boAt Enigma Daze womens luxury smartwatch: ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్ అనేది కేవలం టైం చూసుకోవడానికి లేదా ఫిట్‌నెస్ ట్రాకింగ్ కోసం మాత్రమే కాదు.. అదొక స్టైల్ స్టేట్‌మెంట్‌గా, అంతకంటే ముఖ్యంగా మహిళల సేఫ్టీకి ఒక డిజిటల్ తోడుగా మారిపోయింది! బోట్ సంస్థ ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించిన ‘boAt Enigma Daze’లగ్జరీ స్మార్ట్‌వాచ్ ఇప్పుడు మార్కెట్‌లో తెగ ఆకట్టుకుంటోంది. 1.3-ఇంచుల అద్భుతమైన డిస్‌ప్లే, రాయల్ మెటాలిక్ లుక్ అండ్ అత్యవసర సమయాల్లో .. ఉపయోగపడే ఎల్ ఓఎస్ లొకేషన్ ట్రాకర్‌తో వచ్చిన ఈ ట్రెండీ వాచ్ విశేషాలు ఏంటో.. ఇప్పుడు చూద్దాం!
ఈ మోడల్ చూడగానే ముందుగా ఆకట్టుకునేది దీని ప్రీమియం అండ్ రాయల్ ఫినిషింగ్. ట్రెడిషనల్ వేర్ కైనా లేదా వెస్ట్రన్ ఔట్‌ఫిట్స్‌కైనా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేలా ఈ వాచ్‌ను డిజైన్ చేశారు. స్లీక్ మెటాలిక్ బాడీ, స్టైలిష్ స్ట్రాప్స్ వల్ల ఇది చేతికి పెట్టుకుంటే ఒక కాస్ట్లీ జ్యువెలరీ లేదా లగ్జరీ వాచ్ వేసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. డెయిలీ వేర్‌కే కాకుండా పార్టీలకు, ఆఫీసులకు వేసుకెళ్లడానికి ఇది బెస్ట్ ఆప్షన్.
ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.3-ఇంచీల క్రిస్ప్ అండ్ బ్రైట్ హెచ్‌డీ డిస్‌ప్లే ఇచ్చారు. సూర్యకాంతిలో ఉన్నప్పుడు కూడా స్క్రీన్ పై ఉన్న నోటిఫికేషన్లు, టైమ్, హెల్త్ డేటా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. దీనికంటే.. ముఖ్యంగా, మీ మూడ్ అండ్ డ్రెస్సింగ్‌కి సరిపోయేలా మార్చుకోవడానికి వందలాది క్లౌడ్-బేస్డ్ వాచ్ ఫేసెస్ ఇందులో లభిస్తాయి. దీని వల్ల ప్రతీ రోజు ఒక కొత్త లుక్ సరి కొత్తగా ఉంటుంది.
ఈ స్మార్ట్‌వాచ్‌లోని అత్యంత కీలకమైన అండ్ యూజ్‌ఫుల్ ఫీచర్ ‘SOS Location Tracker’.ఉద్యోగాలు చేసే మహిళలకు, లేట్ నైట్ ట్రావెల్ చేసేవారికి ఇది ఎంతో భద్రతనిస్తుంది. అత్యవసర లేదా ప్రమాదకర పరిస్థితుల్లో వాచ్‌లోని SOS ఫీచర్‌ని యాక్టివేట్ చేస్తే, మీ లైవ్ లొకేషన్ వివరాలు మీ ఫోన్‌లోని ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కి తక్షణమే మెసేజ్‌గా వెళ్తాయి. డిజైన్‌తో పాటు భద్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం ఈ వాచ్ స్పెషాలిటీ.
మీరు పనిలో బిజీగా ఉన్నప్పుడు లేదా హ్యాండ్ బ్యాగ్‌లో ఫోన్ ఉన్నప్పుడు కాల్స్ మిస్ అవ్వాల్సిన పని లేదు. ఈ వాచ్‌లో ఇన్-బిల్ట్ మైక్ అండ్ స్పీకర్ ఉండటం వల్ల నేరుగా.. వాచ్ నుంచే కాల్స్ మాట్లాడవచ్చు, రిజెక్ట్ చేయవచ్చు లేదా కొత్త నంబర్లకు డయల్ చేయవచ్చు. కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా క్లియర్‌గా ఉంటుంది.
మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఇందులో పలు రకాల హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఇచ్చారు. 24/7 హార్ట్ బీట్, రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని కొలిచే SpO2 మానిటర్, స్ట్రెస్ ట్రాకింగ్ అండ్ స్లీప్ మానిటరింగ్ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటుగా ఉమెన్స్ హెల్త్ (పీరియడ్/మెన్స్ట్రువల్ సైకిల్) ట్రాకింగ్ ఆప్షన్ కూడా ఇందులో లభిస్తుంది. అలాగే.. పలు రకాల స్పోర్ట్స్ మోడ్స్ వల్ల మీరు ఎన్ని అడుగులు నడిచారు, ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయో ఈజీగా తెలుసుకోవచ్చు.
Also Read: తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫ్రిజ్ కావాలా? మార్కెట్‌లో రచ్చ లేపుతున్న మోడల్ ఇదే
డెయిలీ యూసేజ్‌లో ఈ వాచ్ మంచి బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. సాధారణ యూజర్లు పదే పదే ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా కొన్ని రోజుల పాటు ఈజీగా పనిచేస్తుంది. దీనికి IP67 రేటింగ్ ప్రొటెక్షన్ ఉండటం వల్ల చేతులు కడుక్కునేటప్పుడు పడే వాటర్ స్ప్లాష్‌లు లేదా చెమట వల్ల ఇది పాడైపోతుందనే భయం ఉండదు.
లగ్జరీ లుక్, బ్లూటూత్ కాలింగ్, ప్రతీ క్షణం సేఫ్టీ ఇచ్చే లొకేషన్ ట్రాకర్ అండ్ బెస్ట్ హెల్త్ ఫీచర్లు ఆశిస్తున్న మహిళలకు boAt Enigma Daze స్మార్ట్‌వాచ్ ఒక పర్ఫెక్ట్, మోడ్రన్ అండ్ యూజ్‌ఫుల్ ఛాయిస్.