E-Paper
Advertisement

కాపు వ్యూహం ఫెయిల్.. జగన్ ప్లాన్ బి ఇదే.. అనిల్ యాదవ్‌తో బిగ్ గేమ్!

కాపు వ్యూహం ఫెయిల్.. జగన్ ప్లాన్ బి ఇదే.. అనిల్ యాదవ్‌తో బిగ్ గేమ్!
Advertisement

BC Vote Bank: రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ కొంతకాలంగా సామాజిక సమీకరణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల కాపు నినాదాన్ని ముందుకు తీసుకొచ్చింది. అయితే ఈ నినాదం ఆశించిన స్థాయిలో రాజకీయ ప్రయోజనం కనిపించలేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఇప్పుడు బీసీ ఓటు బ్యాంకుపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి గెస్ట్ రోల్ రాజకీయాలు చేస్తూ వస్తున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించే దిశగా చర్చలు జరిగాయని విశ్వసనీయ సమాచారం.

జగన్‌తో అనిత్ యాదవ్ భేటీ..

Advertisement

ఇటీవల వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డితో అనిల్ కుమార్ యాదవ్ వరుసగా భేటీ అయ్యారు. తనకు నెల్లూరు జిల్లాలో ఓ నియోజకవర్గం కేటాయించాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నియోజకవర్గం కంటే ముందుగా రాష్ట్రవ్యాప్తంగా బీసీ నాయకులు, యువతను ఏకం చేసే బాధ్యత తీసుకోవాలని జగన్ సూచించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో బీసీ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశాలపై కూడా పార్టీ అంతర్గతంగా చర్చ జరుగుతోందని సమాచారం

సంచలనంగా మారిన అనిల్ కుమార్ యాదవ్ పోస్టు..

Advertisement

ఇటీవల ఎక్స్ వేదికగా అనిల్ కుమార్ యాదవ్ చేసిన పోస్టు ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. బీసీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తూ.. బీసీలు కళ్లు ఎర్ర చేస్తే కూటమి పార్టీలు బూడిదలో కలిసిపోతాయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.

Also Read: ఓఆర్‌ఆర్ కాంట్రాక్టర్లపై సీఎం ఫైర్.. అధికారులకు ఆ రూల్స్ తప్పనిసరి!

వైసీపీ మైలేజీ ఇస్తుందా..?

మొత్తానికి అనిల్ కుమార్ యాదవ్‌ను రాష్ట్రస్థాయి బీసీ ముఖచిత్రంగా నిలబెట్టే దిశగా వైసీపీ అడుగులు వేస్తోందన్న ప్రచారం.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ వ్యూహం వైసీపీ మైలేజీ ఇస్తుందా..? రాజకీయంగా ఎంత మేరకు కలిసి వస్తుంది..? అనే విషయాలపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read: ఆ కేసులు తేలితే జీవితకాలం జైల్లోనే!.. సీనియర్ ఐఏఎస్‌పై హైకోర్టు సెన్సేషనల్ కామెంట్స్

Tags

Related News

గెలుపు గ్రాఫ్‌ తగ్గని నేత.. ప్రజాబలంలో మార్పు లేదు. బలమైన నేతగా దానం.. బరిలో ప్రత్యర్థివర్గానికి గట్టిపోటీ..!

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

Big Stories

Advertisement
×