E-Paper
Advertisement

గంటలో రూ.7.09 కోట్లు మాయం.. హైదరాబాద్ NBFC ఖాతాపై సైబర్ క్రిమినల్స్ పంజా!

గంటలో రూ.7.09 కోట్లు మాయం.. హైదరాబాద్ NBFC ఖాతాపై సైబర్ క్రిమినల్స్ పంజా!
Advertisement

Cyber Fraud: హైదరాబాద్ వేదికగా మరో భారీ సైబర్ దోపిడీ వెలుగుచూడటం స్థానికంగా కలకలం రేపుతోంది. సైబర్ క్రిమినల్స్ తమ పంజా విసురుతూ రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. తాజాగా నగరానికి చెందిన ‘కీర్తనా ఫిన్‌సర్వ్ లిమిటెడ్’ అనే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) టార్గెట్‌గా రూ.7.09 కోట్లకు పైగా సొమ్మును కొల్లగొట్టడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

కేవలం గంటలోనే హ్యాకింగ్ విధ్వంసం

Advertisement

ఈ సైబర్ దొంగతనం జరిగిన తీరు చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడవాల్సిందే. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య, అంటే కేవలం 60 నిమిషాల వ్యవధిలోనే నేరగాళ్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కంపెనీకి చెందిన ప్రధాన బ్యాంకు ఖాతాలోకి చొరబడి, ఏకంగా 39 అనధికారిక లావాదేవీలు జరిపారు. సెకన్ల వ్యవధిలోనే రూ.7.09 కోట్ల మొత్తాన్ని దేశంలోని వివిధ బ్యాంకు ఖాతాలకు చకచకా మళ్లించేశారు.

పోలీసుల రంగ ప్రవేశం.. దర్యాప్తు వేగం

Advertisement

ఖాతా నుంచి అంత భారీ మొత్తంలో డబ్బు మాయమైనట్లు గుర్తించిన కీర్తనా ఫిన్‌సర్వ్ డైరెక్టర్ చాగంటి వరప్రసాద్‌ (45) వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు శనివారం కేసు నమోదు చేసుకున్నారు.

ప్రత్యేక బృందాలతో దర్యాప్తు..

ప్రస్తుతం పోలీసులు ఈ లావాదేవీల ఐపీ అడ్రస్‌లు, డబ్బు బదిలీ అయిన విదేశీ/స్వదేశీ ఖాతాల వివరాలను వేగంగా సేకరిస్తున్నారు. ఈ నిధులు ఎక్కడికి వెళ్లాయో ట్రాక్ చేసి, నేరస్థులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఫైనాన్షియల్ సంస్థలు ఎంతటి సెక్యూరిటీ రిస్క్‌లో ఉన్నాయో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

Also Read: కూటమి ఆధిపత్యానికి జక్కంపూడి రాజా చెక్.. మాజీ ఎమ్మెల్యే స్కెచ్‌తో తిరగబడ్డ ఫలితాలు!

Tags

Related News

డిఫెన్స్ మద్యం బాటిళ్లతో.. దందా చేస్తున్న రెండు జంటలు!

కరీంనగర్‌కు రానున్న నితిన్ నబీన్.. భారీ పాదయాత్రకు బిగ్ ప్లాన్!

కాంగ్రెస్ పాలనపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన మన్నె క్రిశాంక్!

హామీలు నెరవేర్చాలని పబ్లిక్ ఆస్తులు అమ్ముతారా.. ప్రభుత్వంపై నారాయణరెడ్డి ఫైర్!

పొలం మధ్యలో దర్జాగా గంజాయి సాగు కలకలం.. ఎక్కడంటే?

మేడ్చల్‌లో పౌరసరఫరాల శాఖ దాడులు.. 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు!

మీ ఇంట్లో పాత బట్టలు ఉన్నాయా.. మల్కాజిగిరి మున్సిపాలిటీ వినూత్న ప్రయోగం!

Big Stories

Advertisement
×