Samsung 183 L 4 Star Single Door Refrigerator: ఈ రోజుల్లో ఇంట్లోకి ఫ్రిజ్ కొనడం సాధారణ విషయమే కానీ, పవర్ బిల్లు ఎక్కువ రాకుండా చూసుకునే బెస్ట్ రెఫ్రిజిరేటర్ ఎంచుకోవడమే అసలైన టాస్క్! ముఖ్యంగా చిన్న కుటుంబాలకు, బ్యాచిలర్స్‌కి తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ స్టోరేజ్ అండ్ గ్రేట్ ఎనర్జీ సేవింగ్స్ ఇచ్చే మోడల్స్ కావాలి. అందుకే.. సాంసంగ్ మార్కెట్‌లోకి తీసుకువచ్చిన 183 లీటర్ల Direct Cool Single Door 4-Star రెఫ్రిజిరేటర్ రూ. 15,490 ధరలో మార్కెట్లో తెగ ట్రెండ్ అవుతోంది. దీనిలోని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1.మోడ్రన్ డిజైన్ అండ్ స్టైలిష్ లుక్:
సాంసంగ్ ఈ మోడల్‌ను చాలా స్టైలిష్ అండ్ కాంపాక్ట్ డిజైన్‌తో రూపొందించింది. మీ కిచెన్ స్థలం చిన్నదైనా ఇది చాలా ఈజీగా ఫిట్ అయిపోతుంది. దీనికి ఇచ్చే డ్యూరబుల్ ఫినిషింగ్ వల్ల దాదాపు అన్ని రకాల కిచెన్ ఇంటీరియర్స్‌కి ఇది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. డోర్ హ్యాండిల్ అండ్ బాడీ బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్‌గా ఉండి, లాంగ్ రన్ ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది.
2. 4-స్టార్ ఎనర్జీ రేటింగ్:
ఈ రెఫ్రిజిరేటర్ యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని 4-స్టార్ ఎనర్జీ రేటింగ్. సాధారణ ఫ్రిజ్‌లతో పోలిస్తే ఇది చాలా తక్కువ కరెంట్ ను వినియోగిస్తుంది. రోజంతా ఆన్‌లో ఉంచినా కూడా కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందనే భయం అస్సలు ఉండదు. బడ్జెట్ చూసే ప్రతీ కుటుంబానికి ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
3.డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ:
దీంట్లో ఉన్న అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఫ్రిజ్‌లోని కూలింగ్ అవసరాలకు అనుగుణంగా తన స్పీడ్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుంటుంది. దీని వల్ల శబ్దం చాలా తక్కువగా రావడం మాత్రమే కాకుండా, కంప్రెసర్ లైఫ్ టైమ్ కూడా పెరుగుతుంది. సాంసంగ్ ఈ కంప్రెసర్‌పై ఎక్కువ కాలం వారంటీని కూడా అందిస్తుండటం విశేషం.
4. డైరెక్ట్ కూల్ అండ్ ఫాస్ట్ ఐస్ మేకింగ్:
183 లీటర్ల కెపాసిటీ ఉన్న ఈ డైరెక్ట్ కూల్ ఫ్రిజ్ కూలింగ్ పవర్ విషయంలో.. కాంప్రమైజ్ కాకుండా పని చేస్తుంది. కూలింగ్ చాలా వేగంగా విస్తరించి పండ్లు, కూరగాయలు, మిగిలిన ఆహార పదార్థాలు రోజంతా ఫ్రెష్‌గా ఉండేలా చూస్తుంది. అలాగే పవర్ ఫుల్ ఫ్రీజర్ సెక్షన్ వల్ల తక్కువ సమయంలోనే మంచు గడ్డకట్టే సౌకర్యం లభిస్తుంది.
5. టఫ్‌న్డ్ గ్లాస్ షెల్ఫ్‌లు :
ఫ్రిజ్ లోపలి భాగంలో ఇచ్చిన షెల్ఫ్‌లు చాలా పటిష్టమైన ‘టఫ్‌న్డ్ గ్లాస్’ తో తయారయ్యాయి. వీటిపై బరువైన వంట పాత్రలు లేదా పెద్ద టిఫిన్ బాక్సులు ఉంచినా ఇవి ఈజీగా తట్టుకోగలవు. అంతేకాకుండా.. డోర్ సైడ్ ఉన్న బాటిల్ రాక్స్ లో పెద్ద 2 లీటర్ల బాటిళ్లను కూడా చాలా ఈజీగా సర్దుకోవచ్చు. కూరగాయల కోసం ఇచ్చిన వెజిటబుల్ బాక్స్ కూడా తగినంత స్పేస్‌తో లభిస్తుంది.
Also Read: వాటర్‌ప్రూఫ్ బ్లూటూత్ స్పీకర్లు..బెస్ట్ సౌండ్ ఇచ్చే టాప్ 5 మోడల్స్!
6.స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్:
చాలా ప్రాంతాల్లో ఎదురయ్యే వోల్టేజ్ మార్పుల నుంచి ఈ ఫ్రిజ్ తనను తాను కాపాడుకోగలదు. దీనికి ఎలాంటి ప్రత్యేక బయటి స్టెబిలైజర్ వాడాల్సిన అవసరం లేదు. కరెంట్ ప్లాచుయేషన్స్ వచ్చినా ఫ్రిజ్ లోపలి భాగాలు సురక్షితంగా పనిచేస్తాయి.
కేవలం రూ. 15,490 ధరకు బ్రాండెడ్ క్వాలిటీ, 4-స్టార్ ఎనర్జీ సేవింగ్స్, డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ అండ్ స్టైలిష్ లుక్ అందిస్తున్న ఈ సాంసంగ్ చిన్న కుటుంబాలకు అలాగే బడ్జెట్ చూసే కస్టమర్లకు పర్ఫెక్ట్ అండ్ వర్త్ ఛాయిస్ అని చెప్పవచ్చు.