E-Paper
Advertisement

జీ.డీ.నాయుడు మూవీ రివ్యూ.. బయోపిక్ లో ఆర్.మాధవన్ మెప్పించారా?

జీ.డీ.నాయుడు మూవీ రివ్యూ.. బయోపిక్ లో ఆర్.మాధవన్ మెప్పించారా?
Advertisement

GDN Movie review: భారతదేశపు ఎడిసన్ గా సుప్రసిద్ధులైన గోపాలస్వామి దొరైస్వామి నాయుడు అలియాస్ జీడి నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ జీడిఎన్ (GDN). జీడీ నాయుడు ఎవరో కాదు మన తెలుగు తేజమే. కోయంబత్తూర్ లో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీలో జన్మించారు. చరిత్ర మరిచిపోయినా.. ఆ గొప్ప మహనీయుడి కథను నేడు ఆర్.మాధవన్ (R.Madhavan) వెండితెరపై ఆవిష్కరించారు. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ తరువాత మాధవన్ నటించి , నిర్మించిన చిత్రం ‘జీడీఎన్’. ముఖ్యంగా కోయంబత్తూర్ లో తొలి తరం పారిశ్రామికవేత్తగా అద్భుతమైన ఆవిష్కరణలను చేసిన జీడీ నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా కృష్ణ కుమార్ రామ కుమార్ (Krishna kumar Rama Kumar) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకి సోషల్ మీడియాలో మంచి పాజిటివ్ టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంది .ఈ సినిమా రివ్యూ ఇప్పుడు చూద్దాం..

జీడీఎన్ మూవీ స్టోరీ..

రైతులంటే ప్రాణం ఇచ్చే జీడీ నాయుడు (మాధవన్) వ్యవసాయం కోసం చిన్న చిన్న పరికరాలు కనిపెడుతూ ఉంటాడు. అదే సమయంలో సైలెంట్ గా ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకొస్తారు. మరోవైపు తన కష్టంతో బస్సు బిజినెస్ ని ఒక పెద్ద సామ్రాజ్యంగా మారుస్తారు. ఈ ఎదుగుదలను చూసి ఓర్వలేని బ్రిటిష్ వారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ జయరాం ద్వారా ఆయనకు చుక్కలు చూపిస్తారు. ఫేక్ డాక్యుమెంట్లతో భారీ ట్యాక్స్ వేసి ఆస్తులను లాక్కోవడానికి కుట్ర పన్నుతారు. ఈ కుట్రల నుంచి జీడీ నాయుడు ఎలా బయటపడ్డారు? అనేది అసలు కథ.

Advertisement

ALSO READ:‘పళ్ళ బురుసు’ కోసం కోర్టుకెక్కిన పంచాయతీ.. ఎమోషన్స్ తో ఆకట్టుకుంటున్న ట్రైలర్!

నటీనటుల పర్ఫామెన్స్:

నటీనటులు ఎలా నటించారు అనే విషయానికొస్తే.. మాధవన్ అనడం కంటే నిజంగానే జీడీఎన్ పాత్రలో ఆయన జీవించేశాడు అని చెప్పవచ్చు. సంతోషం, బాధ, కోపం, అవమానం ఇలా అన్ని వేరియేషన్స్ చూపించి తాను ఎంత గొప్ప నటుడో మరోసారి నిరూపించారు. అనుభవజ్ఞులైన జయరామ్ (Jayaram)నటన సినిమాను మరింత నిలబెట్టింది. దుషారా విజయన్, సీనియర్ హీరోయిన్ ప్రియమణి (Priyamani) తంబి రామయ్య, అతిధి బాలన్ ఇలా పెద్ద తారాగణమే ఈ చిత్రంలో భాగమయ్యారు. ఎప్పుడూ కామెడీతో అదరగొట్టే కరుణాకరన్ ఈ చిత్రంలో విలన్ షేడ్స్ ఉన్న నెగిటివ్ రోల్ లో కనిపించి ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేశారు.

Advertisement

ముఖ్యంగా సినిమాలలో హీరోల లవ్ సాంగ్ వేసుకొని యువత తిరుగుతుంటే.. జీడిఎన్ మాత్రం అప్పట్లోనే ఊరికే ఉండకుండా ఏదో ఒక కొత్త మిషన్ కనిపెడుతూనే.. బ్రిటిష్ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా, ఏడెనిమిది రకాల ట్యాక్స్ వేసిన జీడీ మాత్రం సైంటిఫిక్ బ్రెయిన్ తో వాళ్లకు దిమ్మతిరిగే ఆన్సర్లు ఇస్తూ ఉంటాడు. అయితే సినిమాలో భార్యను వేరే వాళ్లకు ఇచ్చి పెళ్లి చేసే సీన్లు మాత్రం అరే ఈ ఐడియా డైరెక్టర్ కి ఎప్పుడు వచ్చింది రా బాబు అని ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అయినా సరే బయోపిక్ అన్నాక ఇలాంటి కొన్ని ట్విస్ట్ లు ఉండాల్సిందేగా..

సినిమా ప్లస్ పాయింట్స్:

మాధవన్ నటన సినిమాకు ఆత్మ లాంటిది. అరవింద్ నాథన్ సినిమాటోగ్రఫీ , గోవిందు వసంత మ్యూజిక్ ఆ పాతకాలం నాటి వైబ్ ను మళ్లీ మన కళ్ళ ముందు కట్టిపడేస్తాయి. ఎమోషనల్ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి.

సినిమా మైనస్ పాయింట్స్:

కొన్నిచోట్ల సినిమా కాస్త డాక్యుమెంటరీలా మారిపోతుంది. కనెక్టివిటీ ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉంటే బాగుంటుంది అనే భావన ఆడియన్స్ లో కలుగుతుంది.

చివరి మాటగా:

ఒక గొప్ప శాస్త్రవేత్త జీవితాన్ని, ఆయన చేసిన సాహసాలను నేటి తరానికి పరిచయం చేసిన దర్శకుడు కృష్ణకుమార్ రామకుమార్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు ఒక పరిశోధనా పెట్టే. మొత్తానికి జీడిఎన్ అనేది మనకు ఒక చక్కటి ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. థియేటర్కు వెళ్లి ధైర్యంగా సినిమా చూడవచ్చు.

జీడీఎన్ మూవీ రేటింగ్ 2.5/5

Related News

The Paradise Review : ‘ది ప్యారడైజ్’.. నాని కొత్త ప్రయోగం ఏమైందంటే?

ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ..నాని ఖాతాలో హిట్టు పడినట్టేనా?

సీక్రెట్ సోల్జర్ మూవీ రివ్యూ…

సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

టైటిల్ మాత్రమే ‘ఎపిక్’.. సెకండ్ హాఫ్ అంతా ‘ట్రాఫిక్’!

ఎపిక్ ట్విట్టర్ రివ్యూ… బేబీ జంట హిట్ కొట్టారా?

‘సర్దార్ 2’ మూవీ రివ్యూ: ఇలా చేశావేంటి కార్తి?

సుహాస్ – సూరి మండాడి మూవీ రివ్యూ.. పోరులో నెగ్గిందెవరు?

Big Stories

Advertisement
×