Coolie First Review:సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth )ప్రస్తుతం ఏడుపదుల వయసులో కూడా వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తూ.. యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేస్తున్నారు. రజినీకాంత్ సినీ కెరియర్ ముగిసింది.. ఆయన రిటైర్మెంట్ తీసుకుంటే బాగుంటుంది.. అని చాలామంది ఎగతాళి చేశారు. కానీ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో జైలర్ (Jailer) సినిమా చేసి, గట్టి కం బ్యాక్ ఇచ్చి ట్రోలర్స్ కామెంట్స్ కి చెక్ పెట్టారు. ఇప్పుడు అదే జోష్ తో లోకేష్ కనగరాజు (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు.
ఆగస్టు 14న పాన్ ఇండియా మూవీగా రాబోతున్న కూలీ ..
భారీ అంచనాల మధ్య ఆగస్టు 14వ తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో భారీగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో శృతిహాసన్ (Shruti Haasan), నాగార్జున (Nagarjuna ), అమీర్ ఖాన్ (Aamir Khan) , ఉపేంద్ర (Upendra ) వంటి భారీ తారాగణం కూడా భాగమయ్యింది దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు ఆగస్టు 2న విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై హైప్ పెంచేసింది. అంతేకాదండోయ్ బుక్ మై షోలో గంటలోనే లక్ష టికెట్లు బుక్ అయ్యి రికార్డు సృష్టించింది ఈ సినిమా.
వారికోసం ‘కూలీ’ మూవీ స్పెషల్ షో..
ఇకపోతే విడుదలకు కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఈరోజు స్పెషల్ షో వేశారు. కోలీవుడ్ ప్రముఖులు , అతి కొద్ది మంది ఎంపిక చేసిన అభిమానులతో పాటు మీడియా ప్రతినిధులు ఈ సినిమా ప్రైవేట్ స్క్రీనింగ్ కి హాజరయ్యారు. అయితే ఈ స్పెషల్ షో కి ఇప్పుడు భారీగా పాజిటివ్ టాక్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమా చూసినవారు ప్రత్యేకంగా ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
కూలి మూవీ ఫస్ట్ రివ్యూ..
అందులో భాగంగానే ఒకరు..” కబాలి మూవీ తర్వాత రజనీకాంత్ ఆ రేంజ్ లో పర్ఫామెన్స్ ఇచ్చిన మూవీగా కూలీ మూవీ రికార్డు సృష్టిస్తుంది. ఇందులో రజినీకాంత్ కంటే నాగార్జున స్పెషల్ సర్ప్రైజింగ్ గా అనిపిస్తారు. ముఖ్యంగా ఆయన వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సినిమాకి ఆయనే వెన్నెముక లాంటి వారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశాలకు సస్పెన్స్ తో ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం అంటూ ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.
రూ.1000 కోట్ల క్లబ్లో చేరడం గ్యారెంటీ..
అటు అమీర్ ఖాన్ కేమియో పాత్రకి బాలీవుడ్ థియేటర్లు మోత మోగిపోతాయి.శృతిహాసన్ క్యారెక్టర్రైజేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో ఫైట్స్, యాక్షన్ సీన్స్ విషయంలో లోకేష్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అనిరుద్ రవిచందర్ సంగీతం సినిమాకి మరో ప్లేస్ గా మారనుంది. ఈ సినిమా ఖచ్చితంగా రూ.1000 కోట్ల క్లబ్లో చేరుతుంది. 1000 కోట్లు రాబట్టిన తొలి తమిళ్ మూవీగా ఈ సినిమా రికార్డు సృష్టిస్తుంది అంటూ సినిమా చూసినవారు హైప్ ఇచ్చేస్తున్నారు. మరి ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత నిజంగానే ఈ హైప్ ను అందుకుంటుందా అనే విషయం తెలియాలి అంటే ఆగస్టు 14 వరకు ఎదురు చూడాల్సిందే
ఆ రూల్స్ ప్రవాహంలో కొట్టుకుపోతాయి – ఫ్యాన్స్
ఇకపోతే ఈ సినిమాలో యాక్షన్ పర్ఫామెన్స్ ఎక్కువగా ఉండడంతో సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అందులో భాగంగానే 18 ఏళ్లు నిండని వారికి కూలీ మూవీ చూడడానికి అనుమతి లేకపోయినా.. రజనీకాంత్ అభిమానుల ప్రవాహం ముందు ఈ రూల్స్ పనిచేయవు అని అటు తమిళ్ అభిమానులతో పాటు రజనీకాంత్ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు
Coolie Movie Review 🔥 🔥 🔥 🔥 🔥 #Coolie#CoolieReview #AamirKhan #Rajinikanth #NagarjunaAkkineni #ShrutiHaasan #LokeshKanagaraj #Anirudh #CoolieThePowerHouse https://t.co/Aad9Mxymdb
— Varinder Sinngh (@varindersingh24) August 8, 2025