KishkindhaPuri Movie review: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఈ మధ్య కాలంలో సరైన హిట్టు పడలేదు. అయినప్పటికీ వరుస సినిమాలతో ఆడియన్స్ పై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. 4 నెలల క్రితం ‘భైరవం’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్లాప్ మూటగట్టుకున్న శ్రీనివాస్.. ఇప్పుడు ‘కిష్కింధపురి’ అనే హర్రర్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో అయినా అతను హిట్టు కొట్టాడా? లేదా అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ: ‘కిష్కింధపురి’కి చెందిన రాఘవ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), మైథిలీ (అనుపమ పరమేశ్వరన్) ఓ ఘోస్ట్ వాకింగ్ టూర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. ఓ పాడుబడ్డ బంగ్లాకి కొంతమంది జనాలను తీసుకెళ్లి కట్టుకథలు చెప్పి వాళ్ళని ఎంటర్టైన్ చేయడం వీళ్ళ జాబ్ డిస్క్రిప్షన్. అయితే 35 ఏళ్ళ క్రితం మూతబడ్డ సువర్ణ మాయ రేడియో స్టేషన్ కి వెళ్లాలని జనాలు రాఘవ్, మైథిలి అండ్ టీంని కోరతారు.అక్కడ కూడా ఏమీ ఉండదులే అని భావించి రాఘవ్, మైథిలి వెళ్తారు.కానీ కట్ చేస్తే అక్కడ నిజంగానే దెయ్యం ఉంటుంది. అక్కడ ఒక్క దెయ్యం మాత్రమే ఉందా? లేక ఇంకా అనేక దెయ్యాలు ఉన్నాయా? అసలు సువర్ణ మాయ రేడియో స్టేషన్ ఎందుకు మూతపడింది. మధ్యలో భూషణ్ వర్మ (తనికెళ్ళ భరణి), విశ్రవ పుత్ర (శాండీ) పాత్రలు ఏంటి? రాఘవ్, మైథిలి..లలో ఎవరికి దెయ్యం పట్టింది? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా అని చెప్పాలి.
విశ్లేషణ : దర్శకుడు కౌశిక్ పెగాళ్ళపాటి ‘చావు కబురు చల్లగా’ తర్వాత 3 ఏళ్ళు గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది. మొదటి సినిమాలో హీరోతో చాలా మంచి చెప్పించాడు. అయితే ఫిలాసఫీ ఆడియన్స్ కి అర్ధం కాలేదు. ఫలితం మీకు తెలిసిందే. అందుకే అనుకుంట 2వ సినిమాకి జోనర్ మార్చేశాడు. ఫిలాసఫీ అర్ధం చేసుకొని ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా ‘కిష్కింధపురి’ అనే హర్రర్ సినిమాతో వచ్చాడు. దీనికి కొంత మైథాలజీ టచ్ కూడా ఇచ్చాడు. తనకు మైథాలజీ పై ఎంత పట్టు ఉంది అనే విషయాన్ని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవాలని భావించి ఉంటాడు. ఇక ‘కిష్కింధపురి’ సినిమా స్టార్టింగ్ నుండే అందరి దృష్టినీ ఆకర్షించేలా చేసింది చేతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఈ విషయంలో ఫస్ట్ క్రెడిట్ అతనికి ఇచ్చేయాలి. మొదట్లో లవ్ ట్రాక్ బోర్ కొట్టించే విధంగా ఉన్నప్పటికీ.. తన మ్యూజిక్ తో దానిని కవర్ చేశాడు చేతన్. తర్వాత బ్యాక్ టు బ్యాక్ హర్రర్ ఎలిమెంట్స్ వస్తాయి. అన్నీ కూడా ఆడియన్స్ ని భయపెట్టించే విధంగానే ఉంటాయి. దీంతో ఫస్ట్ హాఫ్ సంతృప్తిగా అనిపిస్తుంది. అయితే సెకండాఫ్ కు వచ్చేసరికి కథనం వీక్ అయ్యింది. ఎమోషనల్ కనెక్టివిటీ కూడా మిస్ అయ్యింది. దెయ్యం జనాలను చంపాలనుకోవడానికి రివీల్ చేసిన రీజన్ ఏదైతే ఉందో.. అది కన్వెన్సింగ్ గా అనిపించదు. కౌశిక్ రైటింగ్లో ఉన్న ఈ మైనస్సులు అన్నిటినీ చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ కవర్ చేసింది. అందుకే ఎక్కువ మార్కులు చేతన్ మ్యూజిక్ కి వేయాలి. ఇక ఇలాంటి సినిమాలకు వి.ఎఫ్.ఎక్స్ వర్క్ చాలా కీలకం. ఆ విషయంలో నిర్మాతలు బడ్జెట్ పెట్టలేదో లేక సరైన వి.ఎఫ్.ఎక్స్ టీంని పెట్టుకోలేదో కానీ.. ఔట్పుట్ మాత్రం తేడా కొట్టేసింది. ‘భైరవం’ కంటే తక్కువ బడ్జెట్లో ఈ సినిమాని ఫినిష్ చేశానని నిర్మాత ఓ సందర్భంలో చెప్పడం జరిగింది. పైగా కౌశిక్ గత సినిమా ఫలితం, హీరో మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని.. తక్కువ బడ్జెట్లోనే ఈ సినిమాని ఫినిష్ చేసి ఉండొచ్చు. అందులో తప్పేమీ లేదు. కానీ సెకండాఫ్ పై దర్శకుడు ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే.. ఇంకొంచెం క్వాలిటీగా సినిమాని రూపొందించాలి అనే థాట్ నిర్మాతకి వచ్చి ఉండేది.
నటీనటుల విషయానికి వస్తే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎప్పటిలానే తన స్క్రీన్ ప్రెజెన్స్ తో, యాక్షన్ సీక్వెన్స్..లతో ఆకట్టుకోవాలని చూశాడు. కానీ కొన్ని డైలాగులు చెప్పడానికి అతను చాలా ఇబ్బంది పడ్డాడు. అది అతని మోహంలో ఇట్టే తెలిసిపోతుంది. ఇక అనుపమ ఎప్పటిలానే తన మార్క్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. సెకండాఫ్ లో ఈమె భయపెడుతుంది కూడా. ఈ మధ్య అనుపమ ఎంపిక చేసుకుంటున్న పాత్రలు బాగుంటున్నాయి. కానీ దక్కాల్సిన అప్రీషియేషన్ అయితే దక్కడం లేదు. ఇక శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం, తనికెళ్ళ భరణి, హైపర్ ఆది వంటి నటీనటులు ఓకే అనేలా పెర్ఫార్మ్ చేశారు.
ప్లస్ పాయింట్స్ :
మ్యూజిక్(ముఖ్యంగా నేపధ్య సంగీతం)
ఫస్ట్ హాఫ్
ప్రీ ఇంటర్వెల్ బ్లాక్
హర్రర్ ఎలిమెంట్స్
మైనస్ పాయింట్స్ :
సెకండాఫ్
లవ్ ట్రాక్
మొత్తంగా ‘కిష్కింధపురి’ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. కానీ ఎక్కువగా ప్లస్ పాయింట్స్ ఉండటం వల్ల డీసెంట్ హర్రర్ థ్రిల్లర్ మూవీ అనిపించుకుంటుంది.
రేటింగ్ : 2.25/5