E-Paper
Advertisement

ఏపీకి సినీ పరిశ్రమ.. మంత్రి లోకేశ్ మాస్టర్ ప్లాన్.. వైజాగ్‌కు ‘భల్లాలదేవుడి’ కీలక భరోసా!

ఏపీకి సినీ పరిశ్రమ.. మంత్రి లోకేశ్ మాస్టర్ ప్లాన్..  వైజాగ్‌కు ‘భల్లాలదేవుడి’ కీలక భరోసా!
Advertisement

Vizag Film Industry: విశాఖలో సినీ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి సీఐఐ సమ్మిట్ – 2026 వేదికపై ఆసక్తికర సంభాషణ జరిగింది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, సినీ నటుడు దగ్గుబాటి రానా మధ్య జరిగిన పోడ్ కాస్ట్ లో ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ ఏపీకి సినీ పరిశ్రమను తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రశ్నకు మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎకో సిస్టమ్ (ఫిల్మ్ స్టూడియోలు, డబ్బింగ్ స్టూడియోలు) విశాఖలోనూ ఏర్పాటు చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.

విశాఖలో సినీ పరిశ్రమ ఏర్పాటుకు సినీ పెద్దలు ముందుకు రావాలని ఈ సందర్భంగా నారా లోకేశ్ పిలుపునిచ్చారు. వారికి ప్రభుత్వం తరపున అన్ని రకాల రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అంతేకాకుండా వైజాగ్ లో ప్రత్యేకంగా ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీని ఏర్పాటు చేసే బాధ్యతను తాను రానాకు అప్పగిస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ అన్నారు. దీనిపై నటుడు రానా సైతం ఎంతో సానుకూలంగా స్పందించారు. విశాఖలో సినీ పరిశ్రమ ఏర్పాటుకు తాను కృషి చేస్తానని లోకేశ్ కు హామీ ఇచ్చారు. సోమవారం నుంచే ఈ దిశగా పనులు ప్రారంభిస్తానని చేతిలో చేయి వేసి మాటిచ్చారు.

Advertisement

Also Read: జియో అదిరిపోయే ఆఫర్.. రూ.111, రూ.459 రీఛార్జ్‌లపై.. ఫ్రీగా స్నాప్‌చాట్ సబ్‌స్క్రిప్షన్!

వైజాగ్ లో సినిమా, గేమింగ్‌తో పాటు డిజిటల్ మీడియా, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి వివిధ రంగాల్లో క్రియేటర్ ఎకానమీని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో తాను కలిసి పని చేస్తానని రానా వెల్లడించారు. ఇక్కడి యువతలో ఎంతో ప్రతిభ ఉందని.. సరైన అవకాశాలు, ప్రోత్సాహం, ఆధునిక సాంకేతికతను అందిస్తే ప్రపంచ స్థాయి కంటెంట్ ను  వారు రూపొంచగలరని పేర్కొన్నారు. విశాఖను ఎంటర్ టైన్ మెంట్ కేంద్రంగా తీర్చిదిద్దితే స్థానిక యువతకు ఉపాధితో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఆటోమేటిగ్గా వస్తుందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Also Read: ‘భోగాపురంపై హ్యాపీగా లేను.. అది జరిగిన రోజు ఎంతో సంతోషిస్తా’.. రానాతో లోకేశ్ కీలక వ్యాఖ్యలు!

Tags

Related News

12 ఏళ్ల తర్వాత రాజమండ్రి నగర పోరు.. కూటమి జోరుకు వైసీపీ చెక్ పెడుతుందా?

చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ ఏపీకి ఉండటం అదృష్టం: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

ఏపీలో రూ.1.20 లక్షల కోట్లతో రహదారి ప్రాజెక్టులు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

సీఐఐ భాగస్వామ్య సదస్సులో.. ఏపీకి వచ్చిన మొత్తం పెట్టుబడులు ఇవే..?

ఏపీకి మరో భారీ తుఫాన్ ముప్పు.. ‘అక్వాన్’ తుఫాన్‌ అనే పేరుతో నామకరణం!

‘భోగాపురంపై హ్యాపీగా లేను.. అది జరిగిన రోజు ఎంతో సంతోషిస్తా’.. రానాతో లోకేశ్ కీలక వ్యాఖ్యలు!

నాడు చదువుకు పండుగ.. నేడు దండుగ.. ఫీజు బకాయిలపై వైఎస్ షర్మిల ధ్వజం

Big Stories

Advertisement
×