E-Paper
Advertisement

Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీదే : మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి!

Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీదే : మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి!
Advertisement

Ponguleti Srinivas Reddy:  కొత్తగూడెం స్వేచ్ఛ: కొత్తగూడెం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (, Congress Party) అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీది. నగరపాలక సంస్థ అభివృద్ధి చేసే బాధ్యత నాది అంటూ రాష్ట రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) హామీ ఇచ్చారు. కొత్తగూడెం నగరపాలక సంస్థ లోని 8, 9వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన లలిత కుమారి, శాంతల చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పొంగిలేటి మాట్లాడుతూ… పేదోడి ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన లో చెప్పిన సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమానికి ప్రారంభించామన్నారు.

గత పదేళ్ల పాలనలో  ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు 

గత పదేళ్ల పాలనలో నిరుపేదలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. ప్రజా పాలన అధికారంలోకి రాగానే రేషన్ కార్డు, సన్న బియ్యం, ఉచిత కరెంటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు.ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో 25 ఎకరాల్లో నిరుపేద విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామన్నారు. గత పాలకులు బొమ్మ చూపించి ఓట్లేయమన్నారే కానీ, పేదల సంక్షేమం కోసం కృషి చేయలేదని విమర్శించారు. డబల్ బెడ్రూంల ఇండ్ల ఆశ చూపించి నిరుపేద ప్రజల చిరకాల కాంక్ష తీర్చకుండా మోసం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయించి రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లను మంజూరు చేశామన్నారు.

ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఇచ్చే బాధ్యత నాదే

Advertisement

ఇంకా అర్హులైన వారందరికీ రెండవ విడత, మూడో విడత, నాలుగో విడతల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించి ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఇచ్చే బాధ్యత నాదన్నారు. ప్రభుత్వ స్థలాలు గుర్తించి నిరుపేదలకు ఇంటి స్థలం కేటాయించి ఆ స్థలంలోనే ఇంటి నిర్మాణం చేయించే బాధ్యత కూడా నాదేనని మంత్రి పొంగిలేటి ప్రజలకు హామీ ఇచ్చారు. ఇండ్లు, ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇచ్చేది నేనేనని మరో మారు ప్రజలకు ధీమా కల్పించారు. ఇండ్లు ఇవ్వాలన్నా, ఇంటి స్థలాలు ఇవ్వాలన్నా, రేషన్ కార్డులు ఇవ్వాలన్నా, రేషన్ బియ్యం ఇవ్వాలన్నా ఆ శాఖ మంత్రి నేనేనని స్పష్టం చేశారు.

Also ReadPonguleti Srinivas Reddy: ఏదులాపురం మున్సిపాలిటీని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి!

అర్హులైన వారికి పట్టాదారు పాసుబుక్కులు అందిస్తాం 

Advertisement

రోడ్లు వేయించేది నేనే, సీసీ డ్రైన్లు కట్టించేది నేనే, మంచినీళ్లు ఇచ్చేది నేనే, ఇంటి పై వెళ్లిన ప్రమాదకర కరెంటు లైన్లను తీన్చేది నేనే అంటూ ప్రజల్లో భరోసా కల్పించారు. 999 సర్వే నెంబర్లు కొంతమంది రైతులు సేద్యం చేసుకుంటూ జీవిస్తున్నారని, వారందరికీ ప్రభుత్వం ద్వారా సర్వే చేయించి అర్హులైన వారికి పట్టాదారు పాసుబుక్కులు అందిస్తామన్నారు. 8, 9 డివిజన్లలో పెద్దలు శ్రీనివాసుడి ఆలయానికి దారి కావాలని అడుగుతున్నారని, ఆ శ్రీనివాసుడి ఆలయానికి దారి ఇచ్చేది ఈ శ్రీనివాసుడేనని ప్రజల్లో మంత్రి పొంగిలేటి విశ్వాసం కల్పించారు.

వాళ్ళ మాటలు నమ్మొద్దు 

రంగురంగుల కండువాలతో.. మాయ మాటలు చెబుతూ వస్తారు నమ్మకండి మునిసిపల్ నగరపాలక సంస్థ ఎన్నికలు సమీపిస్తుండడంతో కొంతమంది రంగురంగుల కండువాలు కప్పుకొని మనోళ్లే మేనని మాయ మాటలు చెబుతూ వస్తారని వాళ్ళ మాటలు నమ్మొద్దని మంత్రి పొంగిలేటి కోరారు. ఎంపీ, మంత్రి, ప్రభుత్వం మనదే కాబట్టి అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రణరంగంలో దిగాక యుద్ధం ఒకరికి ఇచ్చి మరొకరిని యుద్ధం చేయమంటే కుదరదని తెలిపారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి మీ మీ డివిజన్లలో అభివృద్ధిని చేసుకునేందుకు కృషి చేయాలి అన్నారు. కులం చూడం ..మతం చూడం..పార్టీ చూడం.ఓటేస్తేనే ఇండ్లిస్తాం అని చెప్పం..అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు.

బీఆర్ఎస్ పార్టీ నుంచి..  కాంగ్రెస్ పార్టీలో చేరిక

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో ఇతర పార్టీ నేతలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీలోకి చేరుతూ ఇతర పార్టీలకు షాక్ ఇస్తున్నారు. కొత్తగూడెం మాజీ బీఆర్ఎస్ కౌన్సిలర్, వండ్లకొండ రవి, మాజీ అత్మకమీటీ చైర్మెన్ బత్తుల వీరయ్య ఆధ్వర్యంలో దాదాపు 30 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

Also Read: Ponguleti Srinivas Reddy: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఒరిగింది శూన్యం.. విపక్షాల తీరుపై మంత్రి పొంగులేటి ఫైర్!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×