E-Paper
Advertisement

Vaazha 2 Telugu Review: మలయాళంలో రూ.210 కోట్లు.. తెలుగులో దుమ్ములేపుతుందా?

Vaazha 2 Telugu Review: మలయాళంలో రూ.210 కోట్లు.. తెలుగులో దుమ్ములేపుతుందా?
Advertisement

Vaazha 2 Telugu Review: మలయాళంలో తక్కువ బడ్జెట్ తో రూపొంది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న చిత్రం వాలా 2: బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్ (Vaazha 2). ఏప్రిల్ మొదటి వారంలో విడుదలైన ఈ సినిమా మూడు వారాల లోపే రూ.210 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లోకి వచ్చింది ఈ సినిమా. అటు వాలా సినిమా ఇప్పటికే ఓటీటీ లో తెలుగువారిని ఆకట్టుకోగా.. థియేటర్లో వచ్చిన వాలా 2 ఎలా ఉంది? అసలు ప్రేక్షకులకు వినోదాన్ని అందించిందా ?ముఖ్యంగా మలయాళం లో ఈ రేంజ్ లో కలెక్షన్లు సాధించిన ఈ సినిమా తెలుగులో దుమ్ములేపిందా ?అనేది ఇప్పుడు చూద్దాం..

నేపథ్యం:

కథ విషయానికి వస్తే.. హాషిర్, అలాన్ , అజిన్, వినాయక్ అనే నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ళు ఉంటారు. ఇంట్లో వాళ్లు కష్టపడి వీళ్ళని కాలేజీకి పంపిస్తుంటే.. వీళ్ళేమో చదువును పక్కనపెట్టి గొడవల్లోనే ముందుంటారు. కాలేజీ నుంచి గెంటేసే పరిస్థితి వస్తే ఒక పోలీస్ ఆఫీసర్ (ఆల్ఫోన్స్ పుత్రన్) ఎంట్రీ ఇచ్చి వీళ్ళని కాపాడతాడు. ఆ తర్వాత పరీక్షలు రాసే అవకాశం వస్తుంది. ఉన్నత చదువుల కోసం ఉపాధి కోసం యూకే వెళ్లాలనుకుంటారు. మరి ఈ నలుగురు యూకే వెళ్లాలనుకున్న తమ కలను నిజం చేసుకున్నారా? కాలేజీ బయట వీళ్ళ అసలైన బ్రతుకు చిత్రం ఎలా ఉంది? అనేది ఈ సినిమా.

విశ్లేషణ:

Advertisement

ముఖ్యంగా ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏమంటే ఫస్ట్ ఆఫ్ లో కుర్రాళ్ల అల్లరి.. ఆ థియేటర్ సీన్లు, కాలేజీ లవ్ ట్రాకులు చూస్తే మన కాలేజీ రోజులే గుర్తుకొస్తున్నాయి అనిపిస్తుంది. యూట్యూబ్ స్టార్స్ అయినప్పటికీ నటనలో మాత్రం అదరగొట్టేశారు. సెకండ్ హాఫ్ లో అసలైన మ్యాటర్ మొదలవుతుంది. తోబుట్టుల మధ్య ఉండే అనుబంధాన్ని గుండెలకు హత్తుకునేలా చూపించారు. క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం ఖచ్చితంగా కంటతడి పెట్టిస్తాయి. ఇక అనువాదం చేసిన సరే మన తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చాలా అద్భుతంగా చేశారు సినిమా. ఇకపోతే అక్కడక్కడ కుర్రాళ్ళ అల్లరి శృతిమించినట్లు అనిపిస్తుంది. అయితే ఇది అందరికీ నచ్చకపోవచ్చు. ముఖ్యంగా చదువు రాని వాళ్లను సమాజం వేస్ట్ అని ముద్ర వేస్తుంది. కానీ ఆ వేస్ట్ అనిపించుకునే వారి వెనుక కూడా ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుందని ఈ సినిమా నిరూపించింది. ఇకపోతే కథలో కొత్త పాయింట్ ఏం లేదు కానీ మళ్ళీ అదే ఫార్ములా.. ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్లకు కొంచెం ఇదేదో చూసినట్టుందే అనిపిస్తుంది.

బలాలు :

కథాంశం
కామెడీ
సెకండ్ హాఫ్ లో భావోద్వేగాలు

బలహీనతలు :

Advertisement

ఆల్రెడీ చూసేసిన ఫీలింగ్ కలగడం

అక్కడక్కడ శృతిమించిన అల్లరి

ఆఖరి ముచ్చట:

ఈ సినిమా ఒక కంప్లీట్ ప్యాకేజీ.. నవ్విస్తుంది. ఆలోచింపచేస్తుంది .అందరికీ కళ్ళల్లో నీళ్లు కూడా తెప్పిస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు లేకపోయినా కథలో దమ్ముంటే జనం ఎలా అయినా సరే బ్రహ్మరథం పడతారు అనడానికి ఈ సినిమా బెస్ట్ ఉదాహరణ. ఈ వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి, కొంచెం ఎమోషనల్ అవ్వడానికి ఇది మంచి ఆప్షన్.. ఓపిక ఉంటే థియేటర్ కి వెళ్లి చూడండి.లేదంటే ఓటీటీ వరకు ఎదురు చూడండి .కానీ ఒక్కసారి మాత్రం పక్కా చూడాల్సిన సినిమా.

Vaazha 2 Telugu Review రేటింగ్ 2.75/5

ALSO READ:‘ఆడు 3’ ఓటీటీ ఎంట్రీ.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ 

Related News

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

మకుటం మూవీ రివ్యూ: విశాల్ ఫ్యాన్స్‌కి పండగేనా? సినిమా ఎలా ఉందంటే?

హుషారు పిట్టలు మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

Big Stories

Advertisement
×