Gundeninda GudiGantalu Today episode November 8th: రెస్టారెంట్ కి వెళ్దామని ఇద్దరూ కలిసి వెళ్లిపోతారు.. అయితే ఇద్దరూ అక్కడికి వెళ్ళగానే నీతూ వచ్చే రవి శృతి నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని అంటారు. ఏంటి ఏమైంది ఎందుకు? నాకోసం వెయిట్ చేస్తున్నావు ఏం జరిగింది అని నీతును శృతి అడుగుతుంది. మన రెస్టారెంట్ ఫుడ్ రివ్యూ కోసం వచ్చారు కదా వాళ్ళు చాలా బాగుందని కామెంట్ చేశారు.. చిన్న రివ్యూ తో మన రెస్టారెంట్ పేరు ఎక్కడికో వెళ్ళిపోతుంది అని నీతూ అనగానే అవునా నిజమా అని ఇద్దరు సంతోషపడతారు. అయితే ఈ శుభ సమయంలో హెడ్ చెఫ్ ని వేరే రాష్ట్రం నుంచి తీసుకునే రావాలి అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు అని అడుగుతుంది.
రవి ఆ మాట అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. నువ్వు నన్నే హెడ్ చెఫ్ ను చేస్తావని అనుకున్నాను చాలా ఆశపడ్డాను. కానీ నువ్వు ఇలా అంటావని నేను అసలు ఊహించలేదు. ఎలాగైనా సరే రవి అనగానే శృతి అది నీ ప్రాబ్లం నేను దీనికోసం ఎంతో కష్టపడ్డానో అది నీకు కూడా తెలుసు కానీ నువ్వు ఇలా అనుకుంటే నేను ఏమి చేయలేను అని నీతూ అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అతను ఇలా మాట్లాడతావా నేను అసలు ఊహించలేదు ఎందుకు నువ్వు ఇలాంటి మాటలు అంటున్నావు అని చాలా బాధపడిపోతుంది శృతి. రవి వల్లే ఈ రెస్టారెంట్ పూర్తిగా మారిపోయింది అలాంటిది ఇప్పుడు ఇలా మీరు మాట్లాడటం ఏమీ బాగోలేదు అని శ్రుతి సీరియస్ అవుతుంది..
ఈ రెస్టారెంట్ కోసం రవి ఎంతో చేశాడు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా రెస్టారెంట్ కోసమే పని చేశాడు ఆ విషయం నీకు కూడా తెలుసు. అలాంటి రవిని హెడ్ చెఫ్ గా చేయకుండా ఎవరినో హెడ్గా తీసుకురావడం ఏంటి అని శ్రుతి పెద్ద రచ్చ చేస్తుంది. ఇది కాకపోతే ఇంకొక పది ఉంటాయని శృతి అనగానే నేను నా బిజినెస్ డెవలప్ చేసుకోవాలని చూసాను. అంతే తప్ప మీరు ఇలా అంటరు నేను అసలు నీతో అంటుంది. ఇక శృతి రవిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రవి ఎంత చెప్తున్నా కూడా శృతి వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అంటుంది రవి అక్కడి నుంచి వచ్చేస్తాడు.
బాలు మీనా ఇద్దరు కూడా సంతోషంగా గుడికి వెళ్తారు. అయితే వీళ్ళిద్దరూ సుమతి కాబోయే భర్తని కలవడానికి వస్తున్నాము అని చాలా సంతోషంగా ఉంటారు. సుమతి అరుణ్ తో చాలా సరదాగా మాట్లాడుతూ సరసాలు వాడుతూ ఉండడం చూసిన బాలు ఒక్కసారిగా కోపంతో రగిలిపోతాడు. అయితే రీ నా మరదలు చెయ్య పట్టుకుంటావు ఎంత ధైర్యం రానివ్వని అరుణ్ణి కొడతాడు. సుమతి ఏంటి బావ నువ్వు? ఏం చేస్తున్నావ్ అర్థం అవుతుందా అని ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా బాలు మాత్రం అరుణ్ నీ కొడుతూనే ఉంటాడు. ఎందుకు బావ అలా కొడుతున్నావు ఇతనే నేను ప్రేమించింది ఇతన్ని పరిచించడానికి మిమ్మల్ని గుడికి రమ్మని చెప్పాను అని చెప్పగానే మీనా బాలు ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. మేమిద్దరం ఇష్టపడుతున్నాము పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము అని చెప్పగానే ఇద్దరు ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళిపోతారు.
ఇతనే నేను ప్రేమించాను ఇతని పరిచయం చేయడానికి మిమ్మల్ని గుడికి రమ్మని పిలిచాను మీరు ఇప్పుడు ఇలా అతన్ని కొడుతున్నారు అంటే నాకు చాలా బాధగా ఉంది అని సుమతి అంటుంది. వీడిన నువ్వు ప్రేమించింది వీడి గురించి తెలిస్తే నువ్వు ఎప్పటికీ వీడి మొహం కూడా చూడవు అని సుమతికి బాలు చెప్తాడు. నేను ఇష్టపడి ప్రేమించాను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ఎందుకు బావని ఇలా మాట్లాడుతున్నావు అంత సుమతి అడుగుతుంది ఇక మీనా అతని గురించి నీకు తెలిసే నువ్వు ప్రేమించావా మీ బావని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అవమానించారు పోలీస్స్టేషన్లో ఎన్నోసార్లు కూర్చోబెట్టడంటూ మీనా మాట్లాడడంతో సుమతి మౌనంగా ఉంటుంది. ఇక అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. మరి రేపటి ఎపిసోడ్లో సుమతి బాలు మాటను కాదని అరుణ్ణి పెళ్లి చేసుకుంటున్నా లేదా అన్నది చూడాలి..