస్తాడు. హైదరాబాద్‌లో అన్నీ ఏరియాలు కవర్ చేసినా… వాళ్ల లోన్ ఇంకా తీరలేదా? సినిమా ఇంకా అయిపోలేదా ? అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దొంగతనం చేస్తూ ఇళ్లు క్లీన్ చేయడం ఏంటో.. బిర్యానీ చేయడం ఏంటో మనకు టార్చర్ కాకపోతే అనే ఫీలింగ్ కూడా వస్తుంది.
అన్నీ ఇళ్లల్లో దొంగతనం జరిగితే ఓనర్స్ ఊరుకుంటారా ? బ్లాక్ మనీ అయినా… అఫీషియల్‌గా కాకపోయినా.. అన్ అఫీషియల్‌గా అయినా… ఎంక్వైరీ చేయిస్తారు కదా… ఎందుకంటే వాళ్లు చాలా పలుకుబడి ఉన్నవాళ్లు. అంత డబ్బు కొట్టేసినా… ఎందుకు సైలెంట్‌గా ఉంటారు ? కొంచెం కూడా కనెక్టివ్‌గా లేదు.
ఇలా చెప్పుకుంటే పోతే సినిమాలో చాలా వరకు ఉన్నాయి.
సినిమాలో సుమ క్యారెక్టర్ పెట్టారు. సుమతో పాటు హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ ఉన్నారు. ముగ్గరు ఉంటే మినిమం కామెడీ ఎక్స్‌పక్ట్ చేయొచ్చు. అది జరగపోగా… ఆ ఎపిసోడ్ అంతా తలనొప్పిగానే మారింది. క్లైమాక్స్‌లో దొంగలను వదిలేయ్యడం కూడా లాజిక్ లేస్ గానే ఉంది.
కానీ, సినిమాలో హీరో – హీరోయిన్ మధ్య వచ్చిన కొన్ని లవ్ సీన్స్ పర్లేదు. ఆ టైం వారి మధ్య వచ్చిన డైలాగ్స్ కూడా పర్లేదు. నిజానికి అవే కాస్త ఉపశమనంగా అనిపిస్తాయి. అంతకు మించి సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు.
ఫర్ఫామెన్స్ విషయానికి వస్తే… ప్రియదర్శి, ఆనంది బానే చేసినా… కొన్ని సందర్భాల్లో వారి ఓవర్ యాక్టింగ్ థియేటర్ కూర్చిలో కూర్చున్న ఆడియన్‌కు చిరాకు తెప్పిస్తుంది. సుమ, వెన్నల కిషోర్ నుంచి కూడా అలాంటి పరిస్థితే. మ్యూజిక్ ఎఫెక్ట్ అసలేం లేదు. కెమెరా పనితీరు పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కొంత వరకు కనిపించాయి స్క్రీన్‌పై. ఎడిటింగ్ కు కావాల్సినంత పని ఉంది.
కాన్సెప్ట్ వరకు ఒకే
ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్
లాజిక్ లెస్ సీన్స్
సెకండాఫ్
కధనం
మ్యూజిక్
సాంగ్స్
మొత్తంగా… సమాధానం లేని ప్రేమంటే