Srinivasa mangapuram movie review :సూపర్ స్టార్ కృష్ణ (Krishna) మనవడిగా, మహేష్ బాబు(Mahesh Babu) అన్నయ్య దివంగత నటుడు రమేష్ బాబు (Ramesh Babu) కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు జయకృష్ణ (Jaya Krishna) . ఘట్టమనేని వారసుడిగా ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వం వహించగా.. వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీ దత్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్ పై జెమినీ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కూతురు రషా తడానీ హీరోయిన్గా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రీమియర్ షోతో మొదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ అందుకున్నాడా? రషా తడానీకి తెలుగు సినిమా ఎలాంటి విజయాన్ని అందించింది? తదితర విషయాలు ఇప్పుడు రివ్యూ లో చూద్దాం..
అప్పుడే తిరుపతికి వచ్చిన శ్రీను ( జయ కృష్ణ).. తిరుపతిలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ.. ఎంత దూరమైనా వెళ్లే పెద్దిరెడ్డి (కిక్ శ్యామ్).. తన కుమార్తె మంగ (రషా) వెంట పడుతూ ఉంటాడు. ఎలా అయినా సరే మంగను ప్రేమలో పడేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు శ్రీను. అనుకోకుండా ఒకసారి పెద్దిరెడ్డి తమ్ముడు సుబ్బారెడ్డి (శ్రీ తేజ్ ) చేతికి చిక్కుతాడు . ఇక అతడికి బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఒక గ్యాంగ్ వారి మీద అటాక్ చేస్తుంది. అయితే తాను బుద్ధి చెప్పాలనుకున్న శ్రీను సుబ్బారెడ్డిని కాపాడతాడు . దీంతో శ్రీనుని పెద్దిరెడ్డి ఇంటికి పిలిపిస్తాడు. అసలు శ్రీను ఎవరు? ఎందుకు మంగాను ప్రేమించమని వెంటపడుతున్నాడు? అసలు ఈ కథలో బళ్లారి వెంకటప్ప నాయుడు (మోహన్ బాబు) పాత్ర ఏంటి ? తదితర విషయాలు తెలియాలి అంటే థియేటర్లలో బిగ్ స్క్రీన్ పై సినిమాలను చూడాల్సిందే.
సినిమా విషయానికి వస్తే.. అసలు ఈ సినిమా రొటీన్ కథలాగే అనిపిస్తోంది. కథలో పసలేదు. ఇక లాజిక్ కోసం వెళ్తే వెనక్కి రావాల్సిందే .ముఖ్యంగా ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి లాంటి పాయింట్ ను పట్టుకొని దానికి చెత్త సీన్స్ రాసుకుంటే ఎవడు చూస్తారు.. రాసుకునేటప్పుడే డైరెక్టర్, రైటర్ కలిసి కూర్చొని రాసుకొని ఆ తర్వాత కథను తెరమీద చూపిస్తే కనీసం ఆడియన్స్ కి నచ్చుండేది. ఆ ప్రయత్నాలు ఏమి జరగలేదు. కథలో ఎమోషన్ లేదు.. ఆత్మ అసలే లేదు.. ఇక హీరో ఎంట్రీ కి ముందే మంగళం పాడేశారు. జయకృష్ణ ఎంట్రీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఘట్టమనేని అభిమానులు. అటు జయకృష్ణ కూడా చాలా కష్టపడ్డాడు . కానీ సరైన చేతుల్లో పడకపోయేసరికి స్క్రీన్ మీద అడ్డంగా బుక్కయ్యాడు.
హీరో ఎలివేషన్ గాలిలో దీపం పెట్టినట్టు వదిలేశారు. ఇక హీరోయిన్ పాపం చూడడానికి బొమ్మలాగా ఉన్నా..యాక్టింగ్ కి మాత్రం పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. గ్లామర్ అద్దారు.. కానీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అసలు వర్కౌట్ కాలేదు. డైరెక్షన్ విషయానికి వస్తే.. స్క్రీన్ ప్లే నత్త నడకన సాగుతుంది. సినిమా చూస్తుంటే మొదటి భాగం ఎటు పోతుందో అర్థం కాదు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇక ఆడియన్స్ కి ప్రాణాలు కూడా ఎగిరిపోతాయి. సీన్ల మధ్య కనెక్షన్ లేదు. అసలు ఆ సీన్ ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు.. ప్రమోషన్ లలో మాత్రం చాలా బాగా హైప్ ఇచ్చారు. డైరెక్షన్ మాత్రం అట్టర్ ప్లాఫ్ రేంజ్ లో దింపేశారు. డబ్బాల కొద్ది డైలాగులు రాసుకున్నారు కానీ ఒక్కటి కూడా థియేటర్లో పేలలేదు.
ALSO READ:శ్రీనివాస మంగాపురం ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
మోహన్ బాబు స్క్రీన్ మీద కనిపించినంత సేపు మ్యాజిక్ చేశాడు
మైనస్ పాయింట్స్..
స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో విఫలం
నటీనటులను వాడుకోవడంలో డైరెక్టర్ ఫ్లాప్
హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్క్ అవుట్ కాలేదు..
ఆఖరి ముచ్చటగా..
సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు వస్తుండు.. కచ్చితంగా సినిమా హిట్ అవుతుంది అని థియేటర్ కి పోతే మాత్రం నిరాశ తప్పదు . జయకృష్ణ కష్టానికి మాత్రం ఫలితం లభించలేదు. శ్రీనివాస మంగాపురం అని పేరు పెట్టి థియేటర్ల వద్ద జనాలకి బోరు కొట్టించారు. అంచనాలు లేకుండా పోయినా సరే నిరాశే మిగులుతుంది.
రేటింగ్ :1.5/5