E-Paper
Advertisement

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ రివ్యూ: సూర్య ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి?

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ రివ్యూ: సూర్య ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి?
Advertisement

Viswanath And Sons : సూర్య ప్రధాన పాత్రలో, ‘లక్కీ భాస్కర్’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఓ సున్నితమైన కుటుంబ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ సినిమాలతో అలరించిన సూర్య ఈసారి ఫ్యామిలీ ఎమోషన్స్‌ను నమ్ముకున్నారు. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు మెప్పించింది? కథ, కథనం ఎలా ఉన్నాయి? చూద్దాం.

సినిమా కథలోకి వెళ్తే..

సంజయ్ విశ్వనాథ్ (సూర్య) 40 ఏళ్ల వయసున్న అంతర్జాతీయ స్థాయి పిస్టల్ షూటర్. భార్య లేకుండా తన కుమారుడి బాధ్యతలను చూసుకుంటూ జీవిస్తుంటాడు. అయితే కొడుకుకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అవసరం కావడంతో సరైన డోనర్ కోసం అతడు విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో 20 ఏళ్ల మ్యాడీ మమితా బైజు అతడి జీవితంలోకి వస్తుంది. మొదట సరదాగా మొదలైన పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. తన ప్రేమను మ్యాడీ సంజయ్‌కు చెప్పిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? తండ్రిగా సంజయ్ తన కుమారుడిని కాపాడుకోగలిగాడా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది?

Advertisement

సంజయ్ పాత్రలో సూర్య మరోసారి తన అనుభవాన్ని చూపించారు. ఒకవైపు కెరీర్ చివరి దశలో ఉన్న క్రీడాకారుడిగా, మరోవైపు కుమారుడి కోసం తపించే తండ్రిగా ఆయన నటన చాలా సహజంగా సాగింది. మమితా బైజు తన చలాకీతనం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫస్ట్ హాఫ్‌లో సినిమాకు మంచి జోష్ తీసుకొచ్చింది. సూర్య తల్లి పాత్రలో రాధిక శరత్‌కుమార్ కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. ఇతర నటీనటులు కూడా తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

సినిమా ఎలా ఉందంటే..?

ఈ చిత్రానికి కథ కంటే భావోద్వేగాలే ప్రధాన బలం. ప్రారంభంలో కొంచెం నెమ్మదిగా అనిపించినా, కొద్దిసేపటికే కథనం వేగం పుంజుకుంటుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో వినోదం, కుటుంబ భావోద్వేగాలు చక్కగా కలిశాయి. దర్శకుడు ప్రధాన కథను వదిలిపెట్టకుండా ఫన్, ఎమోషన్ మధ్య మంచి బ్యాలెన్స్ తీసుకొచ్చాడు. దీంతో ఇంటర్వెల్ వరకు సినిమా ఆసక్తికరంగా సాగుతుంది.

Advertisement

అయితే సెకండాఫ్‌లో మాత్రం అదే స్థాయి కంటిన్యూటీ కనిపించదు. కథకు అవసరం లేని కొన్ని అంశాలు జత కావడంతో కథనం కొంత గందరగోళంగా మారుతుంది. ఫన్ తగ్గిపోయి ఎమోషనల్ డ్రామా ఎక్కువవుతుంది. ద్వితీయార్థంలో స్క్రీన్‌ప్లే మరింత పకడ్బందీగా ఉంటే సినిమా స్థాయి మరో రేంజ్‌లో ఉండేది. అయినప్పటికీ క్లైమాక్స్‌ను దర్శకుడు మరీ నిరాశపరిచేలా కాకుండా ఓకే అనిపించే విధంగా ముగించారు.

సినిమా టెక్నికల్‌గా..

వెంకీ అట్లూరి రాసిన డైలాగ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో మాటలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాకు తగ్గట్టుగానే ఉంది. నిమిష్ రవి కెమెరా పనితనం చాలా బాగుంది. విదేశీ లొకేషన్స్, సన్నివేశాలను రిచ్‌గా చూపించారు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్..

సూర్య, మమితా బైజు, రాధిక శరత్‌కుమార్ నటన

ఫస్ట్ హాఫ్‌లో వినోదాత్మకమైన కథనం

బలమైన ఎమోషనల్ డైలాగ్స్

ఆకట్టుకునే క్లైమాక్స్

మైనస్ పాయింట్స్..

బలహీనమైన సెకండాఫ్

అవసరం లేని సబ్‌ప్లాట్స్

ఎక్కువైన మెలోడ్రామా

కొన్ని చోట్ల నెమ్మదిగా సాగే కథనం

చివరి ఆఖరి మాటగా :-

‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో మంచి కథకు కావాల్సిన మెటీరియల్ ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌ను చక్కగా పండించే అవకాశం కనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే తడబడటంతో ఆ స్థాయికి సినిమా చేరుకోలేకపోయింది. అయినప్పటికీ వల్గారిటీకి దూరంగా ఉండే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ వీకెండ్‌లో కుటుంబంతో కలిసి ఓసారి చూడొచ్చు.

VISWANATH AND SONS RATING : 2.5/5

Related News

The Paradise Review : ‘ది ప్యారడైజ్’.. నాని కొత్త ప్రయోగం ఏమైందంటే?

ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ..నాని ఖాతాలో హిట్టు పడినట్టేనా?

సీక్రెట్ సోల్జర్ మూవీ రివ్యూ…

సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

టైటిల్ మాత్రమే ‘ఎపిక్’.. సెకండ్ హాఫ్ అంతా ‘ట్రాఫిక్’!

ఎపిక్ ట్విట్టర్ రివ్యూ… బేబీ జంట హిట్ కొట్టారా?

‘సర్దార్ 2’ మూవీ రివ్యూ: ఇలా చేశావేంటి కార్తి?

సుహాస్ – సూరి మండాడి మూవీ రివ్యూ.. పోరులో నెగ్గిందెవరు?

Big Stories

Advertisement
×