E-Paper
Advertisement

పెట్రోల్, డీజిల్ ధరల్లో నో ఛేంజెస్, ఇవాళ ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

పెట్రోల్, డీజిల్ ధరల్లో నో ఛేంజెస్, ఇవాళ ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
Advertisement

Petrol, Diesel Prices on April 25: పెట్రోల్, డీజిల్ ధరలపై గత కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. భారీగా ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం ఆ వార్తలను కొట్టిపారేసింది. ధర పెంపు ఆలోచన లేదని ప్రకటించింది. ఏప్రిల్ 25 నాటికి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెద్దగా మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఊగిసలాటకు లోనవుతున్నప్పటికీ, దేశంలో వినియోగదారులకు వెంటనే ధరల భారం పడకుండా ఆయిల్ కంపెనీలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి.  ప్రస్తుతం ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల ప్రభావం

ఇటీవలి కాలంలో మధ్యప్రాచ్య ప్రాంతంలో పెరిగిన ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ లాంటి దేశాల మధ్య పరిస్థితులు తీవ్రంగా మారడంతో, హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాపై అనిశ్చితి నెలకొంది. ప్రపంచ సరఫరాలో ఈ మార్గం కీలకమైనది కావడంతో, ధరలపై ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ, భారత ప్రభుత్వం తక్షణ ప్రభావం వినియోగదారులపై పడకుండా చూసే ప్రయత్నం చేస్తోంది.

దేశంలో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు

Advertisement

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు చూస్తే, న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కొద్దిగా తేడాలతో ఉన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 107కి పైగా ఉండగా, డీజిల్ ధర కూడా రూ.95కు దగ్గరగా ఉంది. ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లో కూడా ధరలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఈ తేడాలకు ప్రధాన కారణం రాష్ట్రాల వారీగా ఉండే పన్నులు. ఏప్రిల్ 25 నాటికి భారత్ లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పరిశీలిద్దాం..

నగరం పెట్రోల్ (రూ/లీ) డీజిల్ (రూ/లీ)

⦿ న్యూఢిల్లీ  రూ.94.72- రూ.87.62

Advertisement

⦿ ముంబై రూ.104.21- రూ.92.15

⦿ కోల్‌కతా రూ.103.94- రూ. 90.76

⦿ చెన్నై రూ.100.75- రూ.92.34

⦿ అహ్మదాబాద్ రూ.94.49- రూ. 90.17

⦿ బెంగళూరు రూ.102.92- రూ.89.02

⦿ హైదరాబాద్ రూ.107.46- రూ.95.70

⦿ జైపూర్ రూ.104.72- రూ. 90.21

⦿ లక్నో రూ.94.69- రూ. 87.80

⦿ పూణే రూ.104.04- రూ.90.57

⦿ చండీగఢ్ రూ.94.30- రూ. 82.45

⦿ ఇండోర్ రూ.106.48- రూ. 91.88

⦿ పాట్నా రూ.105.58- రూ. 93.80

⦿ సూరత్ రూ.95.00- రూ. 89.00

⦿ నాసిక్ రూ.95.50- రూ. 89.50

ఫ్యూయెల్ ధరల్లో తేడాలు ఎందుకు?

దేశంలో ఇంధన ధరలు ఎందుకు నగరానికొకలా ఉంటాయంటే, కేంద్ర పన్నులతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ కారణంగా మార్పులు వస్తాయి. అంతేకాకుండా, రూపాయి విలువ, ముడి చమురు ధరలు, శుద్ధి ఖర్చులు కూడా ప్రభావం చూపుతాయి. అందుకే ఒకే దేశంలో వేర్వేరు నగరాల్లో వేర్వేరు ధరలు కనిపిస్తాయి.

ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? అనే డౌట్ చాలా మందిలో ఉంది. ప్రస్తుతానికి ధరలను నియంత్రించేందుకు ఆయిల్ కంపెనీలు ప్రయత్నిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు ఎక్కువ కాలం పెరిగి ఉంటే భవిష్యత్తులో మార్పులు రావచ్చు. రూపాయి బలహీనత కూడా దీనికి కారణమవుతుంది. ప్రస్తుతానికి   ప్రపంచ మార్కెట్లో పరిస్థితులు అస్థిరంగా ఉన్నప్పటికీ,  భారతదేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉండటం వినియోగదారులకు కొంత ఊరటనిస్తుంది.

Read Also: మారుతి డిజైర్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!

Related News

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

నల్లగొండ జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు, ఏడాదిలో 11 వేలకు పైగా కొనుగోళ్లు!

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

మారుతి కస్టమర్లకు షాక్.. మళ్లీ ధరలు పెంపు, ఈసారి ఎంతంటే?

Big Stories

Advertisement
×