E-Paper
Advertisement

అప్పుల్లో కురుకుపోయినా?.. ఈ పథకాల్లో సేవింగ్స్ కోర్టులు జప్తు చేయలేవ్.. అవేంటంటే?

అప్పుల్లో కురుకుపోయినా?.. ఈ పథకాల్లో సేవింగ్స్ కోర్టులు జప్తు చేయలేవ్.. అవేంటంటే?
Advertisement

Safe Savings For Creditors:ఇప్పుడు ఒక్క ఫోన్ కాల్ తో కూడా లోన్ ఇచ్చేస్తున్నారు. ఎంత సులభంగా లోన్ ఇస్తున్నాయో.. తిరిగి చెల్లించకపోతే.. అంతే ఈజీగా ఆస్తులు జప్తు చేస్తున్నాయి రుణ సంస్థలు. కానీ అప్పు అంటే ఆస్తులన్నింటినీ కోల్పోవడం అని మాత్రం కాదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా.. కుటుంబ సభ్యుల ఆర్థిక భద్రత కోసం కొన్ని పొదుపు మార్గాలున్నాయి. వీటిని రుణ సంస్థలు, బ్యాంకులు, కోర్టులు జప్తు చేయలేవు. అవే ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎన్‌పీఎస్, గ్రాట్యుటీ వంటి సేవింగ్స్. వీటికి చట్టపరమైన రక్షణ ఉంటుంది.

ఏ సేవింగ్స్ పై

1. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF), గ్రాట్యుటీ: ఈపీఎఫ్ నిబంధనల చట్టం, 1952 సెక్షన్ 10(1) ప్రకారం, EPF ఖాతాలోని బ్యాలెన్స్‌ను కోర్టు జప్తు చేయలేదు. అలాగే గ్రాట్యుటీ చెల్లింపు చట్టం, సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 60 ప్రకారం గ్రాట్యుటీని కూడా కోర్టులు జప్తు చేయలేవు.

Advertisement

2.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): PPF అనేది ఒక పెట్టుబడి మార్గం. ఈ పెట్టుబడులపై సుమారు 7.5 శాతం రాబడి లభిస్తుంది. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. 1968 నాటి PPF చట్టం ప్రకారం, రుణ సంస్థల అప్పు చెల్లించడానికి కోర్టు ఈ ఫండ్ ను జప్తు చేయలేదు. అయితే, డిఫాల్ట్ లేదా మోసపూరిత లావాదేవీలుగా నిర్థారిస్తే ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు పీపీఎఫ్ ను జప్తు చేయవచ్చు.

3. నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS): PFRDA చట్టం, 2015 ప్రకారం, NPS టైర్ I ఖాతాలో ఉన్న సేవింగ్స్ ను కోర్టు జప్తు చేయలేదు. అంటే చందాదారుడు అప్పు తీర్చకపోతే.. ఆ బకాయిలను వసూలు చేయడానికి ఎన్పీఎస్ మొత్తాన్ని ఉపయోగించలేరు.

Advertisement

4. మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ (MWP) చట్టం 1874 ప్రకారం భార్య, పిల్లల జీవిత బీమా పాలసీకి రక్షణ కల్పించే రూల్ ఉంది. ఈ చట్టం కింద లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే, పాలసీదారుడికి అప్పులు ఉన్నా, బీమా మొత్తం నేరుగా కుటుంబానికే చెందుతుంది. అప్పుల కోసం బ్యాంకులు, రుణ సంస్థలు ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయలేవు.

5. రద్దు చేయలేని ట్రస్ట్ ఆస్తులు: చెల్లుబాటులో ఉన్న ట్రస్ట్ ఆస్తులు వ్యక్తిగత ఆస్తిగా పరిగణించరు. ట్రస్ట్ ఆస్తులను రుణ సంస్థలు జప్తు చేయలేవు. కానీ బ్యాంకులను మోసం చేయాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ఏర్పాటు చేశారని నిరూపిస్తే రుణ సంస్థలు వాటిని క్లెయిమ్ చేయవచ్చు.

స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్, కుటుంబ రక్షణ కోసం తీసుకున్న పథకాలలోని పొదుపు మొత్తాలను రుణ సంస్థలు క్లెయిమ్ చేయలేవు. ఎందుకంటే.. వీటిల్లో నామినీలు లేదా కుటుంబ సభ్యుల పేర్లు క్లియర్ గా పేర్కొంటారు. దీంతో ఆ మొత్తాన్ని వారికే చెల్లించేలా చట్ట నిబంధనలు ఉన్నాయి.

Also Read: సీనియర్ సిటిజన్లకు సూపర్ స్కీమ్.. పన్ను ప్రయోజనాలు, నెలకు రూ.20 వేల రిటర్న్స్!

ఉదాహరణకు

ఒక బ్యాంకు హోమ్ లోన్ ఇస్తే, ఆ ఇంటినే పూచీకత్తుగా పరిగణిస్తుంది. అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి కట్టకపోతే, బ్యాంకు ఆ ఇంటిని అమ్మి తన బకాయిలను వసూలు చేసుకోవచ్చు. కానీ అప్పు మొత్తాన్ని ఆ వ్యక్తికున్న EPF లేదా PPF పొదుపు ఖాతాల నుంచి వసూలు చేయలేదు. కుటుంబ భవిష్యత్తు కేటాయించిన పొదుపు మొత్తాలను రుణ సంస్థల అప్పుల పరిధిలోకి రావని చట్టలు చెబుతున్నాయి. అయితే EPF, PPF ఖాతాల్లో 1.5 లక్షల రూపాయల గరిష్ట పరిమితికి మాత్రమే నిబంధనలు వర్తిస్తాయి.

 

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×