Intinti Ramayanam Today Episode November 27th: ఇంకా భానుమతి పల్లవి కాపురం ఎలాగైనా నిలబెట్టాలి అని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే పల్లవి తన కాపురం తన చేతులారా నాశనం చేసుకుంది తనని ఎలాగైనా సరే మార్చాలి అని భానుమతి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్షయ్ ప్లేట్లో భోజనం తీసుకుని భానుమతి దగ్గరికి వస్తాడు. నువ్వు తినకుండా మందులు వేసుకోవడం అసలు బాగోదు అమ్మ నువ్వు కాస్త తినాలి అని అడుగుతాడు.. కానీ భానుమతి మాత్రం పల్లవి గురించి ఆలోచిస్తూ పల్లవిని ఎందుకు మీరు వద్దంటున్నారు అని అంటుంది.. పల్లవి తప్పు చేసింది అని మీరు అంటున్నారు కదా తప్పులు చేసిన వాళ్ళందరినీ వదిలేయాలని అనుకుంటున్నారు అయితే అక్షయ్ మాత్రం పల్లవి నువ్వు వదిలేయాలని మేము అనడం లేదు నానమ్మ.. తన బుద్ధి ఏంటో నీకు బాగా తెలుసు కదా తన గురించి నువ్వు ఆలోచించు అని అక్షయ అంటాడు.. ఏం జరుగుతుంది అనేది కోర్టులోనే తేల్చుకుందామని అక్షయ్ అంటాడు.
పల్లవి బిర్యానీ తిన్నప్పటి నుంచి నా పొట్టలో ఏదో తేడాగా ఉంది ఏంటి నాకు ఏదో అయినట్టు ఉంది అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే బాత్రూం కి వెళ్ళాలి అర్జెంటుగాని పల్లవి చాలా కంగారు పడిపోతే బాత్రూం దగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తుంది కానీ అక్కడ తాళం వేసి ఉండడం చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే నాకు బాత్రూమ్ అర్జెంటుగా వస్తుంది నేను తాళం తీయాలి ఎవరు తాళం వేశారు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కమ్మలు లోపలికి వచ్చి ఇది నా బాత్రూం నా బాత్రూంలో నువ్వు వాడుకోవడానికి వీల్లేదు అని అన్నిటికీ తాళాలు వేసారు అని చెప్పగానే.. పల్లవి ఏంటి బావ నేనంటే నీకు ఇంత కక్ష నువ్వు ఇలా తాళాలు వేస్తే నేను బాత్రూంకి వెళ్ళాలి ఇవ్వు బావ ప్లీజ్ బావ అని బ్రతిమిలాడుతుంది. ఇక చివరికి పల్లవికి చుక్కలు చూపించిన తర్వాత కమల్ బాత్రూమ్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు.. పల్లవి బాత్రూంలోకి వెళ్ళగానే అక్కడ ఉన్న తన బ్రీత్ కేసులో ఏమైనా ఉన్నాయేమో అని వెతికెందుకు ప్రయత్నిస్తాడు మొత్తానికి పల్లవి బిర్యానీ వల్ల లోపలికి బయటకి తిరుగుతూ చాలా అవసరం పడుతుంది..
ఇక పల్లవి మోషన్స్ వల్ల బాత్రూమ్ కి వెళ్తూనే ఉంటుంది. అయితే బాత్రూంకి వెళ్లడం వల్ల తన పరిస్థితి దారుణంగా మారిపోయింది అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక నీ బ్యాగు సందేశాన్ని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని పల్లవికి కమల్ చెప్తాడు కానీ కమల్ మాత్రం ఇక్కడ ఉండడానికి ఎందుకు వీల్లేదు.. ఈ ఒక్కదానికి నేను వెళ్ళిపోతానా అస్సలు వెళ్ళను అని అంటుంది దాంతో కమల్ షాక్ అవుతాడు. అవని పార్వతి దగ్గరికి వెళ్లి ఏమైనా అత్తయ్య పిలిచారు అంట ఏమైనా కావాలా అని అడుగుతుంది కానీ తను మాత్రం అసలు వినకుండా పల్లవి ఇంట్లోకి వచ్చింది కదా నాకు చాలా టెన్షన్ గా ఉందమ్మా నెక్స్ట్ ఏం చేస్తుందని భయ పట్టుకుంది అని పార్వతి అంటుంది కానీ అవని మాత్రం పల్లవి గురించి తెలిసింది కదా ఇక మీదట తను ఎక్కడ దొరికినా కూడా అసలు క్షమించను మీరు ఏమి కంగారు పడకండి అని అంటుంది. పల్లవి నన్ను చూసి వీళ్లిద్దరు భయపడిపోతున్నారు అని సంతోషంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది.
పల్లవి వచ్చింది కదా కమల్ సంతోషంగా ఉంటాడు అని నేను అనుకోవడం లేదు అని అక్షయ్ అడుగుతాడు. అయితే పల్లవి వల్ల కమల్ సంతోషంగా లేడు కాబట్టి వాడు ఎలా పల్లవిని భరిస్తాడు అర్థం కావడం లేదు. తన రూమ్లో పల్లవి ఉంటే వాడు ఎలా వెళ్ళిపోతాడో కూడా అర్థం కావడం లేదని అంత కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటారు.. కానీ కమల్ అక్కడికి వచ్చి కాస్త మొదట ధైర్యంగా ఉన్నా కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు నా జీవితం ఎటు పోతుందో నాకు అర్థం కావడం లేదు అన్నయ్య అని కమల్ అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే కమల్ అలా బాధ పడిపోవడం చూసి అవన్నీ నువ్వు ఇలా చూడలేకపోతున్నాము చాలా ధైర్యంగా ఉండాలి అప్పుడే నీ జీవితం బాగుంటుంది అని అవని ధైర్యం చెబుతుంది. కమల్ కన్నీళ్లు పెట్టుకోవడం ఎపిసోడ్లు కాస్త సెంటిమెంటల్ సీన్గా మారిపోతుంది.
రమ్య సారధి గురించి తన అన్నయ్య ఎంత చెప్పినా కూడా అస్సలు వినకుండా ఉంటుంది. అయితే సారధి పది లక్షలు ఇస్తానన్నాడు ఎలాగైనా సరే చెల్లిని ఒప్పించాలి అని తన అన్నయ్య అనుకుంటాడు.. కానీ రమ్య మాత్రం అలాంటి వాడిని నేను చచ్చిన పెళ్లి చేసుకోను అని అంటుంది.. అసలు అలాంటి వాటిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు.. కొంచమైన బుద్ధి లేదా..? కానీ రమ్య మాటలు విన్న వాళ్ళ అన్నయ్య మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతాడు.. నువ్వు ఇకమీదట నాకు ఇలాంటి పెళ్లి ప్రయత్నాలు చేసావంటే కచ్చితంగా నా దారి నేను చూసుకుంటాను. నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అని వాడిని ఇస్తుంది దాంతో అతను చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. కానీ సారధి మాత్రం తనని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది..
పల్లవి ఆరాధ్యకు అవని హోమ్ వర్క్ చెప్తూ ఉండగా వంటగదిలోకి వెళ్లి అక్కడ పాలని పడస్తే నెక్స్ట్ అవని ఎలా పాలు తీసుకుంటుందని చూస్తూ ఉంటుంది. ఈరోజు అవనికి కడుపు మంట తప్పదు అని పల్లవి ప్లాన్ చేస్తుంది.. ఇక పల్లవి ఆపాలని కింద పడేస్తుంది.. ఇక అవని వంటగదిలోకి వెళ్లి ఎందుకు పాలని కింద పడేసావు అని అడుగుతుంది కానీ పల్లవి మాత్రం తిక్క తిక్కగా సమాధానం చెప్పడంతో రెండు చెంపలు పగలగొడుతుంది అది చూసిన పార్వతి కూడా షాక్అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Podarillu Today Episode : అయ్యో పాపం చక్రీ.. మహా ప్లాన్ సక్సెస్.. విక్కీ సర్ప్రైజ్ గిఫ్ట్.