E-Paper
Advertisement

Sri Chidambaram Review: ‘శ్రీ చిదంబరం గారు’ మూవీ రివ్యూ .. సినిమా ఎలా ఉందంటే..!

Sri Chidambaram Review: ‘శ్రీ చిదంబరం గారు’ మూవీ రివ్యూ .. సినిమా ఎలా ఉందంటే..!
Advertisement

Sri Chidambaram Review: శ్రీ చిదంబరం గారు మూవీ రివ్యూ 

సినిమా కథ:

‘కళ్ళు’ చిదంబరం అనే ఫేమస్ కమెడియన్ అందరికీ సుపరిచితమే. ఆయన్ని అలా సంబోదించడానికి కారణం ఆయన చూపు. ఇది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో మన సినిమా టైటిల్ కథ పై సగం క్లారిటీ ఇచ్చేసింది అనుకోవాలి. ఇక అసలు కథ విషయానికొస్తే… సాల్మన్ అలియాస్ చిదంబరం (వంశీ తుమ్మల)కి పుట్టుకతోనే మెల్లకన్ను ఉంటుంది. దీంతో చిన్నప్పటి నుండి అతన్ని చుట్టుపక్కల వాళ్ళు ఎగతాళి చేస్తుంటారు. దీంతో చిదంబరంలో ఏదో తెలియని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. అతని లోపాన్ని కప్పిబుచ్చుకోవడానికి నల్ల కళ్ళజోడు పెట్టుకుంటూ ఉంటాడు. మరోపక్క అదే ఊరికి చెందిన లీల (సంధ్య వశిష్ట) అతన్ని ఇష్టపడుతుంది. చిదంబరం స్వతహాగా తాపీ పని చేస్తుంటాడు. ఒకసారి లీల ఇంట్లో బాత్ రూమ్ వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆమెతో చిదంబరంకి పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. చిదంబరం అంటే లీలాకి కూడా ఇష్టమే. అయినప్పటికీ ఒక పొరపాటు వల్ల అతని ప్రేమని దూరం చేసుకుంటుంది. ఆ పొరపాటు ఏంటి? దాని వల్ల చిదంబరం ఎంత బాధపడ్డాడు? చివరికి వీళ్ళు కలిశారా? లేదా? అనే ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.

సినిమా విశ్లేషణ :

Advertisement

కిరణ్ అబ్బవరం తో ‘క’ అనే బ్లాక్ బస్టర్ సినిమా తీసిన గోపాల కృష్ణారెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. ‘క’ వంటి సూపర్ హిట్ కొట్టిన తర్వాత.. రెండో సినిమాని అంతా కొత్తవాళ్లతో చేయాలని డిసైడ్ అయిన ఆయన గట్స్ కి మెచ్చుకోకుండా ఉండలేం. అలా అని ‘చిదంబరం’ సినిమాని ఆయన చిన్న సినిమాగా ఎంత మాత్రం చూడలేదు అని ప్రతి విజువల్ తెలియజేస్తుంది.ఇదే సినిమాకి మేజర్ హైలెట్. సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు విజువల్స్ తో బాగా కనెక్ట్ అవుతాడు. ఫస్ట్ హాఫ్ అంతా సరదా సరదాగా సాగిపోతుంది. దర్శకుడు వినయ్ రత్నం ఒక సున్నితమైన అంశాన్ని తీసుకుని హృద్యంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. గోదావరి నేపథ్యం, సహజమైన సంభాషణలు ఆకట్టుకుంటాయి. సెకండాఫ్ కూడా ఇలాగే ఉంటే బాగుండేది. ఒక చిన్న అపార్థం చుట్టూనే కథని తిప్పడం ప్రేక్షకులకు రిపీటెడ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే కొన్ని డైలాగ్స్ తో ఆ లోపాల్ని కూడా కవర్ చేసే ప్రయత్నం చేశారు అనుకోండి.

నటీనటుల విషయానికి వస్తే.. వంశీ తుమ్మల కొత్త నటుడు అనే ఫీలింగ్ ఎక్కడా కలగదు. అందుకు కారణం పాత్రని అతను అంత బాగా ఓన్ చేసుకోవడమే. ఎక్కడా ఓవర్ ది టాప్ కి వెళ్లకుండా బ్యాలెన్స్డ్ గా అదే టైంలో సహజంగా నటించాడు.సంధ్య వశిష్ట… లీల పాత్రలో ఈమె లుక్స్ బాగున్నాయి. గోదావరి యాసలో ఈమె పలికిన డైలాగులు కూడా చాలా సహజంగా ఉన్నాయి. హీరో తల్లి పాత్రలో నటించిన కల్పలత ఎప్పటిలానే తన మార్క్ నటనతో మంచి మార్కులు వేయించుకుంటుంది. సీనియర్ నటి తులసి సైతం తన పాత్రకి న్యాయం చేసింది.

ప్లస్ పాయింట్స్ :

Advertisement

ఫస్ట్ హాఫ్

సినిమాటోగ్రఫీ

లొకేషన్స్

రన్ టైం

మైనస్ పాయింట్స్ : 

సెకండాఫ్

 

కొంతమేర సాగదీత మొత్తంగా ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వీకెండ్ కి ఓ సినిమా చూసి టైం పాస్ చేద్దాం అనుకునే ప్రేక్షకులకు ‘శ్రీ చిదంబరం గారు’ మంచి ఛాయిసే.

Sree Chidambaram garu movie Rating  : 2.75/5

Related News

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

Big Stories

Advertisement
×