E-Paper
Advertisement

మెక్సికో ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలకు.. హుస్నాబాద్ ఆడబిడ్డ ఎంపిక!

మెక్సికో ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలకు.. హుస్నాబాద్ ఆడబిడ్డ ఎంపిక!
Advertisement

Shailaja Footballer: స్వేచ్చ బ్యూరో: అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీల్లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన యువ క్రీడాకారిణి బానోతు శైలజకు దక్కింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం హాథిరాం అంబానాయక్ తండాకు చెందిన బానోతు రవి, సునీత దంపతుల కుమార్తె శైలజ 2027 జనవరి 17 నుంచి 23 వరకు మెక్సికో సిటీలో నిర్వహించనున్న స్లమ్ సాకర్ కేవీఎస్ టీమ్ ఇండియా హోమ్‌లెస్ ప్రపంచకప్ పోటీలకు ఎంపికైంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.

12 జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని..

శైలజ హుస్నాబాద్ లోని బెజ్జంకి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న సమయంలో ఫుట్‌బాల్‌పై ఆసక్తి పెంచుకుంది. మెదక్ ఫుట్‌బాల్ అకాడమీలో శిక్షణ పొందింది. ఇప్పటివరకు 12 జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటింది. ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో డిగ్రీ చదువుతోంది. అంతర్జాతీయ పోటీలకు ఎంపికైనప్పటికీ నిరుపేద కుటుంబానికి చెందిన ఆమెకు మెక్సికో ప్రయాణ ఖర్చులు భారంగా మారాయి.

మంత్రి పొన్నం చొరవతో ఆర్థిక సాయం..

Advertisement

శైలజ పరిస్థితిని తెలుసుకున్న హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఆమెను, కుటుంబ సభ్యులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. మెక్సికో వెళ్లేందుకు అవసరమైన వీసా, విమాన టికెట్లు, రవాణా ఖర్చులను ప్రభుత్వం తరఫున భరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి లేఖ రాసి రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలని కోరారు.

వెంటనే స్పందించిన మంత్రి వాకిటి శ్రీహరి..

మంత్రి పొన్నం విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి వాకిటి శ్రీహరి శైలజను అభినందించి, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు వీసా, విమాన టికెట్లు, ప్రయాణ ఖర్చుల నిమిత్తం రూ.1,00,000 ఆర్థిక సాయం మంజూరు చేశారు. పోటీల్లో ప్రతిభ చాటి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తమ కుమార్తెకు ఆర్థికంగా అండగా నిలిచిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరికి, రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి, రాష్ట్ర ప్రభుత్వానికి శైలజ, ఆమె తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Also read: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ విడుదల

Tags

Related News

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ విడుదల

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొని డిగ్రీ విద్యార్థి మృతి

కడుపులో విషం పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. సీఎం రేవంత్ ఫైర్!

హైదరాబాద్ ‘డిజిటల్ అరెస్ట్’ మరణం కేసులో.. కీలక నిందితుడు అరెస్ట్!

ఆటో డ్రైవర్లకు సర్కారు బంపర్ ఆఫర్.. రూ.220 కోట్లతో 2,000 ఫ్లాట్లు.. ఎక్కడెక్కడ కడుతున్నారంటే?

హెచ్‌ఐసీసీ భారత్ సమ్మిట్‌లో.. మంత్రి సీతక్క భావోద్వేగ ప్రసంగం!

జీహెచ్ఎంసీకి ఏమైంది? ఆదాయం లేకపోయినా ఆ రెండు కార్పొరేషన్ల భారం ఎందుకు?

Big Stories

Advertisement
×