E-Paper
Advertisement

థాయ్‌లాండ్ స్కూల్‌లో కాల్పుల కలకలం.. 8మంది మృతి-15 మందికి గాయాలు, నిందితుడు విద్యార్థే

థాయ్‌లాండ్ స్కూల్‌లో కాల్పుల కలకలం.. 8మంది మృతి-15 మందికి గాయాలు, నిందితుడు విద్యార్థే
Advertisement

Thailand: థాయ్‌లాండ్‌లోని ఓ స్కూల్‌లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. నిందితుడు తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. బ్యాంకాక్‌కు ఉత్తరాన నోంతబురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అసలు ఏం జరిగింది.

థాయ్‌లాండ్ స్కూల్‌లో కాల్పుల కలకలం

థాయిలాండ్‌ నోంతబురి ప్రాంతంలోని ఓ స్కూల్‌లో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విచక్షణా రహితంగా తోటి విద్యార్థులు, టీచర్లను కాల్చాడు ఒక విద్యార్థి. ఆ తర్వాత తనను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

8మంది మృతి-15 మందికి గాయాలు

Advertisement

నిందితుడితోపాటు విద్యార్థులు, ముగ్గురు టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు వెల్లడించారు. దాదాపు 15 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.  ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అంబులెన్సులను రప్పించి గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

నిందితుడు విద్యార్థే, విచారణ మొదలు

ఈ ఘటనపై థాయ్‌లాండ్ విద్యాశాఖ మంత్రి వాంగ్‌థాంగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై పూర్తి నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఆ పాఠశాలలో చదువుతున్నాడు. ఆ విద్యార్థి పేరు, వయస్సు, ఘటనకు దారితీసిన కారణాలు, ఆయుధాన్ని ఎలా సంపాదించాడనే విషయాలు వెల్లడించలేదు.

Advertisement

ఘటన జరిగిన సమయంలో పాఠశాలలో సుమారు 3 వేల మంది విద్యార్థులు, 147 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కాల్పుల ఘటనతో పాఠశాలలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల సందడితో కళకళలాడే పాఠశాల, క్షణాల్లో అక్కడి పరిస్థితి మారిపోయింది.

ALSO READ: సంతకాలతో భయపెడుతున్న ట్రంప్.. భారతీయులకు ఊహించని షాక్ 

థాయిలాండ్‌ పాఠశాలల్లో కాల్పుల ఘటనలు చాలా అరుదు. ఇటీవల వరుస సంఘటనలు అక్కడి తల్లిదండ్రులను ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణ థాయిలాండ్‌లోని హాట్‌యాయ్‌ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఓ విద్యార్థి గాయపడిన విషయం తెల్సిందే.

Related News

దక్షిణాఫ్రికాలో ఘోరం.. అర్ధరాత్రి ఇంట్లోకి జొరబడి కాల్పులు.. 11 మంది దుర్మరణం!

షార్జాలో NRI దారుణహత్య.. శరీరాన్ని 9 భాగాలు చేసి, జాడలేని భార్య-కొడుకు

ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి.. ఈసారి ఎయిర్‌లైన్స్ వంతు, బుధవారం నుంచి కొత్త ఆంక్షలు

వైట్‌హౌస్‌లో ఆ మూడు మీడియా సంస్థలపై బ్యాన్.. డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

సింగపూర్ తీరంలో షిప్‌లు ఢీ.. ఎగిరిపడ్డ కార్మికులు, వీడియో వైరల్

కెనడాలో విమాన ప్రమాదం.. ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ మృతి, ఎలా జరిగింది?

రియాద్‌పై హౌతీల మిసైల్ ఎటాక్.. మిడిల్ ఈస్ట్‌లో హై అలర్ట్!

మాస్కోపై ఉక్రెయిన్ మెగా అటాక్.. 1,000కి పైగా డ్రోన్లతో రష్యాకు భారీ షాక్

Big Stories

Advertisement
×