E-Paper
Advertisement

ఏపీలో నిరుద్యోగులకు తీపికబురు.. 1534 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్, నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ

ఏపీలో నిరుద్యోగులకు తీపికబురు.. 1534 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్, నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
Advertisement

AP Police Recruitment: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. ఎప్పటినుంచో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఒకటే ఆనందం. పోలీసు శాఖలోని పలు విభాగాల్లో 1534 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. శుక్రవారం అనగా నేటి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

ఏపీలో నిరుద్యోగులకు తీపికబురు

పోలీసు ఉద్యోగాల కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. పోలీస్‌ ‌శాఖలో 1534 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. పోలీస్‌ ‌నియామక బోర్డు ఛైర్మన్‌ ‌రాజీవ్‌ ‌కుమార్‌ ‌మీనా గురువారం ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. నేటి నుంచి అనగా శుక్రవారం నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నుంచి డిసెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.

Advertisement

పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌లో 378 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు ఉన్నాయి. 1156 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. అందులో ఇతర విభాగాల పోస్టులు ఉన్నాయి. ఎస్సై విభాగంలో పురుషులు-మహిళలకు పోస్టులు 253 ఉన్నాయి. రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు-ఏఆర్‌ 116 ఉద్యోగాలు, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌-ఎస్పీఎఫ్‌ విభాగంలో 9 ఎస్సై పోస్టులు ఉన్నాయి. 1,156 కానిస్టేబుల్‌ ‌పోస్టుల్లోని సివిల్‌-542, ఏఆర్‌‌-285, ఫైర్‌ ‌సర్వీస్‌- 158, జైళ్ల విభాగం- 150 ఉన్నాయి. అలాగే 21 మహిళా పోస్టులు ఉన్నాయి.

1534 పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ

కానిస్టేబుల్ ఉద్యోగాలకు జనవరి 31న ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఎస్‌ఐ అభ్యర్థులకు ఫిబ్రవరి 28న రాత పరీక్షలు ఉంటుంది. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్ష ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచన చేసింది. మరిన్ని వివరాల కోసం [AP SLPRB అధికారిక వెబ్‌సైట్](https://slprb.ap.gov.in/?utm_source=chatgpt.com) సంప్రదించవచ్చు. కానిస్టేబుల్‌ ‌కోసం పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది.

Advertisement

దరఖాస్తు పూర్తి తర్వాత దానిని డౌన్‌‌లోడ్‌ ‌చేసుకొని ప్రింట్‌ అభ్యర్థులు ఉంచుకోవాలని వెల్లడించారు అధికారులు. ఈ ఏడాది ఆగస్టులో విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా నియామక ప్రకటనలు జారీ చేసింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించే ముందు అర్హత, వయోపరిమితులు, విద్యార్హతలు, పరీక్షా సిలబస్, ఫీజు, ఇతర అంశాలను పరిశీలించాలని సూచన చేశారు.

ALSO READ: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి ఒకటే వాన

Related News

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి ఒకటే వాన

ఏపీలో జరిగే స్థానిక ఎన్నికల నిర్వహణపై జగన్ ఫైర్!

బైకర్‌ను ఢీకొట్టిన రెండు కార్లు.. గాల్లో పల్టీలు కొట్టి కిందపడ్డాడు.. కట్ చేస్తే ఊహించని సీన్!

శ్రీవారికి 121 కిలోల స్వర్ణ కానుక.. ఆ బంగారంతో ఏమేం చేయించారో తెలుసా?

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్నికలు రద్దు.. బ్యాలెట్ బాక్స్‌‌లో ఇంకు పోసిన వ్యక్తులు

‘నాకు పేరు వస్తుందనే రాయలసీమ లిఫ్ట్ ఆపేశారా?’.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్!

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం విరాళం.. ఆ మహాదాత ఎవరో తెలిసిపోయింది!

Big Stories

Advertisement
×