E-Paper
Advertisement

జహీరాబాద్‌లో రేషన్ బియ్యం మాయం.. డీలర్లపై కేసులు నమోదు!

జహీరాబాద్‌లో రేషన్ బియ్యం మాయం.. డీలర్లపై కేసులు నమోదు!
Advertisement

Ration Rice: స్వేచ్చ బ్యూరో: పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. జహీరాబాద్‌ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో గత మూడు రోజులుగా తహసీల్దార్‌ దశరథ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆకస్మిక తనిఖీల్లో భారీగా బియ్యం నిల్వల్లో తేడాలు గుర్తించారు.

బియ్యం నిల్వల్లో భారీ వ్యత్యాసం..

శుక్రవారం బుర్దిపాడ్‌, బూచనెల్లి గ్రామాల్లోని రేషన్‌ దుకాణాలను తనిఖీ చేయగా బియ్యం నిల్వల్లో భారీ వ్యత్యాసం బయటపడింది. బుర్దిపాడ్‌ రేషన్‌ షాపులో ఏకంగా 95 క్వింటాళ్ల బియ్యం గోల్‌మాల్‌ జరిగినట్లు అధికారులు గుర్తించారు. అలాగే బుచనెల్లి రేషన్‌ షాపులోనూ 16 క్వింటాళ్ల బియ్యం తేడా ఉన్నట్లు నిర్ధారించారు. ఇటీవల రేషన్‌ బియ్యం లోడ్‌ వచ్చిన సమయంలోనే బుర్దిపాడ్‌ షాపు నుంచి 20 క్వింటాళ్ల బియ్యాన్ని తరలించినట్లు తనిఖీల్లో వెల్లడైనట్లు తహసీల్దార్ తెలిపారు.

కేసులు నమోదు..

Advertisement

ఈ అక్రమాలపై స్పందించిన అధికారులు రెండు రేషన్‌ దుకాణాలను సీజ్‌ చేసి, సంబంధిత ఇద్దరు డీలర్లపై పౌరసరఫరాల నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపనున్నట్లు తహసీల్దార్‌ దశరథ్‌ వెల్లడించారు. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టించినా, దుర్వినియోగం చేసినా ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో సివిల్‌ సప్లై డీటీ బస్వరాజ్‌, ఆర్‌ఐ ఖాజా కుతుబోద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read: కడుపులో విషం పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. సీఎం రేవంత్ ఫైర్!

Tags

Related News

మెక్సికో ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలకు.. హుస్నాబాద్ ఆడబిడ్డ ఎంపిక!

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ విడుదల

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొని డిగ్రీ విద్యార్థి మృతి

కడుపులో విషం పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. సీఎం రేవంత్ ఫైర్!

హైదరాబాద్ ‘డిజిటల్ అరెస్ట్’ మరణం కేసులో.. కీలక నిందితుడు అరెస్ట్!

ఆటో డ్రైవర్లకు సర్కారు బంపర్ ఆఫర్.. రూ.220 కోట్లతో 2,000 ఫ్లాట్లు.. ఎక్కడెక్కడ కడుతున్నారంటే?

హెచ్‌ఐసీసీ భారత్ సమ్మిట్‌లో.. మంత్రి సీతక్క భావోద్వేగ ప్రసంగం!

Big Stories

Advertisement
×